
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారుపేరు. ఆంధ్రులు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభివృద్ధికి ప్రార్థిస్తున్నానని’’ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
అమిత్ షా శుభాకాంక్షలు..
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాలకు, భారతదేశం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చేసిన అపారమైన కృషి ప్రశంసనీయం. మోదీ ప్రభుత్వం,అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్ర శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తోందని’ ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment