![Bihar Girl Molested By Cousin On Raksha Bandhan - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/3/BIHAR%20GIRL.jpg.webp?itok=6-7LeUEz)
ప్రతీకాత్మక చిత్రం
పాట్నా: మానవ సంబంధాలు బొత్తిగా సన్నగిల్లుతున్నాయి. వావి వరసలు మరిచి కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లెలిపై( వరసకు చెల్లెలు) లైంగిక దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని బంద నగరం తింద్వారీకి చెందిన 15 సంవత్సరాల బాలిక రక్షాబంధన్ రోజున అన్న వరసయ్యే యువకుడికి రాఖీ కట్టడానికి అతని ఇంటికి వెళ్లింది.
అదే అదునుగా భావించిన ఆ కీచకుడు బాలికను బంధించి రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయం బయటకు పొక్కడంతో బాలిక తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment