Happy New Year 2022 Wishes, Quotes, Greetings, Images and Whatsapp Status Messages in Telugu
Sakshi News home page

Happy New Year 2022 Wishes: మీ సన్నిహితులకు న్యూ ఇయర్ విషెస్‌ చెప్పండి ఇలా..

Published Sat, Dec 18 2021 7:14 PM | Last Updated on Sat, Dec 25 2021 1:17 PM

Happy New Year 2022 Wishes in Telugu - Sakshi

Happy New Year 2022 Wishes: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. న్యూ ఇయర్‌ వేడుకలు సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇప్పటి నుంచే అందరూ సిద్ధమవుతున్నారు. చాలా మంది న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి కొత్త కొత్తగా ప్లాన్స్‌ చేస్తుంటారు. వేరే ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్‌ చేయడం, స్నేహితులతో పార్టీ చేసుకుంటూ నూతన ఏడాదికి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంటారు. వీటితోపాటు మొబైల్‌, ఆన్‌లైన్‌ ద్వారా లేక ప్రత్యక్షంగా బంధుమిత్రులకు న్యూ ఇయర్‌ విషెస్‌ కూడా చెబుతుంటారు. అయితే 2022 కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో అందమైన కొన్ని న్యూ ఇయర్ విషెస్‌ ఫొటోలను మీకు అందిస్తున్నాం. వాటిని జనవరి 1న మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపండి. 

ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు,
సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం..
మనోబలంతో ముందుకు సాగుదాం..
కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

గతం గతః..
2021 మిగిల్చిన చేదు గుర్తులను మరిచిపోదాం
2022 లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుందాం..
కలిసికట్టుగా కష్టాలను తరిమి కొడదాం.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మధురమైన ప్రతి క్షణం..
నిలుస్తుంది జీవితం..
ఈ కొత్త సంవత్సరం..
అలాంటి క్షణాలెన్నో..
అందించాలని ఆశిస్తున్నారు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

గత జ్ఞాపకాలను నెమరు వేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యదయం ఆకాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ,
సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా,
జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!!

ఈ కొత్త సంవత్సరం..
మీ జీవితాల్లో వెలుగులు నింపాలి..
సరికొత్త విజయాలను అందించాలి..
ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి..
ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ..
మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ..
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ప్రతి సుమం సుగంధభరితం,
ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం!
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్

కష్టాలెన్నైనా సరే రానీ..
సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ..
కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం..
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన
గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నిన్నటి వరకు నేర్చుకున్నాం..
రేపటి కోసం ఆలోచిద్దాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

చేసిన తప్పులను మరచిపో..
వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో..
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..
కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మరచిపోవచ్చు..
కానీ, చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో నడిపించిన మనుషుల్ని మరవకూడదు.
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం..
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

 
పై ఫొటోలు, కోట్స్‌ ద్వారా మీ సన్నిహితులకు విషెస్‌ చెప్పండి. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని కోరుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement