ఏపీలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ | Nominations For Lok Sabha and AP Assembly Polls Begin Today Updates | Sakshi
Sakshi News home page

ఏపీలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ

Published Thu, Apr 18 2024 7:06 AM | Last Updated on Thu, Apr 18 2024 4:29 PM

Nominations For Lok Sabha and AP Assembly Polls Begin Today Updates - Sakshi

Updates

ఏలూరు జిల్లా :

నూజివీడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు

  • స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రబోయిన
  • నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు

టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురు దెబ్బ 

  • రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత ప్రొఫెసర్ రాజేష్ 
  • టీడీపీ రాప్తాడు ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్ 
  • పరిటాల సునీత ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా...

  • రామచంద్రపురం ఆర్డీఒ కార్యాలయంలో  నామినేషన్ దాఖలు చేసిన  వైఎస్సార్‌సీపీ  అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్....
  • పిల్లి సూర్యప్రకాష్ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి  సుధా సుధా సాగర్‌కు అందజేత.

అనంతపురం
ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు


శ్రీ సత్యసాయి జిల్లా
 పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ శాంత తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు

అన్నమయ్య : 
రాజంపేటంలో అట్టహాసంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్ 

  • అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అకేపాటి అమరనాథరెడ్డి
  • సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించిన అమరనాథరెడ్డి
  • నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు

తిరుపతి
కిలివేటి సంజీవయ్య నామినేషన్‌ దాఖలు

  • సూళ్లూరుపేట రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎ‍స్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య
  • హాజరైన ఎన్డీసిసిబి బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి,  వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి, కలికి మాధవరెడ్డి
     

ఎన్టీఆర్ జిల్లా
నామినేషన్‌ సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్

  • తిరువూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్
  • కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ పూనూరు గౌతమ్ రెడ్డి

తూర్పుగోదావరి
తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు 

  • కొవ్వూరులో ఆర్డిఓ ఆఫీస్ వద్ద  10 వేలమంది పార్టీ కార్యకర్తలు అభిమానులతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు

నెల్లూరు
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్‌ దాఖలు

  • కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
     

కర్నూలు జిల్లా 
నామినేషన్‌ వేసిన బుట్ట రేణుక

  • ఎమ్మిగనూరులో పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బుట్ట రేణుక
  • పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, వీరశైవ లింగాయత్ కార్పోరేషన్ చైర్మన్ రుద్ర గౌడ్

వైఎస్సార్‌ జిల్లా
నామినేషన్‌ వేసిన రఘురామి రెడ్డి

  • మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామి రెడ్డి
  • పాల్గొన్న వైఎస్ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు

భూమన అభినయ్ రెడ్డి నామినేషన్‌ దాఖలు

  • తిరుపతి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూమన అభినయ్ రెడ్డి 
  •  అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వెంట మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యుడు వెంకటేష్ తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు

నామినేషన్‌ వేసిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

  • అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

నామినేషన్‌ దాఖలు చేసిన ఎం.సీ విజయనందరెడ్డి

  • చిత్తూరులో అటహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం సి విజయనందరెడ్డి
  • పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీ రెడ్డప్ప, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్ రెడ్డి తదితరులు

నామినేషన్‌ దాఖలు చేసిన  కావలి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

  • వైఎస్సార్‌సీపీ తరుఫున కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్  ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు

ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది

  • ఉదయం 11  గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన
  • నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు

కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియ

  • ఉదయం 11  గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
  • ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక
  • శ్రీశైలం వైఎ‍స్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న చక్రపాణిరెడ్డి
  • ఎమ్మిగనూరు వైఎ‍స్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న  బుట్టా రేణుక
  • మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న  లోకేష్‌
  • చిత్తూరు వైఎ‍స్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న  విజయానందరెడ్డి
  • దర్శి వైఎ‍స్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయనున్న శివ ప్రసాద్‌రెడ్డి

నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల

  • ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ
  • ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో  96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు
  • ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ 
  • ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 
  • ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన 
  • ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం 
  • మే 13న పోలింగ్

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం

  • నేడు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు  నామినేషన్ల ప్రక్రియ షురూ
  • ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో  96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు
  • ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ 
  • ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 
  • ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన 
  • ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం 
  • మే 13న పోలింగ్

ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేయనుంది. దీంతో ఈనెల 18 నుంచి ఏప్రిల్‌ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్‌ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పార్లమెంట్‌ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.

ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే  నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్‌ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్‌ కాగా.. జూన్‌ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 

ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. 
ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్‌ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్య­ర్థులు సువిధ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నామినే­షన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు.

అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన  రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్‌గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్‌ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్‌ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

నామినేషన్‌ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను  మాత్రమే అనుమతిస్తారు. నామి­నేషన్‌ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్‌ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి  ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటుచేశారు. 

ఫారం–26 తప్పనిసరి.. 
ఇక నామినేషన్‌ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్‌) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్‌ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్‌ పేపర్‌ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్‌ పేపర్‌ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్‌ పేపర్‌ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమి­­నల్‌ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్‌ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్‌ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్‌ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్‌ సింబల్‌ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్‌ ఫారంలో రాయాలి.

నామినేషన్‌ రుసుం ఇలా.. 
పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్‌ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది.

ప్రతి అభ్యర్థి నామినేషన్‌తో పాటు లేటెస్ట్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్‌ వేసిన తరువాత అభ్యర్థి రశీదు­తోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్‌ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటా­యించే తేదీ, సమయం తెలిపే నోటీసు­లను అధికారుల నుంచి తీసుకోవాలి. నామి­నే­షన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది.

నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్‌
నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్‌ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వర­కు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్‌ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి. 

ముఖ్యమైన తేదీలు

  • నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్‌ 25 గురువారం 
  • ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ ఏప్రిల్‌ 18 గురువారం 
  • నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 26 శుక్రవారం 
  • నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్‌ 29 సోమవారం 
  • పోలింగ్‌ తేదీ మే 13 సోమవారం 
  • ఓట్ల లెక్కింపు జూన్‌ 4 మంగళవారం 
  • ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్‌ 6 గురువారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement