Rakshabandhan
-
రక్షాబంధన్: అన్నకు ప్రాణం పోసిన చెల్లెలు
అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. చెల్లెలంటే ప్రాణమిచ్చే అన్న.. అన్నయ్యంటే ప్రాణం పెట్టే చెల్లెళ్లను మనం చూసే ఉంటాం. ఇటువంటి కథనాలను మనం వినే ఉంటాం. అయితే అంతకుమించిన అనుభంధం రాజస్థాన్‌లోని ఈ అన్నాచెల్లెళ్లది.రాజస్థాన్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన ఒక సోదరి తన సోదరునికి కిడ్నీని దానం చేయడం ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. వీరు ఆస్పత్రిలోనే రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఉపాధ్యాయురాలు సునీతా బుడానియా తన కిడ్నీని తన సోదరుడు దేవేంద్ర బుడానియాకు దానం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.2016లో దేవేంద్ర బుడానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపధ్యంలో అతని బంధువైన బీర్బల్ బుడానియా అతనికి కిడ్నీని దానం చేశారు. అయితే ఆ కిడ్నీ ఎనిమిదేళ్ల తర్వాత పనిచేయడం మానేసింది. దీంతో దేవేంద్రకు మరోమారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో దేవేంద్ర సోదరి సునీత తన అన్నకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా సునీతతో మీడియాతో మాట్లాడుతూ వివాహం అయినంతమాత్రన ఆడపిల్లకు పుట్టింటితో సంబంధం ముగిసిపోదని, అది ఇంకా పెరుగుతుందని అన్నారు. ఆడపిల్లకు అటు పుట్టినిల్లు, ఇటు అత్తారిల్లు అనే విధంగా బాధ్యతలు పెరుగుతాయన్నారు. తాను తన సోదరునికి కిడ్నీని దానం చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే డిశ్చార్జి కానున్నారు. -
Rakshabandhan: ఆడపడుచులకు యోగీ సర్కార్ కానుక
రక్షా బంధన్ నాడు మహిళలకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు ప్రత్యేక కానుక ప్రకటించింది. ఆగస్టు 17 నుండి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో అదనంగా బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆడపడచులకు ఆగస్టు 19, 20 తేదీలలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 17 నుంచి 22వ తేదీ వరకు అన్ని రూట్లలో నిరంతరాయంగా బస్సులు నడిపేందుకు వీలుగా రావాణాశాఖ అధికారులు, ఉద్యోగుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సమయంలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లకు ప్రోత్సాహక నగదును ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు బస్సులను కూడా నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ నుండి లక్నో, వారణాసి, కాన్పూర్, ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్ మార్గాలకు అదనపు బస్సులు నడపనున్నారు. ఇప్పటికే లోకల్ రూట్లలో నడుస్తున్న బస్సులకు అదనంగా ట్రిప్పులు పెంచనున్నారు. -
సీఎం వైఎస్ జగన్‌కు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
సాక్షి, అమరావతి: రక్షాబంధన్(రాఖీ పౌర్ణమి) సందర్భంగా గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బ్రహ్మకుమారీస్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు జయ, పద్మజ, రాధ రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీస్ ప్రధాన కార్యాలయం మౌంట్ అబూలో సెపె్టంబరులో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సీఎం జగన్‌ను వారు ఆహ్వనించారు. సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన హౌస్ కీపింగ్ సిబ్బంది రాఖీ పండుగ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో హౌస్ కీపింగ్ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సిబ్బంది గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం జగన్ చేతికి రాఖీలు కట్టి మహిళా సిబ్బంది తమ అభిమానాన్నిచాటుకున్నారు. -
క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ..
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 'రక్షాబంధన్' సందర్భంగా తన ట్విటర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రక్షాబంధన్ సందర్భంగా తన చిప్పప్పుడు తన సోదరితో రాఖీ కట్టించుకున్న ఫోటో ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. 'కొన్ని సంవత్సరాల క్రితం నా సిస్టర్ రాధిక నేను కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసాను. అయితే దానిని ఎవరో దయతో కలర్ ఫోటోగా మార్చారు' అంటూ అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా చెల్లెలు అనుజకు క్షమాపణలు అంటూ' ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికి వేల సంఖ్యలో లైక్స్ రాగా, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాఖీ పండుగ విషయానికి వస్తే అన్న, చెల్లెల అనుబంధానికి ప్రతీకగా దీనిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. Some years ago I posted the black & white photo of my sister Radhika and I during Rakhi & someone very kindly gave it colour! So posting it again while wishing everyone a Very Happy Rakshabandhan.(And apologies to my younger sister Anuja, who hadn’t arrived on the planet yet!) pic.twitter.com/TGVyPSjNNJ — anand mahindra (@anandmahindra) August 30, 2023 -
ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్
విద్యానగర్/కరీంనగర్ కల్చరల్: ఆధునికయుగంలో అనుబంధాలు ఇంకా తరిగిపోలేదు. ఉమ్మడి కుటుంబాలు తగ్గినా పేగుబంధాలు ధృడంగానే ఉన్నాయి. ఎక్కడ ఉన్నా పరస్పర యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆత్మీయత పంచుతూ తోబుట్టువుల బంధాన్ని శాశ్వతంగా నిలిపేది రక్షాబంధన్. సోదరీసోదరుల ఆత్మీయ బంధానికి ప్రతీక అయినా రక్షా బంధన్‌ను గురువారం దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. పండుగ రోజున పుట్టిళ్లు సందడిగా మారుతాయి. అక్కాచెల్లెళ్లు కట్టిన రాఖీలతో సోదరుల ముంజేతులన్నీ వివిధ రంగులు, డిజైన్ల రాఖీలతో కళకళలాడుతాయి. అండగా ఉంటామని హామీ ఇస్తూ అన్నదమ్ములు తమకు తోచిన కట్నకానుకలు సోదరీమణులకు ఇస్తారు. రక్షాబంధన్‌ను రాఖీపౌర్ణమి, జంద్యాల పౌర్ణమిగా పిలుస్తారు. పండుగ ఎలా ప్రారంభమైందంటే.. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం జరిగిన యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రడు పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపా యం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడు సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్గిస్తుంది. సరిగా ఆ రోజు ఽశ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతిపరమేశ్వరులు, లక్ష్మీనారాయణను పూ జించి రక్షాను దేవేంద్రుని చేతికి కడుతుంది. దేవతలందురూ పూజించిన రక్షాలను ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా రాఖీ పండుగా మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. అన్నాతమ్ముళ్లకు కట్టే రక్షాబంధన్ ద్వారా వారు తలపెట్టే కార్యాలు విజయవంతం కావాలని, సుఖసంతోషాలు, సిరి సంపదలు కలగాలని ఆకాంక్షించే విశిష్టత రాఖీ పండుగకు ఉంది. నూతన వస్రాలు, బహుమతులతో ఆనందంగా గడుపుతారు. బ్రిటీష్‌వారు దేశాన్ని పాలిస్తున్న కాలంలో వారి ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. సీ్త్రలు రక్షణ కోసం వీరయెధులకు రక్షాబంధన్ కట్టేవారు. సోదరభావంతో యోధులు మహిళలకు రక్షణ కల్పించేవారు. రాణి కర్ణావతి దుర్గాన్ని శత్రువులు ముట్టడించినప్పుడు ఢిల్లీ బాదుషాకు రాఖీ పంపంది. బాదుషా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆమె ఇంట్లో భోజనం చేసి కానుకల సమర్పించినట్టు చరిత్ర. ఆన్లైన్ రక్షాబంధన్ కాలం మారడంతో పాటు రక్షబంధన్ తీరు మారింది. విద్య, ఉపాధి, ఇతరత్రా కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదురులకు పోస్టు ద్వారా రాఖీలను పంపితే కట్టకొని తోబుట్టువులకు కానుకలు పంపుతుండే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతం కావడంతో ఆన్లైన్ ద్వారా రాఖీలను పంపి ఆన్లైన్ ద్వారానే కానుకులు స్వీకరిస్తున్నారు. సామాజికి మాధ్యమాల ద్వారా పరస్పరం అభినందనలు తెలుపుకునే వెసులుబాటు ఉంది. పద్ధతులు మారినా రాఖీ అనుబంధం, ఆప్యాయత మాత్రం చెక్కుచెదరలేదు. ఈ సమయాలు అనుకూలం గురువారమే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి. శుభకార్యాలు, పండుగలకు సూర్యోదయ తిథి ప్రమాణంగా పాటించాలి. ఉదయం 6.30 నుంచి 9.45, మళ్లీ 10.50 నుంచి 11.50 నిమిషాల మధ్య, మధ్యాహ్నం 12.30 నుంచి 2.45 వరకు, సాయంత్రం 3.45 నుంచి 6.00 గంటల మధ్య రాఖీలు కడితే శుభకరం. – శ్రీతాటిచెర్ల హరికిషన్శర్మ, పురోహితుడు ముగ్గురు అన్నదమ్ములు నాకు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అన్నలు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. తమ్ముడు మాత్రం కరీంనగర్లో మాతోనే ఉంటాడు, రైస్‌మిల్లు ఉంది. ప్రతి పండుగకు ఇద్దరు అన్నలు కళ్లముందు లేకున్న రాఖీ పంపిస్తాను. ఇక్కడ ఉండే కృష్ణకు మాత్రం స్వయంగా రాఖీ కడతాను. – సింగిరికొండ మాధవి, తిరుమలనగర్, కరీంనగర్ తమ్ముడంటే ప్రాణం మా ఇంట్లో మేము ముగ్గురం, మాకు తమ్ముడు అన్వేశ్ అంటే ప్రాణం, ప్రస్తుతం వాడు హుస్నాబాద్‌లోని శ్రీనివాస హాస్పిటల్ ఇన్చార్జి. రాఖీపండుగ రోజు ఎంత బిజీగా ఉన్నా వాడి దగ్గరికి వెళ్లి మేమిందరం కలిసి రాఖీ కడతాం. తమ్ముడు కూడా మా కోసం ప్రతీ పండుగకు ఎదురుచూస్తుంటాడు, వాడి ప్రేమాభిమానాలు ఎప్పటికీ కావాలి. వాడు ఆనందంగా ఉండాలని, ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటాం. – స్రవంతి, అమూల్య, కరీంనగర్ -
రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్‌పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు
అమరావతి: రక్షాబంధన్(రాఖీ పర్వదినం)ను పురస్కరించుకుని ఏపీలోని విద్యార్థులు విన్నూత్న శైలిలో ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమకున్న ప్రేమ, కృతజ్ఞతను చాటుకోవడానికి రక్షాబంధన్ పండుగను వేదికగా చేసుకున్నారు విద్యార్థులు. ‘రాష్ట్రానికి రక్ష జగనన్న’ అంటూ మానవ గొలుసుగా ఏర్పడి హృదయపూర్వకమైన సంజ్ఞను ప్రదర్శించారు. సీఎం జగన్‌ను మేనమామగా పిలుచుకునే విద్యార్థులు.. ఆయనపై అమితమైన విశ్వాసంతో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విద్యాకుసుమాలు జగన్‌లో ఓ సంరక్షకుడిని చూసుకుంటున్నారు. ప్రకాశవంతమైన రేపటికోసం సీఎం జగన్‌పైనే నమ్మకం ఉంచిన విద్యార్థులు.. అందుకు బదులుగా రాష్ట్రానికి రక్ష జగనన్న అంటూ ఇలా తమ ప్రదర్శన ద్వారా ఆకట్టుకున్నారు. సీఎం జగన్, విద్యార్ధుల మధ్య ఉన్న బంధానికి ఇదొక ప్రతీకగా చెప్పవచ్చు. -
మళ్లీ అదే మోసం.. ఆశలన్నీ ‘లైగర్’పైనే
బాలీవుడ్‌కు వరుసగా షాక్స్ తగులుతూనే ఉన్నాయి. అక్కడి హీరోలు వరుస పెట్టి ఉత్తరాది ఆడియెన్స్ కు షాక్స్ ఇస్తూనే ఉన్నారు. యంగ్ హీరోలు సరేసరి కనీసం స్టార్ హీరోలైనా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తారు అంటే ఆమిర్ ఖాన్ లాంటి హీరో కూడా మోసం చేసేసాడు.మొత్తంగా నార్త్ సైడ్ ఫిల్మ్ బిజినెస్ ఇప్పట్లో గాడిన పడే అవకాశాలే కనిపించడం లేదు. (చదవండి: కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్) కొన్నేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసిస్తున్న హీరోలు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్. ఇండిపెన్డెన్స్ డే వీకెండ్ కావడంతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 11న ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చెడ్డా’గా వస్తే, అక్షయ్ ఏమో ‘రక్షా బంధన్’ అంటూ సెంటిమెంట్ మూవీ తీసుకొచ్చాడు. ఇద్దరు స్టార్ హీరో పూర్తిగా పడిపోయిన బాలీవుడ్ బిజినెస్ ను నిలబెడతారని అందరూ అనుకున్నారు. కానీ వీరిద్దరు తీసుకొచ్చిన సినిమాలు ఉత్తరాది వారికి అస్సలు నచ్చలేదు. దాంతో తొలి రోజు వసూళ్లు దారుణంగా వచ్చాయి. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా తొలి రోజు ఇండియా వరకు చూసుకుంటే 12 కోట్లు అట. మొత్తంగా శనివారం వరకు అంటే మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 27.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తొలి రోజు వసూళ్లు 8 కోట్లు దాటాయట. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 21.60 కోట్లు వసూలు చేసిందట. మొత్తంగా ఇద్దరు స్టార్ హీరోలు కలసి వచ్చినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు పట్టుమని 20 కోట్లు దాటించలేకపోయారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ ఈ రేంజ్ లో డిజప్పాయింట్ చేస్తాడని బీటౌన్ అస్సలు ఊహించలేదు. (చదవండి: ‘లాల్‌సింగ్ చడ్డా’ మూవీ రివ్యూ) ఈ సిచ్యూవేషన్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఆదుకునేది ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ నుంచి వెళ్తున్న మరో పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ తప్పకుండా హిందీ మార్కెట్ కు కొంత లైఫ్ ఇస్తుందని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కరణ్ జోహర్ లాంటి పెద్ద నిర్మాత బ్యానర్ నుంచి మూవీ రిలీజ్ అవుతుండం, విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కు జనం ఎగబడుతుండటం చూస్తుంటే లైగర్ ఓపెనింగ్స్ వేరే లెవల్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ నిరాశపరిచినా లైగర్ వస్తున్నాడు కదా అనే కాన్ఫిడెన్స్ బీటౌన్ ఎగ్జిబీటర్స్ లో కనిపిస్తోంది. -
ఆమిర్‌తో పోటీపడుతున్న అక్షయ్.. పెద్ద సాహసమే!
అక్షయ్ కుమార్‌కు ఈ ఏడాది కలిసి రావడం లేదు.గద్దలకొండ గణేష్ హిందీ రీమేక్ బచ్చన్ పాండే ఆర్ ఆర్ ఆర్ మేనియాలో కొట్టుకుపోయింది. ఇక సమ్రాట్ పృథ్వీరాజ్, భూల్ భూలయ్య - 2 హంగామా మధ్య కనిపించలేదు.ఇంత బ్యాడ్ ఫేజ్ లోనూ అక్షయ్ కొత్త సినిమాను వెంటనే రిలీజ్ చేస్తున్నాడు.ఆ మూవీనే రక్షాబంధన్. ఆగస్ట్ 11న రక్షాబంధన్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు అక్షయ్. అయితే సరిగ్గా ఇదే రోజును ఆమిర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చెద్దా రిలీజ్ అవుతోంది.2018లో తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజాస్టర్ తర్వాత బాగా సమయం తీసుకుని ఆమిర్ నటించిన చిత్రమిది.పైగా భారీ ఎత్తున ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు.ఆమిర్ ఖాన్ మూవీకి హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కురుస్తాయి.ఆ విషయం ధూమ్ 3, పీకే, దంగల్ లాంటి చిత్రాలు నిరూపించాయి.అలాంటి ఆమిర్ ఖాన్ తో అక్షయ్ పోటీకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అసలే ఫ్లాపుల్లో ఉన్న ఖిలాడి డైరెక్ట్ గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తో పోటీకి దిగడం కరెక్ట్ కాదని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. మరి అక్షయ్ ప్లాన్ ఏంటి అనేది అతనే చెప్పాల్సి ఉంది. అసలే ఈ మధ్య బాలీవుడ్‌కి కలెక్షన్స్ రావడం లేదు. ఈ దశలో మరో హీరోతో పోటీ పడుతూ సినిమా రిలీజ్ అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. -
చెల్లితో పాములకు రాఖీ కట్టించబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు
పాట్నా: రక్షాబంధన్ నేపథ్యంలో తన సోదరితో పాములకు రాఖీ కట్టించే ప్రయత్నంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బీహార్‌లోని సరన్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాఖీ పండగ సందర్భంగా పాములు పట్టే 25 ఏళ్ల మన్మోహన్ తన సోదరితో పాముల జంటకు రాఖీ కట్టించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను రెండు పాముల తోకలను పట్టుకున్నాడు. ఇంతలో ఒక పాము ఏమరుపాటుగా ఉన్న మన్మోహన్ కాలి బొటన వేలుపై కాటు వేసింది. बिहार के सारण में बहन से साप को राखी बंधवाना महंगा पड़ गया साप के डसने से भाई की चली गई जान pic.twitter.com/675xsgnZ6N — Tushar Srivastava (@TusharSrilive) August 23, 2021 ఊహించని హఠాత్పరిణామంతో షాక్ తిన్న మన్మోహన్.. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అప్పటికే విషం శరీరం మొత్తం వ్యాపించడంతో ప్రాణాలు కోల్పోయాడు. పదేళ్లుగా పాముల సంరక్షణకు పాటుపడిన మన్మోహన్ పాము కాటు వల్లే మరణించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, మన్మోహన్ పాములకు రాఖీ కట్టించే ప్రయత్నం మొత్తాన్ని సెల్ఫోన్లలో బంధించిన స్థానికులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: పట్టాలపై సెల్ఫోన్లో బిజీ.. నలుగురిని చిదిమేసిన రైలు -
అన్నయ్యకు ప్రేమతో...
సోదర సోదరీమణుల మధ్య బంధాలు, అనుబంధాలు... అప్యాయత అనురాగాలు కలకాలం విలసిల్లాలని జరుపుకునే పండగే∙రక్షాబంధన్. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క జీవితాంతం భరోసాగా ఉంటామని చెప్పే రక్షాబంధన్‌రోజు ... తమ అన్నయ్యలు, తమ్ముళ్లకు మంచి మంచి డిజైన్లలో ఉన్న రాఖీలను ఏరికోరి కొనుక్కొచ్చి కడతారు తోబుట్టువులు. రాఖీలను ఎంత మంచిగా ఎంపిక చేస్తారో అదేవిధంగా తమ సోదరులు ఎటువంటి గిఫ్టులు ఇస్తారా? అని కూడా ఎదురు చూస్తుంటారు. రాఖీ పండగ రోజు∙తమ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడికి స్వీట్లు, రాఖీలు పట్టుకుని వెళ్లి ఎంతో ప్రేమగా కడతారు. ఇదంతా గత కొన్నేళ్లుగా మనదేశంలో పాటిస్తోన్న సంప్రదాయమే. అయితే ఈ సంప్రదాయానికి కాస్త భిన్నంగా వ్యవహరించిన లక్నోకు చెందిన ఓ చెల్లి.. తన అన్నయ్య దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోకుండా, తనే అన్నయ్యకు అతిపెద్ద బహుమతి ఇచ్చి అతని జీవితాన్ని నిలబెట్టింది. బహుమతి తీసుకున్న ఆ అన్నయ్య ఆనందానికి హద్దులు లేవు. గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాతా దేవ్ లక్నోలోని మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుజాత అన్నయ్య సుదీప్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్( ఐఆర్ఎస్) అధికారి. ప్రస్తుతం లక్నో లో ప్రిన్సిపల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదీప్‌కు కిడ్నీ పాడవడంతో.. అన్నయ్యను అమితంగా ఇష్టపడే సుజాత తన కిడ్నీని అన్నయ్యకు దానం చేసింది. దీంతో పదిహేను రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐకేడీఆర్సీ)లో సుదీప్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఈ రక్షాబంధన్‌కు అన్నయ్యకు నేను ఇస్తోన్న అతిపెద్ద బహుమతి ‘ఆయన జీవితమే’ అని సుజాత చెప్పడం విశేషం. సూరత్‌లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా పనిచేస్తోన్న సుదీప్ కుమార్‌కు 2012లో రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో 2013లో ఐకేడీఆర్సీలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. çసూరత్‌కు చెందిన బ్రెయిన్ డెడ్ అయిన రోగి నుంచి కిడ్నీ తీసి సుదీప్‌కు అమర్చారు. అతని ఆరోగ్యం కుదుటపడ్డాక ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2015లో కొంతమందితో కలిసి ‘డొనేట్ లైఫ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించి అవయవదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే 2013 నుంచి ఈ ఏడాది వరకు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ... ఫిబ్రవరి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెండోసారి కూడా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. కానీ అతనికి సరిపోయే కిడ్నీ దాత దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎవరైనా ఇవ్వచ్చు అని డాక్టర్లు చెప్పడంతో.. వెంటనే చెల్లి సుజాత కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సుదీప్‌కు మ్యాచ్ అవుతుందని చెప్పడంతో.. వెంటనే అన్నయ్యకు తన కిడ్నీని ఇచ్చి అతడి జీవితాన్ని నిలబెట్టింది సుజాత. రాయ్‌పూర్‌కు చెందిన అనుమిత, ఫరిదాబాద్‌కు చెందిన ఆషా, వందన చంద్రా అనే మహిళలు రక్షాబంధన్ సందర్భంగా.. తమ కిడ్నీలను అన్నయ్యలకు దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. అంతేగాక అక్కకి తమ్ముడు, చెల్లికి అన్నయ్యలు రక్షాబంధన్‌కు గిఫ్టుగా కిడ్నీలు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ‘తోబుట్టువు జీవితాన్ని కాపాడడమే రాఖీ అతిపెద్ద బహుమతి’ అని ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధాలు చెబుతున్నాయి. ‘‘నాకైతే అన్నీ మా పెద్దన్నయ్యే. నేను వైద్య వృత్తిలో ఉన్నాను. కిడ్నీ దానం, దాని తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలుసు. అందుకే అన్నయ్యకు కిడ్నీ ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నాను. రాఖీకి అన్నయ్య నుంచి గిఫ్ట్ తీసుకోకుండా ఆయనకే జీవితాన్ని బహుమతిగా ఇచ్చాను’’ అని 51 ఏళ్ల డాక్టర్ సుజాత దేవ్ చెప్పారు. ‘‘నేను సుజాతకు థ్యాంక్స్ చెప్పిచేతులు దులుపుకోలేను. ఎందుకంటే ఆమె నేను తిరిగిచేయలేని సాయం చేసింది. సాధారణంగా రక్షాబంధన్‌కు అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇస్తుంటారు. ఈ రాఖీకి నా చెల్లి తన కిడ్నీని దానం చేసి జీవితాన్నే అతిపెద్ద బహుమతిగా ఇచ్చింది’’ అని సుదీప్ కుమార్ చెప్పారు. -
TSRTC: అన్నాచెల్లెళ్లకు వారధిగా ఆర్టీసీ
సాక్షి, ఖమ్మం: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రజలకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు అందించనుంది. సోదరులకు రాఖీలు, మిఠాయిలు పంపించే సోదరీమణులు కరోనా సమయంలో ఇబ్బంది పడకుండా ఖమ్మం బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. టీఎస్ ఆర్టీసీ పార్సిల్, కొరియర్, కార్గో సర్వీస్ ద్వారా రాఖీలను పంపించే సౌకర్యం కల్పించారు. అతితక్కువ ఖర్చుతో ఆత్మీయులకు రాఖీలు పంపుకోవచ్చునని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇంటి వద్దే డెలివరీ వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మం నగరానికి రాఖీలు పంపిస్తే, ఇక్కడ ఇంటి వద్దే డెలివరీ చేయనున్నారు. అలాగే, హైదరాబాద్, సికింద్రాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మిర్యాలగూడెం తదితర నగరాలకు పంపించినా ఇంటి వద్దే అందజేస్తామని అధికారులు తెలిపారు. తక్కువ చార్జీలతో.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల ద్వారా అతితక్కువ చార్జీతో రాఖీలు పంపుకోవచ్చు. తెలంగాణ పరిధిలో 250 గ్రాములలోపు రూ.30, 251 నుంచి 500 గ్రా. లోపు రూ.40, 501 నుంచి 1000 గ్రా. లోపు బరువైతే రూ.60 చెల్లిస్తే సరిపోతుంది. ఇతర రాష్ట్రాలకు 250 గ్రాముల లోపు రూ.75, 251 నుంచి 500 గ్రాములలోపు రూ.100, 501 నుంచి 1000 గ్రాముల లోపైతే రూ.125కు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ప్రాంతాలకు రాఖీలను పంపించే వెసలుబాటు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఖమ్మం రీజనల్ మేనేజర్ సాల్మన్ తెలిపారు. కాగా, రాఖీలతో పాటు స్వీట్లు పార్సిల్, కొరియర్ ద్వారా పంపించే వారి కోసం ఖమ్మం బస్టాండ్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేశామని వెల్లడించారు. -
వీరులకు రీతూ బంధన్
మరో మూడు రోజుల్లో అప్యాయతలు, అనుబంధాల మధ్య జరుపుకోనున్న‘రక్షాబంధన్ పండగ’ హడావుడి మొదలైంది. సరికొత్త రాఖీలు మార్కెట్లో కళకళలాడుతుండడంతో...తమ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలి? అందమైన రాఖీలు ఎక్కడ దొరుకుతున్నాయి అని ఆడపడుచులంతా ఓపిగ్గా షాపింగ్ చేస్తుంటే... సూరత్‌కు చెందిన రీతూ రాథీ మాత్రం తన సైనిక సోదరులకు కట్టేందుకు వేల సంఖ్యలో రాఖీలు తయారు చేయిస్తోంది. దేశ ప్రజలను తమ కుటుంబ సభ్యులు, తోబుట్టువులుగా భావించి ప్రాణాలకు లెక్కచేయకుండా పోరాడుతున్న వీర జవాన్లకు రాఖీలు కట్టి గౌరవించాలనుకుంది రీతు. ఈక్రమంలోనే ఏడు వేల రాఖీలను తయారు చేయిస్తోంది. రీతు నడిపిస్తోన్న ‘సోచ్ ఫౌండేషన్’ ద్వారా వితంతువులు, వికలాంగులతో రాఖీలు తయారు చేయిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తోంది. వ్యాపార, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టిన రీతుకు చిన్నప్పటి నుంచి ఇతరులకు సాయం చేయడమంటే ఇష్టం. బీకాం తరువాత ఢిల్లీలోని జేడీ ఇన్స్టిట్యూట్లో ఎక్స్పోర్ట్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేసింది. తర్వాత సోమేశ్వర్ డెవలపర్స్ డైరెక్టర్ ఆశిస్ రాఠీని పెళ్లి చేసుకుని ఒక పక్క వ్యాపార పనులు చూసుకుంటూనే, సేవాకార్యక్రమాల దిశగా అడుగులు వేసింది. కోవిడ్ సమయంలో శానిటైజింగ్ మెషిన్‌ను దానం చేయడం, ఫేస్ మాస్కులు పెట్టుకోవడంపై అవగాహన కల్పించడం, ఆహారం లేక అల్లాడుతున్న నిరుపేదల ఆకలి తీర్చడం, ప్రతి ఆదివారం మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం, పోషకాహారం, శానిటరీ పాడ్స్ ఇవ్వడం, వికలాంగులకు మర్మా థెరపీ వంటివి కార్యక్రమాలెన్నింటినో తన టీమ్‌తో చేపట్టింది. గతేడాది ‘ఏక్ సోచ్: ఏక్ ఆత్మనిర్భర్ హిందుస్థాన్ కి ఔర్’ పేరిట ఎన్జీవోని స్థాపించి వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ, నిరుపేదల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ‘‘మనందరికోసం ప్రాణాలు అర్పిస్తోన్న సైనికుల త్యాగాలను దేనితోనూ పోల్చలేము. అనుబంధాల పండుగనాడు వారికి రాఖీ కట్టి గౌరవించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు వేల రాఖీలను రూపొందిస్తున్నాము, వీటిని వితంతువులు, వికలాంగులతో తయారు చేయించడం ద్వారా వారికి ఉపాధి కలుగుతుంది’ అని రీతు చెప్పింది. -
భారత నారీమణుల ఆశీర్వాదం దేశానికి బలం
న్యూఢిల్లీ: ‘ఈ దేశంలోని అనేక మంది తల్లులు, సోదరీమణుల ఆశీర్వాదంతో మన దేశం మరింత ఉన్నత శిఖరాలను చేరుకుని విజయాన్ని సాధిస్తుంది’అని ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ సందర్భంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఈ దేశం కోసం పనిచేయగలగడం నాకు గర్వకారణం, భారత నారీమణుల ఆశీర్వాదాలు నాకు మరింత బలాన్నిస్తాయి’అని ట్వీట్ చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రధాని మోదీకి ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఆధ్యాత్మికవేత్త అమృతానందమయి రాఖీ బంధన్ సందేశాలు పంపారు. ప్రధానిగా మోదీ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, మోదీతో కలిసి దిగిన ఫొటోలను, తన ఆడియో సందేశాన్ని 90 ఏళ్ల లతా మంగేష్కర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రధానమంత్రి మోదీ పైవిధంగా ట్విట్టర్లో స్పందించారు. -
కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాఖీ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి సోదరుడు తన తోబుట్టువుకు ప్రతి విషయంలో అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నారు. అన్ని ఇళ్లల్లో రాఖీ పండుగ హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవిత సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. చదవండి: ఆమెతో రాఖీ కట్టించుకో, 11 వేలు ఇవ్వు: కోర్టు అదేవిధంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెల్లు-అక్కా తముళ్లు ఎంతో ప్రేమానురాగాలతో జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సోదర, సోదరీమణులందరు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. చదవండి: అక్కాచెల్లెమ్మలకు శుభాకాంక్షలు: సీఎం జగన్ -
రక్షాబంధన్ ఎప్పటి నుంచి జరుపుకుంటాం అంటే...
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలందరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధాన్ ప్రాముఖ్యతను, ఈ పండుగ జరుపుకోవడానికి గల కారణాలను ఆయన వివరించారు. దీంతో పాటు భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో రక్షాంబంధన్‌కు సంబంధించి ఒక పోస్ట్‌ను పెట్టారు. ‘అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీకైన రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పండుగ రోజు నేడు. తోబుట్టువులు ఏడాదంతా ఎదురుచూసే ఈ రోజు.. వారిమధ్య బంధాన్ని మరింత పరిపుష్టం చేసే ప్రత్యేకమైన పండుగ రోజు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబవిలువలను ప్రతిబింబించే పండుగ రాఖీపౌర్ణమి. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విలువలు, ప్రాచీన జ్ఞానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించటంతోపాటు, కుటుంబసభ్యులకు ఒక సామాజిక భద్రతను కలిగించే గొప్ప ఉత్సవం. ప్రేమ, పరస్పర గౌరవం, త్యాగం, బాధ్యతలను కలగలుపుకుని జరుపుకునే పండుగ ఇది. తరతరాలుగా ఈ కుటుంబ విలువలను కాపాడుకుంటూ, సామాజిక ఆచారాలు, పండుగలు, జానపద కళలు, పురాణేతి హాసాలు, పవిత్ర మత గ్రంథాల ద్వారా ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు కొత్త తరానికి వీటిని అందిచడం జరుగుతోంది. అమరకావ్యమైన రామాయణంలో తన తండ్రిమాటను గౌరవిస్తూ రాజ్యాధికారాన్ని భరతుడికి అప్పగించి అరణ్యవాసానికి బయలుదేరడం, అటు భరతుడు కూడా అన్నపై ఉన్న ప్రేమాభిమానాలు, గౌరవంతో ఆయన పాదుకాలతో రాజ్యాన్ని నడిపించడం వంటివి భారతదేశంలోని కుటుంబవిలువలకు ఓ ఉదాహరణ మాత్రమే. సతీ అనసూయ, సీతాదేవికి కుటుంబసభ్యులు, పెద్దలతో బాధ్యతగా మసలుకోవలసిన ప్రాముఖ్యతను వివరించడం రామాయణ మహాకావ్యంలోని మరో ముఖ్యమైన ఘట్టం. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి తమ ప్రేమానురాగాలను, బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఉత్సాహవంతంగా జరుపుకోవడమే మన పండుగల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. తన వారితో తన ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోవడం కన్నా మరింత గొప్పది ఏముంటుంది? భారతదేశంలో మానవ సంబంధాలకు, కుటుంబ విలువలకు గౌరవమిస్తూ జరుపుకునే పండగలు కోకొల్లలు. భార్యాభర్తల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే వటసావిత్రీ పౌర్ణమి, కర్వాచౌత్ (ఉత్తరభారతంలో), తమ సంతానం శ్రేయస్సుకోసం తల్లులు పూజలు చేసే అహోయ్ అష్టమి, మన అజ్ఞాన తిమిరాలను తొలగించే గురువులను గౌరవించుకునే గురుపౌర్ణమి ఇలా ఎన్నో పండుగలు బంధాలను మరింత పరిపుష్టం చేసేవే. రక్షాబంధన్ కూడా అలాంటిదే. ‘రక్ష’ అంటే సోదరులు, సోదరీమణుల బంధాన్ని పరిరక్షించేదని అర్థం. సోదరులపై చెడు ప్రభావం పడకుండా రక్షను (రాఖీ) సోదరీమణులు సోదరుల చేతికి కడతారు. దీనికి ప్రతిగా, సోదరికి ఎలాంటి ఆపద వచ్చినా కాపాడతానని సోదరుడు ప్రమాణం చేస్తాడు. అందుకే మన దగ్గర రాఖీ కడుతున్నప్పుడు ‘నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరమూ కలిసి మన దేశానికి రక్ష’ అని పరస్పరం చెప్పుకుంటారు. అదీ రక్షా బంధనంలో ఉన్న గొప్పదనం. అందుకే ఈ పండుగంటే అందరికీ చాలా ఇష్టం. ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైందనే దానిపై భిన్న సందర్భాలను పెద్దలు మనకు చెబుతారు. అందులో ఒకటి, పాండవుల ధర్మపత్ని అయిన ద్రౌపది ఒకసారి తన సోదరుడైన శ్రీ కృష్ణుడికి గాయమైనప్పుడు. తన చీర కొంగును చించి కృష్ణుడికి రక్తస్రావం కాకుండా కడుతుంది. దీంతో ఎప్పుడూ సోదరిని, ఈ బంధాన్ని కాపాడుకుకంటానని శ్రీ కృష్ణుడు ప్రమాణం చేస్తాడు. దీంతో వారిద్దరి మధ్య బంధం మరింత బలోపేతమైందని, అప్పటినుంచి రక్షాబంధనం మన సంప్రదాయంలో భాగమైందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ పండగను, ఈ ఏడాది ప్రపంచమంతా కరోనాతో పోరాటం చేస్తున్న సమయంలోనే జరుపుకోవాల్సి వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవితాల్లో పెనుమార్పులు వచ్చిన ఈ సందర్భంలో.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలను జరుపుకోలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. నిస్సందేహంగా ఇది చాలా క్లిష్టమైన సమయం. కానీ మన వారిని కాపాడుకుంటూ.. వైరస్ తరిమికొట్టేందుకు మనం కుటుంబాలు, బంధువులతో కలిసి ఒకచోట చేరి పండగలు జరుపుకోవడాన్ని నివారించాలి. ఇలా చేయడం వల్ల మనవారిని బాధపెట్టినవారమవుతాం. కానీ, కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో ఇంతకుమించిన ప్రత్యామ్నాయమేదీ లేదు. భారతీయ సంప్రదాయాల ప్రకారం ఏడాది పొడగునా చాలా పండగలు జరుపుకుంటాం. కానీ ప్రతీ పండుగ వెనకున్న చారిత్రక నేపథ్యం, పురాణాల్లోని సందర్భం, పండుగ ప్రాశస్త్యం మొదలైన వాటిని యువతరానికి నేర్పించాలి. అప్పుడే వారికి ఈ పండుగల వెనుక ఉన్న నైతిక విలువలు, సమాజంలో వ్యవహరించాల్సిన తీరు మొదలైన అంశాలపై స్పష్టత వస్తుంది. మన పండుగలు మన ఘనమైన వారసత్వానికి ప్రతీకలు. భిన్న సంస్కృతులు భిన్న సామాజిక పరిస్థితులను కలుపుతూ, అందరినీ ఐకమత్యంగా ఉంచే సాధనాలు. కరోనా మహమ్మారి కారణంగా మన పండగలను మునుపటిలా ఘనంగా జరుపుకోలేకపోయినా మనలో ఉత్సాహం, పట్టుదల ఏమాత్రం సడలకుండా ఐకమత్యంతో వైరస్‌ను ఓడిద్దాం. అప్పటి వరకు మనమంతా ప్రభుత్వం సూచించినట్లుగా కరోనాను కట్టడి చేసే నిబంధనలన పాటిద్దాం. ముక్కు, నోటికి మాస్క్ వాడుతూ భౌతిక దూరాన్ని పాటిద్దాం’ అని వెంకయ్య పేర్కొన్నారు. చదవండి: నేనైతే గిఫ్ట్ కోసం కట్టను.. -
సీఎం కేసీఆర్ నివాసంలో రక్షాబంధన్
సాక్షి, హైదరాబాద్ : ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అక్కచెల్లెళ్లతో పాటు పలువురు మహిళలు గురువారం రాఖీ కట్టారు. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆయన సోదరి కవిత రాఖీ కట్టారు. ముందుగా కేటీఆర్‌కు బొట్టు పెట్టి హారతి ఇచ్చి ‘కేటీఆర్’ పేరుతో ఉన్న రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. ఆ తర్వాత సోదరుడి వద్ద కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌కు కూడా కవిత రాఖీ కట్టారు. ‘కొన్ని బంధాలు నిజంగా ప్రత్యేకమైనవి’ అంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ తన ట్విటర్లో షేర్ చేశారు. సంతోష్ కుమార్ సతీమణి కూడా కేటీఆర్‌కు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. Some bonds are truly special! 😊 Happy Rakshabandhan to all the lovely sisters pic.twitter.com/wbywo0TgVn — KTR (@KTRTRS) August 15, 2019 అలాగే రక్షాబంధన్ సంప్రదాయాన్ని జూనియర్స్ కూడా ఫాలో అవుతున్నారంటూ కవిత కూడా ట్విటర్లో ఫోటోలు పెట్టారు. And the juniors follow ... pic.twitter.com/Lk6umwwcpM — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 15, 2019 సీఎం జగన్‌కు రాఖీ కట్టిన వాసిరెడ్డి పద్మ అలాగే స్వాతంత్ర దినోత్సవంతో పాటు ఇవాళ రక్షాబంధన్ కూడా కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పలువురు రాఖీలు కట్టారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జరిగిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభం సందర్భంగా పలువురు మహిళా వాలంటీర్లు సీఎం జగన్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లలో కూడా రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో తెలంగాణ గవర్నర్ నరసింహన్, విజయవాడలో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పలువురు విద్యార్థులు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి ఆశీస్సులు అందుకున్నారు. -
రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలిపై.. దారుణం
పాట్నా: మానవ సంబంధాలు బొత్తిగా సన్నగిల్లుతున్నాయి. వావి వరసలు మరిచి కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలిపై( వరసకు చెల్లెలు) లైంగిక దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని బంద నగరం తింద్వారీకి చెందిన 15 సంవత్సరాల బాలిక రక్షాబంధన్ రోజున అన్న వరసయ్యే యువకుడికి రాఖీ కట్టడానికి అతని ఇంటికి వెళ్లింది. అదే అదునుగా భావించిన ఆ కీచకుడు బాలికను బంధించి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయం బయటకు పొక్కడంతో బాలిక తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
‘షర్మిలమ్మా... నిన్ను మిస్సవుతున్నానమ్మా’
సాక్షి, హైదరాబాద్ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అక్కాచెల్లెమ్మలందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమై ఉండటంతో ఈసారి రాఖీ పండుగ సందర్భంగా తన చెల్లెలు షర్మిలను మిస్ అవుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. షర్మిలకు తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ‘మిస్సింగ్ యూ ఆన్ రాఖీ.. షర్మీపాప.. బ్లెసింగ్స్ ఆల్వేస్’ అంటూ ఆప్యాయంగా పేర్కొన్నారు. Missing you on Rakhi, Sharmipapa. Blessings always - Anna. Happy #Rakshabandhan Wishing all my sisters in the Telugu states, a very happy #Rakhi - Mee Jagananna. — YS Jagan Mohan Reddy (@ysjagan) 26 August 2018 ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం ఉదయం విశాఖ జిల్లా ధారభోగాపురం వద్ద వైఎస్ జగన్ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాతోపాటు పలువురు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టారు. జననేత జగనన్నకు మిఠాయిలు తినిపించి.. ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. వైఎస్ జగనన్నకు రాఖీ కట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం కావాలని ప్రతి మహిళ కోరుకుంటోందని ఆమె పేర్కొన్నారు. -
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు..
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ఉండే జవాన్లతో సరిహద్దుల సోదరిమణులు జరుపుకుంటున్నారు.15000 అడుగులో ఎత్తులో ఉన్న ఇండో-టిబెట్ బోర్డర్ లడఖ్‌లోని సైనికులకు స్థానికులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. -
అనుబంధానికి రక్ష
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. తమకు జీవితంలో అన్ని సందర్భాల్లోనూ తోడుండమని కోరుతూ సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టడమే ఈ పండుగ. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణిమ రోజున ఈ పండుగను దేశమంతా ఘనంగా జరుపుకొంటారు. దీన్ని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పండుగను కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుపుకొటున్నట్లు మన పురాణాలు చెబుతన్నాయి. రక్షాబంధన్ వెనుక ఉన్న పురాణగాథలు, చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుందాం.. శ్రీకృష్ణుడు–ద్రౌపదిల బంధం... తన సోదరి అయిన ద్రౌపది విషయంలో శ్రీ కృష్ణుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాడో తెలుసుకుంటే మన సంస్కృతిలో అన్నాచెల్లెల్ల మధ్య బంధం ఎంత దృఢమైనదో అర్థమవుతుంది. కృష్ణుడు శిశుపాలుడిని సుదర్శన చక్రం ప్రయోగించి వధించాడు. ఈ సమయంలో కృష్ణుడి చూపుడు వేలుకు గాయమై, రక్తం ధారగా కారుతుంది. దీంతో ద్రౌపది తన చీర అంచు కొద్దిగా చించి, అన్నయ్య కృష్ణుడికి కట్టుకట్టి రక్తం కారడం ఆగిపోయేలా చేస్తుంది. దీంతో సంతోషించిన కృష్ణుడు, తన చెల్లికి ఎల్లవేళలా అండగా ఉంటానని అభయమిస్తాడు. చెప్పినట్లుగానే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో శ్రీ కృష్ణుడు ఆమెకు చీరలు అందించి అండగా నిలిచాడు. పురుషోత్తముడి కథ.. జగజ్జేతగా మారాలనే తలంపుతో గ్రీకు రాజు అలెగ్జాండర్ అనేక దేశాల మీద దండెత్తుతూ ఉంటాడు. ఈ క్రమంలో క్రీస్తూపూర్వం 326లో మనదేశంపైకి కూడా దండెత్తేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో బాక్ట్రియా (నేటి అప్ఘనిస్తాన్)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చీనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపైకి దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే ఈ తరుణంలో అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ యుద్ధం విరమించుకుంటాడు. కర్నావతి చరిత్ర.. మొఘల్ చక్రవర్తి హుమయూన్‌కు క్రీస్తుశకం 1535లో చిత్తోర్ రాణి కర్నావతి రాఖీ పంపి, అతడి నుంచి అభయం పొందిందట. భర్త మరణించడంతో చిత్తోర్ రాజ్యపాలన బాధ్యతలు చేపట్టిన రాణి కర్నావతికి, గుజరాత్ రాజు అయిన సుల్తాన్ బహదూర్ షా నుంచి హాని ఉండేది. అతడి బారి నుంచి తనకు, తన రాజ్యానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె హుమయూన్‌కు రాఖీ పంపిందని, హుమయూన్ ఆమెను సోదరిగా అంగీకరించి కర్నావతి రక్షణకు అభయం ఇచ్చాడనే కథనం ప్రచారంలో ఉంది. పండుగ విశిష్టత.. రాఖీ పండుగ వెనుక చారిత్రక నేపథ్యాలు ఏవైనా ఇది సోదరసోదరీమణుల బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలనే సందేశాన్ని రాఖీ పండుగ అందిస్తోంది. ఒకప్పుడు ఈ వేడుకను ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా నేర్చుకునేవారు. కానీ ప్రస్తుతం ఇది దేశవ్యాప్తమైంది. ఈ పండుగ రోజున మహిళలు ఎక్కడ ఉన్నా తమ సోదరుల దగ్గరికి వెళ్లి రాఖీ కడుతుంటారు. రాఖీలు కట్టి, తమ సోదరులకు స్వీట్లు తినిపించడం ఆనవాయితీ. సోదరులు కూడా తమ అక్కాచెల్లెళ్లకు మంచి కానుకలు అందజేస్తారు. పండుగ సందర్భంగా మార్కెట్లు రాఖీ విక్రయాలతో కళకళలాడుతుంటాయి. భిన్నమైన రాఖీలు అందుబాటులో ఉంటున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో.. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో రాఖీ పండుగ రోజున రాఖీలు కట్టుకోవడంతో పాటు, రాధాకృష్ణులకు ఊయల వేడుక నిర్వహిస్తారు. దీనినే వారు ‘ఝులన్ పూర్ణిమ’ (ఊయల పున్నమి) అని వ్యవహరిస్తారు. ఒడిశాలో కొన్ని చోట్ల ‘గుమ్మా పున్నమి’గా వ్యవహరిస్తారు. వీధుల్లో మట్టిదిబ్బలు ఏర్పాటు చేసి, వాటికి రెండువైపులా పొడవైన వెదురుబొంగులు నాటి, వాటికి కట్టిన దండేనికి రకరకాల వస్తువులు కడతారు. వాటిని అందుకోవడానికి యువకులు, పిల్లలు శక్తికొద్ది మట్టిదిబ్బ మీదుగా దూకుతారు. ఇది దాదాపు ఉట్టెకొట్టడంలాగానే ఉంటుంది. మహారాష్ట్రలో ఇదే రోజున ‘నారాలీ పూర్ణిమ’ (కొబ్బరి పున్నమి) వేడుకలు జరుపుకొంటారు. ఈ సందర్భంగా చెరువులు, నదులు... కుదిరితే సముద్రంలో కొబ్బరికాయలు విడిచిపెట్టి, వరుణ దేవుడికి పూజలు జరుపుతారు. జమ్ముకశ్మీర్‌లో రాఖీపూర్ణిమ రోజున జనాలు ఆరుబయటకు వచ్చి గాలిపటాలను ఎగరేస్తారు. ముఖ్యంగా జమ్ము ప్రాంతంలో ఈ వేడుకలు కోలాహలంగా జరుగుతాయి. ఎక్కడ ఆకాశం వైపు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. నేపాల్‌లో ఇదేరోజున జనై పూర్ణిమగా జరుపుకొంటారు. అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టడమే కాకుండా, ఆడామగా పిల్లా పెద్దా అందరికీ అక్కడి పూజారులు పవిత్రరక్షలను ముంజేతులకు కడతారు. రక్ష కట్టిన పూజారులకు కట్టించుకున్న వారు శక్తికొద్ది కానుకలు సమర్పించుకుంటారు. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
అన్న రాఖీ కట్టించుకోలేదని..
రక్షాబంధన్ ఓ కుటుంబంలో విషాదం మిగిల్చింది. అన్న రాఖీ కట్టించుకోకుండా స్నేహితులతో కలసి ఆడుకోవడానికి వెళ్లాడనే కోపంతో ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని జాన్సీలో ఈ దారుణం జరిగింది. గురువారం రక్షాబంధన్ సందర్భంగా కవిత (12) తన సోదరుడు అభిజీత్ (15)కు కట్టేందుకు రాఖీ తీసుకువచ్చింది. అయితే స్నేహితులతో కలసి ఆడుకునేందుకు బయటకు వెళ్తున్నానని, మళ్లీ రాఖీ కట్టించుకుంటానని అభిజీత్ చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన కవిత గదిలోకి వెళ్లి తలుపులు బంధించి, ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత కుటుంబసభ్యులు పిలిచినా బయటకు రాకపోవడంతో తలుపులు బద్దలుకొట్టగా, లోపల కవిత మృతదేహం కనిపించింది. ఆ చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదంలో నెలకొంది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. -
ఇంతకన్నా గొప్ప 'రాఖీ' కానుక ఉండదేమో!
అన్నా-చెల్లెలి అనుబంధానికి రక్షగా నిలిచే రాఖీ పండుగను జరుపుకొంటున్న తరుణంలోనే రెజ్లర్ సాక్షి మాలిక్ దేశంలో కొత్త ఆనందాన్ని నింపారు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టారు. తన సోదరి సాధించిన ఈ విజయంపై సాక్షిమాలిక్ సోదరుడు సచిన్ రాధాకృష్ణన్ ఆనందం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ఇంతకన్నా గొప్ప కానుకను ఏ చెల్లి కూడా తన అన్నకు ఇచ్చి ఉండదంటూ ఆయన పేర్కొన్నారు. పతకం గెలువాగానే తాను సాక్షికి రక్షాబంధన్ మెసేజ్ పంపించానని, ఒక అన్నగా ఆమెను తనకు ఎంత ఆప్యాయత ఉందో ఆ మెసేజ్‌లో తెలియజేశానని సచిన్ చెప్పారు. మరోవైపు సాక్షి మాలిక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆమెను పెద్ద ఎత్తున అభినందిస్తూ.. మహిళా శక్తిని చాటిన సాక్షికి నీరాజనాలు పడుతున్నారు. ఆమె ప్రతిభను కీర్తిస్తూ ట్వీట్ చేస్తున్నారు. -
కలిసొచ్చిన సెలవులు
ఆగస్టు 12వ తేదీన పుష్కరాలు మొదలవుతాయి. అదే రోజు వరలక్ష్మి వ్రతం ఐచ్ఛిక సెలవు, 13వ తేదీన రెడో శనివారం, 14వ తేదీ ఆదివారం, 15వ తేదీ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం. వరుసగా మూడురోజులు సెలవులు. 18వ తేదీ శ్రావణపూర్ణిమ రక్షాబంధన్ ఐచ్ఛిక సెలవుదినం, 21వ తేదీ ఆదివారం. మధ్యలో 16,17,19,20 తేదీలు మాత్రమే పనిదినాలు. సెలవుదినాలు వచ్చినందున పురాతన ఆలయాలుండే పుష్కర ప్రాంతాల్లో భక్తులు రద్దీ పెరిగే సూచనలున్నాయి. శని, సోమ వారాల్లో పూజలు పుష్కర మూలమూర్తి శివునికి ప్రీతికరం. శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతికరం. అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారు ఆలయంతో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. 16న శ్రావణ మంగళవారం, 18వ తేదీ శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్, 19న శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమే. ఈ రోజుల్లోనూ జోగులాంబ శక్తి పీఠం ఆలయం అలంపూర్ రద్దీ ఉండే అవకాశం ఉంది. -
ఆంధ్రాబ్యాంక్ ‘రక్షాబంధన్’ ప్రత్యేక పథకాలు
హైదరాబాద్: రక్షాబంధన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలలో జీరో అకౌంట్ తీసుకున్న ఖాతాదారులకు ఆంధ్రాబ్యాంక్ వివిధ స్కీమ్‌లను ప్రవేశపెట్టిందని హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ వినయ్‌శర్మ తెలిపారు. హైదరాబాద్ సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆయా ఖాతాల్లో వ్యక్తిగతంగా లేదా బంధువులు, స్నేహితులు నగదు లేదా గిఫ్ట్ చెక్కు రూపంలో డిపాజిట్ చేస్తే పథకాలు వర్తిస్తాయన్నారు. గిఫ్ట్ చెక్కులు రూ. 201, రూ. 351, రూ. 5,001 గుణిజాల్లో లభిస్తాయి. రూ.201 గిఫ్ట్ చెక్కు చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాదబీమా వర్తిస్తుందని తెలిపారు. అలాగే మరో పథకమైన జీవన్ సురక్షా డిపాజిట్ పేరిట రూ.5,001 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాదబీమా, జీవితబీమాలు వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ రెండు పథకాల్లో పలు సంవత్సరాల కవరేజీ వుంటుందన్నారు. జీవన్సురక్షా గిఫ్ట్సెట్ కోసం రూ.351 చెల్లిస్తే రూ. 2లక్షల ప్రమాదబీమా, రూ.2లక్షల జీవితబీమా వర్తిస్తాయని తెలిపారు. ఇది ఒక సంవత్సరం మాత్రమే పనిచేస్తుందని చెప్పారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంక్ హైదరాబాద్ జోనల్ 1 డీజీఎం చక్రవర్తి, హైదరాబాద్ జోనల్2 డీజీఎం సి.వి.రఘునాథ్, ఏజీఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అన్నా చెల్లెలి అనుబంధం...జన్మజన్మలా సంబంధం