Wishes Greetings
-
ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘నెల రోజులపాటు అత్యంత నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది. రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే గొప్ప పండుగ రంజాన్. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుంది. కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తూ, దైవ చింతనతో గడిపే ఈ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు దానధర్మాల ద్వారా ఖర్చు చేస్తారు. ముస్లింలకు అల్లాహ్ దీవెనలు లభించాలని కోరుతున్నా. రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాక్షాంక్షలు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంఓ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రేపు(సోమవారం) నూతన సంవత్సరం 2024లోకి అడుగుపెడుతున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని సీఎం జగన్ కోరుకున్నారు. కాగా, సీఎం జగన్..‘రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలి. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి.. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. -
ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ప్రజలందరూ క్రిస్మస్ పండుగను జరుపుకోనున్నారు. కాగా, క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్ జగన్. -
అందుకే దేశం ఆయన్ని గౌరవించింది: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో దిగ్గజం, భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) ఇవాళ(మంగళవారం, నవంబర్ 8న) 96వ వడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఈ బీజేపీ దిగ్గజ నేత ఇంటికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపై ట్విటర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. అద్వానీగారి నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాను. భారతదేశ వృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. ఆయన దూరదృష్టి, మేధస్సు కారణంగా దేశమంతా ఆయన్ని గౌరవించింది. బీజేపీని నిర్మించడంలో, పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎనలేనిది. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యవంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. Went to Advani Ji’s residence and wished him on his birthday. His contribution to India’s growth is monumental. He is respected all across India for his vision and intellect. His role in building and strengthening the BJP is unparalleled. I pray for his long and healthy life. pic.twitter.com/Pdxy5Hko8d — Narendra Modi (@narendramodi) November 8, 2022 రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అద్వానీ నివాసానికి వెళ్లి కలిసొచ్చారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, మరరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, అద్వానీకి శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్లలో ఉన్నారు. आदरणीय लालकृष्ण आडवाणी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। आडवाणी जी ने अपने सतत परिश्रम से एक ओर देशभर में संगठन को मजबूत किया तो वहीं दूसरी ओर सरकार में रहते हुए देश के विकास में अमूल्य योगदान दिया। ईश्वर से उनके उत्तम स्वास्थ्य व सुदीर्घ जीवन की कामना करता हूँ। — Amit Shah (@AmitShah) November 8, 2022 బీజేపీ పుట్టుకలో కీలక పాత్ర పోషించారు ఎల్కే అద్వానీ. 1927, నవంబర్ 8న అద్వానీ కరాచీ(పాక్)లో జన్మించారు. ఆరెస్సెస్‌లో చేరిక ద్వారా ఆయన ప్రస్థానం మొదలైంది. రథయాత్ర ద్వారా ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. ఎన్డీయే హయాంలో 1998-2004 మధ్య ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. 2002 నుంచి వాజ్‌పేయి హయాంలో రెండేళ్లపాటు ఉపప్రధానిగానూ అద్వానీ పని చేశారు. -
కొత్తొక వింత.. పాతొక రోత!
Goodbye 2021 Welcome 2022: ఎంతకాదన్నా 2021 సంవత్సరం మన జీవితాల్లో చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. కరోనా మహమ్మారి, తుఫానుల వంటి విపత్తులతో విసిగివేశారిపోయాం. నాటి స్మృతులు ప్రతి ఒక్కరి మనోఫలకంపై ఎన్నటికీ చెరగని ముద్ర వేశాయనడంలో అతిశయోక్తి లేదు. చెడుతోపాటు కూసింత మేలు కూడా చేసిందిలే. ఆ మంచి ఏమిటోనని అనుకుంటున్నారా? గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమితోపాటు, ఓజోన్ను కూడా లాక్డౌన్ల రూపంలో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఐతే గుడ్డిలోమెల్లలా పర్యావరణ పరిరక్షణపై మంచి గుణపాఠమే నేర్పింది గడచిన ఏడాది (ఎడాపెడా ప్రకృతికి తీరని నష్టం చేశాం కదా). అంతేకాకుండా సైన్స్ ఆధునిక ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ఎంతో పురోగతి సాధించాం. కొత్త ఉపాధి అవకాశాలను అందించింది. ఐదే ప్రతి వంద సంవత్సరాలకు అంటువ్యాధులు ప్రభలుతాయనే నానుడి కూడా మరోవైపు లేకపోలేదు. ఏదిఏమైనప్పటికీ గతాన్ని మరచిపోయి వర్తమానాన్ని ఆస్వాధించడమే మన చేతుల్లో ఉంది. ఇక వాటన్నింటికీ వీడ్కోలు చేప్పే సమయం ఆసన్నమైంది. కొత్త సంతోషాలతో, నూతనోత్సాహంతో న్యూ ఇయర్‌కి వెల్కమ్ చేప్పే ఆ శుభ గడియలు దగ్గరపడ్డాయ్! 2022 నూతన సంవత్సరాన్ని ఏదైనా మంచి పనితో ప్రారంభించాలని వ్యక్తులతోపాటు సంస్థలు కూడా ప్రణాళికలకు పూనుకుంటున్నాయి. మళ్లీ మళ్లీ కొత్త సంత్సరాలను వేడుకగా జరుపుకోవాడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కానీ దుఃఖాలు, ఎత్తుపల్లాలు అనేక సార్లు దాటిన అనుభవం ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, గడచిన ఏడాదిని మాత్రం అంత త్వరగా జీర్ణించుకోలేకపోవడమనేది నగ్న సత్యం. వీటన్నింటికీ అతీతంగా సుఖదుఃఖాలను పంచుకునే ఆత్మీయులను పెంపొందించుకోవాలి. అలాగే అడ్డంకులను అధిగమించడానికి ఒక దేశం మరొక దేశానికి సహాయసహకారాలు అందించాలి. మనం మనుషులం కాబట్టి కలిసి జీవించాలి, కలిసి సమస్యలను పారదోలాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు! గతం గతః.. 2021 మిగిల్చిన చేదు గుర్తులను మరిచిపోదాం 2022లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుందాం.. కలిసికట్టుగా కష్టాలను తరిమి కొడదాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం.. మనోబలంతో ముందుకు సాగుదాం.. కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు నిన్నటి వరకు నేర్చుకున్నాం.. రేపటి కోసం ఆలోచిద్దాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2022 సంవత్సరం మీ జీవితంలో ఎక్ట్రార్డినరీగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కలలకు రెక్కలు తొడగండి వాటిని నిజం చేసుకోడానికి 2022లో శ్రమించి విజయం సాధించడండి. హ్యాపీ న్యూ ఇయర్ 2022 గతాన్ని మరిచిపోండి.. మీ ముందు 2022 సంవత్సరం నూతన అవకాశాలను ఇస్తుంది.. వినియోగించుకొని విజయం సాధించండి. జీవితమే అందమైన జర్నీలో ఓ సాహసం.. ఈ 2022 సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు జీవితం చాలా చిన్నది.. పెద్ద కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేందుకు ఈ 2022 సంవత్సరాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం.. మనోబలంతో ముందుకు సాగుదాం.. కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చదవండి: డిసెంబర్ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో.. -
మీ సన్నిహితులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పండి ఇలా..
Happy New Year 2022 Wishes: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే అందరూ సిద్ధమవుతున్నారు. చాలా మంది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి కొత్త కొత్తగా ప్లాన్స్ చేస్తుంటారు. వేరే ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం, స్నేహితులతో పార్టీ చేసుకుంటూ నూతన ఏడాదికి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంటారు. వీటితోపాటు మొబైల్, ఆన్లైన్ ద్వారా లేక ప్రత్యక్షంగా బంధుమిత్రులకు న్యూ ఇయర్ విషెస్ కూడా చెబుతుంటారు. అయితే 2022 కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో అందమైన కొన్ని న్యూ ఇయర్ విషెస్ ఫొటోలను మీకు అందిస్తున్నాం. వాటిని జనవరి 1న మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపండి. ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం.. మనోబలంతో ముందుకు సాగుదాం.. కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు గతం గతః.. 2021 మిగిల్చిన చేదు గుర్తులను మరిచిపోదాం 2022 లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుందాం.. కలిసికట్టుగా కష్టాలను తరిమి కొడదాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మధురమైన ప్రతి క్షణం.. నిలుస్తుంది జీవితం.. ఈ కొత్త సంవత్సరం.. అలాంటి క్షణాలెన్నో.. అందించాలని ఆశిస్తున్నారు.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యదయం ఆకాంక్షిస్తూ.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ, సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!! ఈ కొత్త సంవత్సరం.. మీ జీవితాల్లో వెలుగులు నింపాలి.. సరికొత్త విజయాలను అందించాలి.. ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి.. ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి సుమం సుగంధభరితం, ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం! విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ కష్టాలెన్నైనా సరే రానీ.. సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ.. కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్నటి వరకు నేర్చుకున్నాం.. రేపటి కోసం ఆలోచిద్దాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మరచిపోవచ్చు.. కానీ, చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో నడిపించిన మనుషుల్ని మరవకూడదు. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం.. రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పై ఫొటోలు, కోట్స్ ద్వారా మీ సన్నిహితులకు విషెస్ చెప్పండి. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని కోరుకోండి. -
ఉత్తరాఖండ్‌కు ఒక్కరోజు సీఎం
న్యూఢిల్లీ: జాతీయ బాలి కాది నోత్సవం సందర్భంగా ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి వ్యవహ రించారు. సీఎం హోదాలో హరిద్వార్‌కు చెందిన 20 ఏళ్ల గోస్వామి ఆదివారం అధికారిక విధులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకా లను సమీక్షించారు. దేశవ్యాప్తం గా జనవరి 24న జాతీయ బాలికాది నోత్సవం జరుపుకునే విషయం తెలిసిందే. బాలికాదినోత్సవం సందర్భంగా బాలికలకు ప్రధాని మోదీ శుభాకాం క్షలు తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బాలికలకు విద్య, వైద్యం అందించే దిశగా తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వివరించారు. బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘బాలి కలందరికీ హృదయ పూర్వక శుభా కాంక్షలు. మీ సాధికా రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు. -
ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారుపేరు. ఆంధ్రులు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభివృద్ధికి ప్రార్థిస్తున్నానని’’ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అమిత్ షా శుభాకాంక్షలు.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాలకు, భారతదేశం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చేసిన అపారమైన కృషి ప్రశంసనీయం. మోదీ ప్రభుత్వం,అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్ర శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తోందని’ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కవిత
సాక్షి, నిజామాబాద్: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని శనివారం రోజున విడుదల చేశారు. 'ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం. (బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్) ఒకపక్క కరోనా, మరోపక్క హైదరాబాద్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ, బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. వరదల కారణంగా నష్టపోయిన వారందరినీ అందుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా రూ.550 కోట్లను విడుదల చేయడం సంతోషదాయకం. హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశాన్ని విడుదల చేశారు. -
వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలషించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఎదురవుతున్న ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. (అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగు) -
భారత నారీమణుల ఆశీర్వాదం దేశానికి బలం
న్యూఢిల్లీ: ‘ఈ దేశంలోని అనేక మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదంతో మన దేశం మరింత ఉన్నత శిఖరాలను చేరుకుని విజయాన్ని సాధిస్తుంది’అని ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఈ దేశం కోసం పనిచేయగలగడం నాకు గర్వకారణం, భారత నారీమణుల ఆశీర్వాదాలు నాకు మరింత బలాన్నిస్తాయి’అని ట్వీట్ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని మోదీకి ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఆధ్యాత్మికవేత్త అమృతానందమయి రాఖీ బంధన్ సందేశాలు పంపారు. ప్రధానిగా మోదీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, మోదీతో కలిసి దిగిన ఫొటోలను, తన ఆడియో సందేశాన్ని 90 ఏళ్ల లతా మంగేష్కర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రధానమంత్రి మోదీ పైవిధంగా ట్విట్టర్లో స్పందించారు. -
ఆ మహిళలకు సెల్యూట్ చేద్దాం!
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపి, దేశం గర్వించేలా చేసిన మహిళలకు సముచిత గౌరవం, ప్రచారం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం అవిశ్రాంత కృషి చేస్తున్న ఆ భరతమాత బిడ్డల విజయాలను గుర్తించి, ప్రశంసించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మాసాంతపు రేడియో ప్రసంగం కార్యక్రమం మన్ కీ బాత్‌లో ప్రధాని ఈ రోజు పలు అంశాలను పంచుకున్నారు. జాగింగ్ చేస్తున్న సమయంలో దార్లోని చెత్తను ఏరివేసే ప్లాగింగ్(జాగింగ్ ప్లస్ పికింగ్ అప్ లిటర్)ను ఉద్యమ స్థాయిలో చేపట్టాలని పిలుపునిచ్చారు. దీనికి ప్రచారం కల్పిస్తున్న రిపుదమన్ బెల్వీని మోదీ ప్రశంసించారు. విదేశాల్లో ప్లాగింగ్ సాధారణమే కానీ భారత్‌లో బెల్వీ దీనికి ప్రాచుర్యం కల్పించారని మోదీ తెలిపారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వాడకాన్ని అడ్డుకునే కార్యక్రమాన్ని అక్టోబర్ 2 వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేరోజు ‘ఫిట్ ఇండియా ప్లాగింగ్ రన్’ను క్రీడాశాఖ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య పరిరక్షణ ముఖ్యమని, అందువల్ల ఈ – సిగరెట్ల వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని యువతను కోరారు. ఈ – సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం కాదన్న దురభిప్రాయం ఉందని, అయితే, అది సరి కాదని, ఈ – సిగరెట్లు కూడా సాధారణ పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే హానికరమని వివరించారు. ఈ కొత్త తరహా వ్యసనం బారిన యువత పడకూడదనే ఈ– సిగరెట్లను నిషేధించామన్నారు. అలాగే, సెప్టెంబర్ 28న జన్మదినోత్సవాన్ని జరుపుకున్న ప్రముఖ గాయని లత మంగేష్కర్‌కు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ఫోన్‌కాల్ వివరాలను మోదీ తెలియజేశారు. దీపావళి సందర్భంగా మిఠాయిలు, బహుమతులను పేదలతో పంచుకోవాలని కోరారు. మహిళా విజేతలను గౌరవించుకునే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ‘భారత్‌కీలక్ష్మి’ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో వారి గురించి ప్రచారం చేయాలన్నారు. ‘ఈ పండుగ సమయంలో బహుమతులు, మిఠాయిలు తీసుకోవడమే కాకుండా పంచుకోవడాన్ని ప్రారంభిద్దాం. మనకు పనికిరాని వస్తువులను అవసరమైన పేదలకు ఇద్దాం’ అని కోరారు. ఇటీవలి యూఎస్ ఓపెన్ ఫైనల్లో స్టార్ ప్లేయర్ నదాల్ చేతిలో ఓటమి పాలైన రష్యా టెన్నిస్ ఆటగాడు డానిల్ మెద్వదేవ్ చూపిన క్రీడా స్ఫూర్తిని మోదీ కొనియాడారు. లతకు శుభాకాంక్షలు.. అమెరికా పర్యటనకు వెళ్లే ముందే ప్రధాని మోదీ లతా మంగేష్కర్‌కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లతను తన సోదరిగా భావిస్తానన్నారు. ఆమెలోని నిరాడంబరత ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ‘మీ బర్త్‌డే రోజు నేను విమాన ప్రయాణంలో ఉండొచ్చు. అందువల్ల ముందే మీకు శుభాకాంక్షలు చెబుతున్నా. మీ ఆశీస్సులు మాకు కావాలి’ అని మోదీ కోరారు. అందుకు ప్రతిగా, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన లత.. దేశానికి ఎంతో సేవ చేసిన మీ ఆశీస్సులే తనకు కావాలంటూ ప్రధానికి సమాధానమిచ్చారు. దానికి, ‘మీరు, వయసులోను, దేశానికి చేసిన సేవలోను ఎంతో పై ఎత్తున ఉన్నారు. మీ ఆశీస్సులే మాకు కావాలి’ అని మోదీ జవాబిచ్చారు. ‘ఈ సారి ముంబై వచ్చి నప్పుడు మీ ఇంటికి వచ్చి గుజరాతీ వంటకాలను ఆస్వాదిస్తా’ అని లతా మంగేష్కర్‌కు ప్రధాని చెప్పారు. లతా మంగేష్కర్ తల్లిగారైన శేవంతి మంగేష్కర్ గుజరాత్‌కు చెందినవారే. -
ఇమ్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రధాని మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. శనివారం (మార్చి 23) పాక్ జాతీయ దినోత్సవం. ఈ సందర్భంగా మోదీ పంపిన సందేశాన్ని ఇమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదం, హింసల్లేని, ప్రజాస్వామ్య, శాంతియుత, వృద్ధిదాయకమైన భారత ఉపఖండం కోసం ఇరు దేశాల ప్రజలు కృషి చేయాలని మోదీ అన్నారు. గత నెలలో పుల్వామాలో ఉగ్రవాద దాడి, అనంతరం పాక్‌లోని బాలాకోట్‌పై భారత వైమానిక దళం దాడి, ఆ మరుసటి రోజే పాక్ ప్రతీకార ప్రయత్నం తదితరాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు మోదీ శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మోదీ శుభాకాంక్షలు చెప్పడం నిజమో కాదో వెల్లడించాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని కార్యాలయాన్ని కోరింది. అటు ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయం జరిపే జాతీయ దినోత్సవ వేడుకలకు ఈసారి భారత్ హాజరవ్వడం లేదు. ఈ వేడుకలకు ప్రతీ ఏడాది భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వెళ్లేవారు. ఈసారి వేడుకలకు కశ్మీరీ వేర్పాటువాదులను కూడా పిలవడంతో వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. -
ఏపీలో సువర్ణపాలన అందుతుంది
-
ఫిర్యాదుల కంటే.. శుభాకాంక్షలే ఎక్కువ
న్యూఢిల్లీ : ఎవరికైనా హెల్ప్‌లైన్ నెంబర్లు దేనికి ఉపయోగపడతాయి అంటే తమ సమస్యను ఫిర్యాదు చేసుకునేందుకు. కానీ రైల్వేలో అలా కాదంట. రైల్వే వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫిర్యాదుల కంటే శుభాకాంక్షల మెసేజ్‌లే ఎక్కువగా వస్తున్నాయట. వాట్సాప్ వాడకం విస్తృతంగా ఉండటంతో, రైల్వే ఇటీవలే వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. ఈ నెంబర్లను అపరిశుభ్రతంగా ఉన్న స్టేషన్ పరిసరాలు, టాయిలెట్ల గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు ప్రవేశపెట్టింది. డబ్ల్యూఆర్(వెస్ట్రన్ రైల్వే) కోసం 90044 99773 నెంబర్‌ను, సీఆర్(సెంట్రల్ రైల్వే)లోని ప్రయాణికులు 9987645307 నెంబర్‌కు ప్రయాణికులు తమ ఫిర్యాదులను వాట్సాప్ చేయొచ్చని తెలిపింది. అయితే ఈ రెండు నెంబర్లకు ప్రస్తుతం ఫిర్యాదుల కంటే ఎక్కువగా శుభాకాంక్షల మెసేజ్‌లు, గుడ్‌మార్నింగ్, గుడ్ ఈవ్నింగ్ వంటి టెక్ట్స్ మెసేజ్‌లే ఎక్కువగా వస్తున్నాయని రైల్వే అధికారులు చెప్పారు. అంతేకాక దేవతలతో కూడిన భక్తి సందేశాలు, వినోదభరిత హిందీ పద్యాల మెసేజ్‌లను తాము పొందుతున్నామని తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్లకు అపరిశుభ్రతంగా ఉన్న పరిసరాల గురించి వారంలో కేవలం 25 ఫిర్యాదులే వచ్చాయని అధికారులు చెప్పారు. మిగతావన్నీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు, ఫార్వర్డ్ మెసేజ్‌లే ఉన్నాయన్నారు. సాధారణంగా అపరిశుభ్రతంగా ఉన్న రైల్వే పరిసరాల గురించి ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే రైల్వే అధికారులు తాజాగా ఈ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రవేశపెట్టారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్లతో ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని రైల్వే అధికారులు చెప్పారు. అపరిశుభ్రతంగా ఉన్న పరిసరాలను, టాయిలెట్లను క్లిక్ చేసి, వాట్సాప్ నెంబర్‌కు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదుల కోసం కంప్లయింట్స్ సెల్ ఒకటి ఉంటుంది. ఓ ప్రత్యేకమైన సిబ్బందిని దీని కోసమే నియమించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే వారు చర్యలు తీసుకోనున్నారు. స్టేషన్ మాస్టర్లు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆఫీసులు ఎప్పడికప్పుడూ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారని వెస్ట్రన్ రైల్వే అధికార ప్రతినిధి రవిందర్ భాకేర్ చెప్పారు. ఇప్పటి వరకు వెస్ట్రన్ రైల్వే వాట్సాప్ నెంబర్‌కు 23 ఫిర్యాదులు, సెంట్రల్ రైల్వే వాట్సాప్ నెంబర్ రెండు ఫిర్యాదులను పొందిందని ఓ రైల్వే అధికారి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను కంట్రోల్ డిపార్ట్మెంట్కు పంపామని, వాటిని సంబంధిత స్టాఫ్‌కు(స్టేషన్ మాస్టర్) పంపిస్తామని తెలిపారు. అయితే ఆ ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రస్తుతమైతే ఎలాంటి డెడ్‌లైన్ లేదని, కానీ అదే రోజు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. -
సీఎం హిందీ దివస్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ‘హిందీ దివస్’ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 14న హిందీ దివస్ జరుపుకుంటున్న సందర్భంగా హిందీ భాషాభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడే వారికి ఆయన అభినందనలు తెలిపారు. సీఎంకు వివాహ ఆహ్వానాలు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తన కుమారుడు రవీంద్ర వివాహానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ వివాహపత్రికను అందజేశారు. అలాగే ఎన్టీవీ చైర్మన్ నరేంద్రచౌదరి, డాక్టర్ రంజిత్‌రెడ్డి తమ కూతుళ్ల వివాహ ఆహ్వానపత్రికలను వేర్వేరుగా ముఖ్యమంత్రికి అందజేశారు.