ఛత్తీస్‌గడ్: సర్పంచ్ అంటే ఊరికి పెద్ద. ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అతనిది. కానీ అలాంటి వ్యక్తే ప్రజలకు సమస్యగా మారాడు. ఆ గ్రామంలోని ముగ్గురు అమ్మాయిలను వేధింపులకు గురిచేశాడు. అతని చేష్టలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఒక అమ్మాయి ముక్కును కత్తిరించాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్ గ్రామంలో సర్పంచ్ ముస్తాకిన్ తన సొంత గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను కొంత కాలంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులను భరించలేని వాళ్లు తమకు న్యాయం చేయాలంటూ సర్పంచ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీనికి కోపంతో ఊగిపోయిన ఆ సర్పంచ్ ధర్నా చేస్తున్న వారిలో ఒక అమ్మాయి ముక్కు కోశాడు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు సర్పంచ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు, తనపై, తన మద్దతుదారులపై బాలికల కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ సర్పంచ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment