కలిసొచ్చిన సెలవులు
ఆగస్టు 12వ తేదీన పుష్కరాలు మొదలవుతాయి. అదే రోజు వరలక్ష్మి వ్రతం ఐచ్ఛిక సెలవు, 13వ తేదీన రెడో శనివారం, 14వ తేదీ ఆదివారం, 15వ తేదీ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం. వరుసగా మూడురోజులు సెలవులు. 18వ తేదీ శ్రావణపూర్ణిమ రక్షాబంధన్ ఐచ్ఛిక సెలవుదినం, 21వ తేదీ ఆదివారం. మధ్యలో 16,17,19,20 తేదీలు మాత్రమే పనిదినాలు. సెలవుదినాలు వచ్చినందున పురాతన ఆలయాలుండే పుష్కర ప్రాంతాల్లో భక్తులు రద్దీ పెరిగే సూచనలున్నాయి. శని, సోమ వారాల్లో పూజలు పుష్కర మూలమూర్తి శివునికి ప్రీతికరం. శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతికరం. అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారు ఆలయంతో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. 16న శ్రావణ మంగళవారం, 18వ తేదీ శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్, 19న శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమే. ఈ రోజుల్లోనూ జోగులాంబ శక్తి పీఠం ఆలయం అలంపూర్ రద్దీ ఉండే అవకాశం ఉంది.