
అధికారుల మధ్యలో సృష్టి గోస్వామి
న్యూఢిల్లీ: జాతీయ బాలి కాది నోత్సవం సందర్భంగా ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి వ్యవహ రించారు. సీఎం హోదాలో హరిద్వార్‌కు చెందిన 20 ఏళ్ల గోస్వామి ఆదివారం అధికారిక విధులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకా లను సమీక్షించారు. దేశవ్యాప్తం గా జనవరి 24న జాతీయ బాలికాది నోత్సవం జరుపుకునే విషయం తెలిసిందే. బాలికాదినోత్సవం సందర్భంగా బాలికలకు ప్రధాని మోదీ శుభాకాం క్షలు తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బాలికలకు విద్య, వైద్యం అందించే దిశగా తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వివరించారు. బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘బాలి కలందరికీ హృదయ పూర్వక శుభా కాంక్షలు. మీ సాధికా రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment