చార్‌ధామ్‌గా ప్రసిద్ది చెందిన హిందూ పుణ్యక్షేత్రాలైన గంగోత్రి, యుమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల తలుపులు మూతపడనున్నాయి. చలికాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నాలుగు ఆలయాలను ఆరు నెలలపాటు మూసివేయానున్నారు. ఆ తర్వాత మళ్లీ వేసవికాలంలో చార్‌ధామ్ యాత్ర కొనసాగుతుంది.
కాగా ఈ ఏడాది మే 10వ తేదీన ప్రారంభం అయిన చార్‌ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు యమునోత్రి ధామ్ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్ ధామ్‌ను నవంబర్ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment