ఎన్నడూ లేనంతగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఏదీ కొందామన్న అగ్గిలాగ మండుతున్నాయి. ప్రధానంగా టమాటా ధర దడపుట్టిస్తోంది. సాధారణంగా రూ. 20, 30 కిలో ఉండే టమాట ఇప్పుడు సామన్యుడికి అందని ద్రాక్షగా మారింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే సెంచరీ దాటి టామాట మరింత పరుగులు పెడుతోంది. మరి కొన్ని చోట్ల ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. పెరిగిన ధరలతో ప్రజలు లబోదిబోమంటుంటో.. పలు చోట్ల ప్రభుత్వాలే సబ్సిడీ రేట్లలో టమాటాలను సరఫరా చేస్తున్నాయి.
ఇక ఉత్తర భారతదేశంలో టమాట ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఉత్తరఖాండ్ రాష్ట్రం గంగోత్రి ధామ్‌లో కిలో టమాట రూ. 250 పలుకుతోంది. ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ. 180 నుండి 200 వరకు ఉంది. యమునోత్రిలో కిలో టమాట రూ. 200 నుంచి 250 వరకు చేరింది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా రేట్లు పెరిగిపోయాయని.. కూరగాయల విక్రయదారుడు తెలిపారు. ఇటీవల తీవ్రల ఎండలు, అకాల వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు.
చదవండి: కొండెక్కిన ధరలు.. తోట నుంచి రూ. 2.5 లక్షల టమాట చోరీ
అదే విధంగా కోల్‌కతాలోరూ.152, ఢిల్లీలో రూ.120, బెంగుళూరులో రూ. 120గా ఉంది. చెన్నైలో రూ.100 నుంచి 130 పలుకుతుండటంతో స్థానిక రేషన్ షాపుల ద్వారా టమాట రూ. 60కే కిలో చొప్పున అందిస్తున్నారు. ఇక అత్యల్పంగా రాజస్థాన్‌లోని చురులో రూ.31గా ఉన్నది.
ఇతర కూరగాయలు కూడా
ధరల విషయంలో తామేమీ తీసిపోలేదని అల్లం, వంకాయటమాటాతో పోటీపడుతున్నాయి. కూరగాయల ఉత్పత్తిదారుల కమిటీ ప్రకారం కిలో అల్లం ధరం రూ.250 దాటగా, వంకాయ రూ.100 చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా గత పది రోజుల్లో 20 నుంచి 60 శాతం మధ్య పెరిగాయని అధికారులు తెలిపారు. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment