ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అల్లు-మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బన్నీ తనదైన నటనతో ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులోనే కాదు సౌత్ ఇండస్ట్రీల్లో సైతం విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. యలయాళంలో బన్నీని మల్లు అర్జున్‌గా ఫ్యాన్స్ పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. అలా ఇతర భాషల్లో సైతం స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
చదవండి: శ్రీరామ చంద్ర అసహనం.. ఫ్లైట్ మిస్ అయ్యిందంటూ కేసీఆర్‌కు ఫిర్యాదు
తొలి చిత్రంతోనే హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇందులో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే అంతగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు బన్నీ మొదటి చాయిస్ కాదంటూ అసక్తికర విషయం చెప్పాడు మెగా బ్రదర్ నాగబాబు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన ఈ సందర్భంగా మెగా హీరోల గురించి ప్రస్తావించారు. తమ ఫ్యామిలీ నుంచి ఇంత మంది హీరోలు వస్తారనుకోలేదన్నారు. ‘అన్నయ్య(మెగాస్టార్ చిరంజీవి)ను స్ఫూర్తిగా తీసుకునే మేం ఇండస్ట్రీకి వచ్చాం. ఆయన హీరో అయ్యారు. నన్ను నిర్మాతగా మార్చారు. అలా అన్నయ్య హీరోగా ఎదిగే క్రమంలో ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలను చూసి పిల్లలంతా ఇన్‌స్పైయిర్ అయ్యారు.
చదవండి: త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి.. భార్యతో కలిసి వేరు కాపురం!
ఇండస్ట్రీలో అయితే ఎలా అన్నయ్య స్పూర్తితో బయటి వాళ్లు హీరోలు అయ్యారో. అలాగే ఇంట్లో పిల్లలు కూడా ఆయన ఇన్‌స్పిరేషన్‌తో హీరోలు అయ్యారు. అలా అయిన వాళ్లలో బన్నీ కూడా ఒకడు. బన్నీ ఫస్ట్ గంగోత్రి ఆఫర్ వచ్చింది. కానీ నిజానికి గంగోత్రి ఆఫర్ ఫస్ట్ చరణ్ బాబు(రామ్ చరణ్)కు వచ్చింది. చరణ్ బాబుని అడిగినప్పుడు అన్నయ్య వద్దు అన్నాడు. చరణ్‌కి ఇంకా ఇంకాస్త మెచ్యూరిటీ రావాలి. యాక్టింగ్ లో ట్రైనింగ్ కావాలి. ఆ క్యారెక్టర్ బన్నీ అయితే బాగుంటాడు. తనని చేయమన్నాడు. అలా బన్నీ గంగోత్రి ఆఫర్ వచ్చింది. అలానే అనుకోకుండానే అందరికి ఆఫర్లు వచ్చాయి, హీరోలు అయ్యారు’’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment