
యంగ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర ‘బలుపు’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బాబీ ఓ ఛానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’ మూవీలో నటించే చాన్స్ వచ్చినట్లు చెప్పాడు.
అయితే పరువు పోతుందని ఆ మూవీలో నటించడానికి ఒప్పుకోలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబీ మాట్లాడుతూ.. ‘గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యుక్షుడిగా ఉన్న సమయంలో రైటర్ చిన్ని కృష్ణ తనని కలిసి హైదరబాద్‌కు వచ్చినప్పుడు కలవమని చెప్పారు. అలా ఓ సారి హైదరబాద్‌కు వచ్చి ఆయనను కలిశాను. వెంటనే ఆయన నన్ను రఘవేంద్ర రావు దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత కాసేపు నన్ను గమనించిన ఆయన గంగోత్రిలో అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా నటించే అవకాశం ఇచ్చారు.
అయితే ఈ సినిమాలో నిక్కర్ వేసుకోవాలని నా కోలతలు తీసుకోమ్మంటూ అసిస్టెంట్ డైరెక్టర్‌కు చెప్పారు. అయితే అలా నిక్కరులో కనిపిస్తే గుంటూరులో నా పరువు పోతుందని భయపడి వెంటనే నేను చేయనని చెప్పాను. మరీ ఏం చేస్తావని చిన్ని కృష్ణ అడిగారు. వెంటనే నేను కథలు రాస్తానని చెప్పాను. దీంతో గంగోత్రికి కొన్ని సన్నివేశాలు రాసే అవకాశం ఇచ్చారు. అలా నేను రాసిన సన్నివేశాలు రాఘవేంద్రరావు నచ్చి సినిమాలో పెట్టుకున్నారు. అలా రచయిత, డైరెక్టర్‌ను అయ్యాను’ అంటూ బాబీ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment