
న్యూఢిల్లీ: ‘ఈ దేశంలోని అనేక మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదంతో మన దేశం మరింత ఉన్నత శిఖరాలను చేరుకుని విజయాన్ని సాధిస్తుంది’అని ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ సందర్భంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఈ దేశం కోసం పనిచేయగలగడం నాకు గర్వకారణం, భారత నారీమణుల ఆశీర్వాదాలు నాకు మరింత బలాన్నిస్తాయి’అని ట్వీట్ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని మోదీకి ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఆధ్యాత్మికవేత్త అమృతానందమయి రాఖీ బంధన్ సందేశాలు పంపారు. ప్రధానిగా మోదీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, మోదీతో కలిసి దిగిన ఫొటోలను, తన ఆడియో సందేశాన్ని 90 ఏళ్ల లతా మంగేష్కర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రధానమంత్రి మోదీ పైవిధంగా ట్విట్టర్‌లో స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment