Goodbye 2021 Welcome 2022 Wishes Quotes Status Messages for Friends and Family Members
Sakshi News home page

Goodbye 2021 Welcome 2022: కొత్తొక వింత.. పాతొక రోత!

Published Fri, Dec 31 2021 4:28 PM | Last Updated on Fri, Dec 31 2021 5:49 PM

Goodbye 2021 Welcome 2022 - Sakshi

Goodbye 2021 Welcome 2022: ఎంతకాదన్నా 2021 సంవత్సరం మన జీవితాల్లో చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. కరోనా మహమ్మారి, తుఫానుల వంటి విపత్తులతో విసిగివేశారిపోయాం. నాటి స్మృతులు ప్రతి ఒక్కరి మనోఫలకంపై ఎన్నటికీ చెరగని ముద్ర వేశాయనడంలో అతిశయోక్తి లేదు. చెడుతోపాటు కూసింత మేలు కూడా చేసిందిలే. ఆ మంచి ఏమిటోనని అనుకుంటున్నారా? గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి భూమితోపాటు, ఓజోన్‌ను కూడా లాక్‌డౌన్‌ల రూపంలో దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఐతే గుడ్డిలోమెల్లలా పర్యావరణ పరిరక్షణపై మంచి గుణపాఠమే నేర్పింది గడచిన ఏడాది (ఎడాపెడా ప్రకృతికి తీరని నష్టం చేశాం కదా). అంతేకాకుండా సైన్స్‌ ఆధునిక ఆవిష్కరణలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాల్లో ఎంతో పురోగతి సాధించాం. కొత్త ఉపాధి అవకాశాలను అందించింది. ఐదే ప్రతి వంద సంవత్సరాలకు అంటువ్యాధులు ప్రభలుతాయనే నానుడి కూడా మరోవైపు లేకపోలేదు. ఏదిఏమైనప్పటికీ గతాన్ని మరచిపోయి వర్తమానాన్ని ఆస్వాధించడమే మన చేతుల్లో ఉంది.

ఇక వాటన్నింటికీ వీడ్కోలు చేప్పే సమయం ఆసన్నమైంది. కొత్త సంతోషాలతో, నూతనోత్సాహంతో న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చేప్పే ఆ శుభ గడియలు దగ్గరపడ్డాయ్‌! 2022 నూతన సంవత్సరాన్ని ఏదైనా మంచి పనితో ప్రారంభించాలని వ్యక్తులతోపాటు సంస్థలు కూడా ప్రణాళికలకు పూనుకుంటున్నాయి. మళ్లీ మళ్లీ కొత్త సంత్సరాలను వేడుకగా జరుపుకోవాడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కానీ దుఃఖాలు, ఎత్తుపల్లాలు అనేక సార్లు దాటిన అనుభవం ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, గడచిన ఏడాదిని మాత్రం అంత త్వరగా జీర్ణించుకోలేకపోవడమనేది నగ్న సత్యం. వీటన్నింటికీ అతీతంగా సుఖదుఃఖాలను పంచుకునే ఆత్మీయులను పెంపొందించుకోవాలి. అలాగే అడ్డంకులను అధిగమించడానికి ఒక దేశం మరొక దేశానికి సహాయసహకారాలు అందించాలి. మనం మనుషులం కాబట్టి కలిసి జీవించాలి, కలిసి సమస్యలను పారదోలాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు! 

గతం గతః..
2021 మిగిల్చిన చేదు గుర్తులను మరిచిపోదాం
2022లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుందాం..
కలిసికట్టుగా కష్టాలను తరిమి కొడదాం.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం..
మనోబలంతో ముందుకు సాగుదాం..
కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

నిన్నటి వరకు నేర్చుకున్నాం..
రేపటి కోసం ఆలోచిద్దాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ 2022 సంవత్సరం మీ జీవితంలో ఎక్ట్రార్డినరీగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

మీ కలలకు రెక్కలు తొడగండి వాటిని నిజం చేసుకోడానికి 2022లో శ్రమించి విజయం సాధించడండి. హ్యాపీ న్యూ ఇయర్ 2022

గతాన్ని మరిచిపోండి.. మీ ముందు 2022 సంవత్సరం నూతన అవకాశాలను ఇస్తుంది.. వినియోగించుకొని విజయం సాధించండి.

జీవితమే అందమైన జర్నీలో ఓ సాహసం.. ఈ 2022 సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

జీవితం చాలా చిన్నది.. పెద్ద కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేందుకు ఈ 2022 సంవత్సరాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి

కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం..
మనోబలంతో ముందుకు సాగుదాం..
కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

చదవండి: డిసెంబర్‌ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్‌ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement