దేశంలో టమోటా ధరలు భారీగా పెరిగాయి. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన దక్షిణాది రాష్ట్రాల్లో కేజీ టమోటా రూ. 90 నుంచి రూ. 100 మధ్య ఉన్నాయి. ముంబైలో ఈ ధరలు రూ. 80 నుంచి రూ. 100 మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.
2024 ఏప్రిల్‌లో వైజాగ్, విజయవాడ రాష్ట్రాల్లోని హోల్‌సేల్ మార్కెట్‌లో 15 కేజీల టమోటాల ధర రూ. 150 నుంచి రూ. 200 మధ్య ఉండేది. అయితే ఇప్పుడు ఈ ధరలు అమాంతం పెరిగాయి. దీంతో 15 కేజీల టమోటాలు ధర రూ. 1100 నుంచి రూ. 1200లకు చేసింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కూడా కేజీ టమోటా ధర రూ. 75 నుంచి రూ. 80 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
వర్షాకాలంలో కూరగాయల ధరలు సాధారణంగా పెరుగుతాయి. వర్షం వల్ల పంట ఏపుగా పెరిగినప్పటికీ.. దిగుబడి మాత్రం చాలా తగ్గుతుంది. దీంతో ధరలు అమాంతం పెరుగుతాయి. ఈ ఏడాది ఓ వైపు వర్షాలు, మరోవైపు భారీ ఎండలు కారణంగా నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.
ఆలస్యమైన రుతుపవనాలు కూడా టమోటా తోటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ - జులై నెలల్లో టమాటో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కానీ సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం.. రుతుపవనాల ఆలస్యం కారణంగా టమోటా సాగును చాలామంది రైతులు వాయిదా వేశారు. టమోటా ధరలు మాత్రమే కాకుండా బంగాళదుంపలు, ఉల్లి వంటి ఇతర కూరగాయల ధరలు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment