అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. చెల్లెలంటే ప్రాణమిచ్చే అన్న.. అన్నయ్యంటే ప్రాణం పెట్టే చెల్లెళ్లను మనం చూసే ఉంటాం. ఇటువంటి కథనాలను మనం వినే ఉంటాం. అయితే అంతకుమించిన అనుభంధం రాజస్థాన్‌లోని ఈ అన్నాచెల్లెళ్లది.
రాజస్థాన్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన ఒక సోదరి తన సోదరునికి కిడ్నీని దానం చేయడం ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. వీరు ఆస్పత్రిలోనే రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఉపాధ్యాయురాలు సునీతా బుడానియా తన కిడ్నీని తన సోదరుడు దేవేంద్ర బుడానియాకు దానం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
2016లో దేవేంద్ర బుడానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపధ్యంలో అతని బంధువైన బీర్బల్ బుడానియా అతనికి కిడ్నీని దానం చేశారు. అయితే ఆ కిడ్నీ ఎనిమిదేళ్ల తర్వాత పనిచేయడం మానేసింది. దీంతో దేవేంద్రకు మరోమారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో దేవేంద్ర సోదరి సునీత తన అన్నకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా సునీతతో మీడియాతో మాట్లాడుతూ వివాహం అయినంతమాత్రన ఆడపిల్లకు పుట్టింటితో సంబంధం ముగిసిపోదని, అది ఇంకా పెరుగుతుందని అన్నారు. ఆడపిల్లకు అటు పుట్టినిల్లు, ఇటు అత్తారిల్లు అనే విధంగా బాధ్యతలు పెరుగుతాయన్నారు. తాను తన సోదరునికి కిడ్నీని దానం చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే డిశ్చార్జి కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment