Consecutive holidays
-
100% మించిన ఆక్యుపెన్సీ రేషియో
సాక్షి, హైదరాబాద్: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుండటంతో టీఎస్ఆర్టీసీ చరిత్రలో తొలిసారి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో వంద శాతం దాటింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల సంఖ్య పోటెత్తటంతో రికార్డు స్థాయిలో 100.09% ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. కి.మీ.కు రూ.65.07 చొప్పున ఆదాయం నమో నమోదైంది. కిలోమీటరుకు నమోదయ్యే ఆదాయం ఆధారంగా ఆక్యుపెన్సీ రేషియోను లెక్కిస్తారు. రెండో శనివారం, ఆదివారం, క్రిస్మస్, బాక్సింగ్‌డే..ఇలా వరుస సెలవులు రావటంతో జనం ఊళ్ల బాట పట్టడంతో శనివారం ఒక్కరోజే 49,00,723 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండు, ఎల్బీనగర్, ఆరాంఘర్, ఉప్పల్‌కూడలి తదితర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. ఒక్క ఎంజీబీఎస్ నుంచే దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణించినట్టు అంచనా. ఒక్క రోజులో రూ.21.24 కోట్ల ఆదాయం ఆర్టీసీ బస్సుల్లో సంక్రాంతి, దసరా పండగల సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. పండగ సెలవుల్లో ఎక్కువ మంది ప్రయాణించటం ద్వారా రూ.20 కోట్ల వరకు ఆదాయం నమోదవుతుంది. సాధారణ రోజుల్లో అయితే, సోమవారం రద్దీ ఎక్కువగా ఉండి రూ.18 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సోమవారం కాకుండా, సంక్రాంతి, దసరా లాంటి పండగ సెలవులు లేనప్పటికీ శనివారం ఏకంగా రూ.21.24 కోట్ల ఆదాయం నమోదు కావటం విశేషం. క్రమంగా జనం పోటెత్తుతుండటంతో బస్సుల సంఖ్యను పెంచటంతోపాటు సిబ్బందిని ముఖ్య ప్రాంతాల్లో ఉంచి మానిటరింగ్ చేశారు. శనివారం ఒక్కరోజే సూపర్‌లగ్జరీ, డీలక్స్, గరుడ, రాజధాని బస్సులు రద్దీగా మారాయి. ఎక్కువ చార్జి ఉండే సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో సీట్లు నిండిపోవటంతో భారీగా ఆదాయం నమోదైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ఒక్కో గరుడ బస్సులో ట్రిప్పునకు రూ.లక్షన్నర చొప్పున ఆదాయం లభించింది. దీంతో ఆదాయం గరిష్ట స్థాయిలో నమోదై ఆక్యుపెన్సీ రేషియో పెరిగేందుకు కారణమైంది. -
కలిసొచ్చిన సెలవులు
ఆగస్టు 12వ తేదీన పుష్కరాలు మొదలవుతాయి. అదే రోజు వరలక్ష్మి వ్రతం ఐచ్ఛిక సెలవు, 13వ తేదీన రెడో శనివారం, 14వ తేదీ ఆదివారం, 15వ తేదీ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం. వరుసగా మూడురోజులు సెలవులు. 18వ తేదీ శ్రావణపూర్ణిమ రక్షాబంధన్ ఐచ్ఛిక సెలవుదినం, 21వ తేదీ ఆదివారం. మధ్యలో 16,17,19,20 తేదీలు మాత్రమే పనిదినాలు. సెలవుదినాలు వచ్చినందున పురాతన ఆలయాలుండే పుష్కర ప్రాంతాల్లో భక్తులు రద్దీ పెరిగే సూచనలున్నాయి. శని, సోమ వారాల్లో పూజలు పుష్కర మూలమూర్తి శివునికి ప్రీతికరం. శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతికరం. అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారు ఆలయంతో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. 16న శ్రావణ మంగళవారం, 18వ తేదీ శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్, 19న శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమే. ఈ రోజుల్లోనూ జోగులాంబ శక్తి పీఠం ఆలయం అలంపూర్ రద్దీ ఉండే అవకాశం ఉంది. -
బ్యాంకులకు వరుస సెలవులు లేవు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక సంవత్సరం చివర్లో బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బ్యాంకు అధికారులు ప్రకటించారు. హోళీ (మార్చి 24), గుడ్‌ఫ్రైడే (మార్చి 25), నాల్గవ శనివారం, ఆదివారం వరుసగా రావడంతో నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవని వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తెలుగు రాష్ట్రాలకు వర్తించదని స్థానిక బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో హోళీ సెలవును మార్చి 23 (మహారాష్ట్రలో 24)గా స్థానిక ప్రభుత్వాలు ప్రకటించాయి. అలాగే గుడ్‌ఫ్రైడేకి ఈ రెండు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు లేవు. దీంతో ఈ వారంలో మధ్యలో ఒకరోజు (మార్చి 23) తప్ప వరుస సెలవులు లేవని, ఖాతాదారులు ఆందోళన చెందనవసరం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు. వచ్చే నెలల్లో కూడా సెలవులు అధికంగా ఉన్నాయి కానీ వరుస సెలవులు లేవన్నారు. వచ్చే నెలల్లో శని, ఆదివారాలతో కలుపుకొని సుమారు పది రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. మార్చి నెలాఖరు, అధిక సెలవులను దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్లుగా ఏటీఎంలలో అధిక నగదు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంకు ఉన్నతాధికారులు వివరించారు. -
పల్లెబాట
దసరా కోసం సొంత ఊళ్లకు తరలిన నగరం వారం రోజుల్లో 10 లక్షల మంది కిక్కిరిసిన రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు సొంత వాహనాల్లోనూ భారీగా వెళ్లిన జనం సిటీబ్యూరో: మహా నగరం పల్లెబాట పట్టింది. దసరా ఉత్సవాల కోసం సొంత ఊళ్లకు తరలివెళ్లింది. బస్సులు, రైళ్లు, ప్రైవేట్ రవాణా వాహనాలు, వ్యక్తిగత వాహనాల్లో జనం భారీ సంఖ్యలో వెళ్లారు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఏపీ కంటే తెలంగాణ జిల్లాలకు భారీ సంఖ్యలో జనం పయనమయ్యారు. బుధవారం ఒక్కరోజే 2 లక్షల మందికి పైగా వివిధ మార్గాల్లో సొంత ఊళ్లకు వెళ్లారు. ఈసారి విద్యాసంస్థలకు ఎక్కువ రోజులు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో సొంత ఊళ్లలో గడిపేందుకు నగర వాసులు అధిక సంఖ్యలో పల్లె‘టూర్’కు సాగారు. ఈ వారం రోజుల్లో సుమారు 10 లక్షల మంది స్వగ్రామాలకు కదిలారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ఈ సంవత్సరం దసరా సందర్భంగా 117 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి విశాఖ, కాకినాడ, గుంటూరు, విజయవాడ, తిరుపతి, నిజామాబాద్, వరంగల్ వైపు వెళ్లే రైళ్లు కిటకిటలాడాయి. మరోవైపు ఆర్టీసీ 3,855 ప్రత్యేక బస్సులను నడిపింది. హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, కర్నూలు, కడప, చిత్తూరు, విజయవాడ, గుంటూరు, తిరుపతి, తదితర ప్రాంతాలకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బుధవారం ఒక్కరోజే సుమారు 850 బస్సులను ఏర్పాటు చేశారు. అదనపు సర్వీసుల్లో... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి రోజూ సుమారు 85 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 100 ప్యాసింజర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాకుండా ఈ వారం రోజుల్లో మరో 15 సర్వీసులను వివిధ ప్రాంతాలకు అదన ంగా నడిపారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. దీంతో నిత్యం బయలుదేరే 2.5 లక్షల మంది ప్రయాణికులతో పాటు ఈ వారం రోజుల్లో మరో 4 లక్షల మంది తరలి వెళ్లారు. జూబ్లీ, మహాత్మాగాంధీ, దిల్‌సుఖ్‌న గర్, ఎల్బీనగర్, కాచిగూడ, ఉప్పల్, ఏఎస్రావు నగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి బయలుదేరే రెగ్యులర్ బస్సులతో పాటు దసరా కోసం ఆర్టీసీ 3,855 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వీటిలో సుమారు 1500 ఏపీ వైపు .. మిగతావి తెలంగాణ జిల్లాలకు నడిచాయి. వివిధ ప్రాంతాలకు బయలుదే రిన మరో 1000 ప్రైవేట్ బస్సుల్లోనూ ప్రయాణికుల రద్దీ బాగా కనిపించింది. మొత్తంగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. ఇక సొంత వాహనాలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, టాటాఏసీల వంటి రవాణా వాహనాల్లోనూ సుమారు 2 లక్షల మంది పల్లెబాట పట్టారు. యధావిధిగా దోపిడీ పర్వం {పయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 200 కిలోమీటర్లకు పైగా వెళ్లే బస్సుల్లో ఆర్టీసీ చార్జీలో 50 శాతం అదనపు దోపిడీకి పాల్పడింది. {పైవేట్ బస్సులు రెట్టింపు చార్జీలతో దారి దోపిడీని కొనసాగించాయి. విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల కు ఏసీ బస్సు చార్జీలు రూ.650 నుంచి రూ.700 వరకు ఉంటే దసరా రద్దీ దృష్ట్యా రూ.1300 నుంచి రూ.1500కు పెంచారు. సాధారణ రోజుల్లో విశాఖకు రూ.950 కాగా ప్రస్తుతం రూ.1800 నుంచి రూ.2000 వరకు వసూలు చేసి దోచుకున్నారు. ఇతర ప్రైవేట్ వాహనాలు సైతం రెట్టింపు చార్జీలు వసూలు చేశాయి. ఒకవైపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే ఈ దోపిడీ పర్వంలో తానేమీ తీసిపోవడం లేదన్నట్లుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ చార్జీలను రూ.10 నుంచి రూ.20 కి పెంచింది. ఈ నెల 17 నుంచి 26 వరకు దీన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో ప్రతి రోజు సుమారు 25,000 మంది ఈ అదనపు భారాన్ని మోయవలసి రావడం గమనార్హం. రహదారులు ఖాళీ దసరా సందర్భంగా అధిక శాతం ప్రజలు పల్లెబాట పట్టడంతో మహా నగరంలోని వివిధ రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే వివిధ ప్రధాన రోడ్లు బుధవారం ఖాళీగా కనిపించాయి. వాహనాల రద్దీ కూడా తక్కువగా ఉంది.