రక్షా బంధన్ నాడు మహిళలకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు ప్రత్యేక కానుక ప్రకటించింది. ఆగస్టు 17 నుండి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో అదనంగా బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆడపడచులకు ఆగస్టు 19, 20 తేదీలలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఆగస్టు 17 నుంచి 22వ తేదీ వరకు అన్ని రూట్లలో నిరంతరాయంగా బస్సులు నడిపేందుకు వీలుగా రావాణాశాఖ అధికారులు, ఉద్యోగుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సమయంలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లకు ప్రోత్సాహక నగదును ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు బస్సులను కూడా నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ నుండి లక్నో, వారణాసి, కాన్పూర్, ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్ మార్గాలకు అదనపు బస్సులు నడపనున్నారు. ఇప్పటికే లోకల్ రూట్లలో నడుస్తున్న బస్సులకు అదనంగా ట్రిప్పులు పెంచనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment