భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమించాలి | we take inspiration Bhagath singh | Sakshi
Sakshi News home page

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమించాలి

Published Tue, Sep 27 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమించాలి

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమించాలి

 – ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు స్టాలిన్‌
చిలుకూరు: విద్యార్థులు భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమించాలని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు స్టాలిన్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌  జయంతి సందర్భంగా సెమినార్‌ నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ 23 ఏళ్ల వయస్సులో భగత్‌సింగ్‌ స్వాంతత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాడని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందియన్నారు. అనంతరం భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, ఎంపీటీసీ పుట్టపాక శ్రీనివాస్‌ యాదవ్, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చేపూరి కొండల్, సహాయ కార్యదర్శి కొండూరి వెంకటేష్, జిల్లా, మండల విద్యార్థి సంఘం నాయకులు తమ్మనబోయిన నరేశ్, ఉపేందర్, యాదగిరి, రంగా, నవీన్, భారతీ, శైలజ, సావిత్రి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement