Box Office Collections Clash With Raksha Bandhan Vs Laal Singh Chaddha, Deets Inside - Sakshi
Sakshi News home page

Raksha Bandhan Vs Laal Singh Chaddha: ఆమిర్‌తో పోటీపడుతున్న అక్షయ్‌.. పెద్ద సాహసమే!

Published Sat, Jun 18 2022 11:34 AM | Last Updated on Sat, Jun 18 2022 1:12 PM

Akshay kumar RakshaBandhan To  Clash With Aamir Khan Laal Singh Chadha - Sakshi

అక్షయ్‌ కుమార్‌కు ఈ ఏడాది కలిసి రావడం లేదు.గద్దలకొండ గణేష్ హిందీ రీమేక్ బచ్చన్ పాండే ఆర్ ఆర్ ఆర్ మేనియాలో కొట్టుకుపోయింది. ఇక సమ్రాట్ పృథ్వీరాజ్, భూల్ భూలయ్య - 2 హంగామా మధ్య కనిపించలేదు.ఇంత బ్యాడ్ ఫేజ్ లోనూ అక్షయ్‌  కొత్త సినిమాను వెంటనే రిలీజ్ చేస్తున్నాడు.ఆ మూవీనే రక్షాబంధన్. ఆగస్ట్ 11న రక్షాబంధన్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు అక్షయ్. 

అయితే సరిగ్గా ఇదే రోజును ఆమిర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చెద్దా రిలీజ్ అవుతోంది.2018లో తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజాస్టర్ తర్వాత బాగా సమయం తీసుకుని ఆమిర్ నటించిన చిత్రమిది.పైగా భారీ ఎత్తున ప్రమోషన్ నిర్వహిస్తున్నాడు.ఆమిర్ ఖాన్ మూవీకి హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కురుస్తాయి.ఆ విషయం ధూమ్ 3, పీకే, దంగల్ లాంటి చిత్రాలు నిరూపించాయి.అలాంటి ఆమిర్ ఖాన్ తో అక్షయ్ పోటీకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.అసలే ఫ్లాపుల్లో ఉన్న ఖిలాడి డైరెక్ట్ గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ తో పోటీకి దిగడం కరెక్ట్ కాదని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. మరి అక్షయ్ ప్లాన్ ఏంటి అనేది అతనే చెప్పాల్సి ఉంది. అసలే ఈ మధ్య బాలీవుడ్‌కి  కలెక్షన్స్ రావడం లేదు. ఈ దశలో మరో హీరోతో పోటీ పడుతూ సినిమా రిలీజ్ అంటే పెద్ద సాహసమే అని చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement