Nominations process
-
ఏపీలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ
Updates ఏలూరు జిల్లా : నూజివీడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ముద్రబోయిన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురు దెబ్బ రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ నేత ప్రొఫెసర్ రాజేష్ టీడీపీ రాప్తాడు ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్ పరిటాల సునీత ఓటమే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా... రామచంద్రపురం ఆర్డీఒ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్.... పిల్లి సూర్యప్రకాష్ రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి సుధా సుధా సాగర్‌కు అందజేత. అనంతపురం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ శాంత తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు అన్నమయ్య : రాజంపేటంలో అట్టహాసంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి నామినేషన్ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అకేపాటి అమరనాథరెడ్డి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించిన అమరనాథరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తిరుపతి కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు సూళ్లూరుపేట రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య హాజరైన ఎన్డీసిసిబి బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి, కలికి మాధవరెడ్డి ఎన్టీఆర్ జిల్లా నామినేషన్ సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన నల్లగట్ల స్వామిదాస్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ పూనూరు గౌతమ్ రెడ్డి తూర్పుగోదావరి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు కొవ్వూరులో ఆర్డిఓ ఆఫీస్ వద్ద 10 వేలమంది పార్టీ కార్యకర్తలు అభిమానులతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు నెల్లూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కర్నూలు జిల్లా నామినేషన్ వేసిన బుట్ట రేణుక ఎమ్మిగనూరులో పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్ట రేణుక పాల్గొన్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య, వీరశైవ లింగాయత్ కార్పోరేషన్ చైర్మన్ రుద్ర గౌడ్ వైఎస్సార్ జిల్లా నామినేషన్ వేసిన రఘురామి రెడ్డి మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామి రెడ్డి పాల్గొన్న వైఎస్ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు భూమన అభినయ్ రెడ్డి నామినేషన్ దాఖలు తిరుపతి నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భూమన అభినయ్ రెడ్డి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వెంట మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యుడు వెంకటేష్ తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన ఎం.సీ విజయనందరెడ్డి చిత్తూరులో అటహాసంగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం సి విజయనందరెడ్డి పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీ రెడ్డప్ప, చంద్రగిరి అసెంబ్లీ అభ్యర్థి మోహిత్ రెడ్డి తదితరులు నామినేషన్ దాఖలు చేసిన కావలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్సార్సీపీ తరుఫున కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక శ్రీశైలం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చక్రపాణిరెడ్డి ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న బుట్టా రేణుక మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న లోకేష్ చిత్తూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న విజయానందరెడ్డి దర్శి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న శివ ప్రసాద్‌రెడ్డి నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ నేటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం నేడు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ.. ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు. అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్‌గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేశారు. ఫారం–26 తప్పనిసరి.. ఇక నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్ సింబల్ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. నామినేషన్ రుసుం ఇలా.. పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ప్రతి అభ్యర్థి నామినేషన్‌తో పాటు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది. నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్ నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి. ముఖ్యమైన తేదీలు నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్ 25 గురువారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18 గురువారం నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 సోమవారం పోలింగ్ తేదీ మే 13 సోమవారం ఓట్ల లెక్కింపు జూన్ 4 మంగళవారం ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్ 6 గురువారం -
‘బీ’.. రె‘ఢీ’..!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో పరుగులు పెడుతున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆదివారం మరో కీలక ముందడుగు వేస్తోంది. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నామినేషన్ల ప్రక్రియకు 18 రోజుల ముందే బీ ఫారాలు అందజేయనున్నారు. ప్రధాన ప్రతిపక్షాలు ఇంతవరకు తమ అభ్యర్థులనే ఖరారు చేయకపోవడం గమనార్హం. కాగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు జరిగే బీఆర్ఎస్ విస్తృతస్థాయి భేటీలో ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు. పార్టీ అభ్యర్థులుగా ఇప్పటికే ఖరారైన వారితో పాటు రాష్ట్ర కార్యవర్గం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఎన్నికలకు సంబంధించిన దిశా నిర్దేశంతో భేటీ ముగిసిన తర్వాత పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం హుస్నాబాద్‌లో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభకు బయలుదేరి వెళతారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ భవన్లో శనివారం సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 119 మంది అభ్యర్థులకు బీ ఫారాలు? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను సుమారు రెండు నెలల క్రితమే ఆగస్టు 21న కేసీఆర్ ప్రకటించారు. 119 స్థానాలకు గాను 115 మందితో జాబితాను విడుదల చేశారు. వీరిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడారు. దీంతో పెండింగులో ఉన్న జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్తో పాటు మల్కాజిగిరికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే భేటీలో 114 మందితో పాటు పెండింగ్‌లో ఉన్న మిగతా ఐదు నియోజకవర్గాల అభ్యర్థులకు కూడా కేసీఆర్ బీ ఫారాలు అందజేస్తారని సమాచారం. పెండింగ్ స్థానాల్లోనూ అభ్యర్థులు ఖరారు? పెండింగ్‌లో ఉన్న మల్కాజిగిరికి మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌కు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిల పేర్లు ఖరారయ్యాయి. నాంపల్లి నుంచి ఆనంద్‌గౌడ్, గోషామహల్ అభ్యర్థులుగా నందకిషోర్ వ్యాస్ పేర్లు కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా వారికి పార్టీ నుంచి ఇంకా సమాచారం అందలేదని తెలిసింది. ఇదిలా ఉంటే గతంలో ప్రకటించిన 114 మందిలో ఆలంపూర్ అభ్యర్థితో సహా ఒకరిద్దరి అభ్యర్థిత్వాన్ని మార్చే అవకాశముందనే ప్రచారం కూడా సాగుతోంది. అసంతృప్తి సద్దుమణగక పోవడం, గెలుపు అవకాశాలు, బీసీ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు ఉంటుందని భావిస్తున్నారు. మేనిఫెస్టో సిద్ధం ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ, విపక్షాల ఎన్నికల హామీలను కూడా దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ మేనిఫెస్టోను సిద్ధం చేశారు. రైతులు, మహిళలు, యువత, దళిత, గిరిజనులు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని మేనిఫెస్టోకు రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనాకర్షక హామీలతో కూడిన మేనిఫెస్టోను ఆదివారం కేసీఆర్ విడుదల చేయనున్నారు. రైతుబంధు, ఆసరా పింఛను మొత్తం పెంపు, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం/ భారీ సబ్సిడీతో ఇవ్వడం, జర్నలిస్టులకు పింఛను వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. ప్రచార సభలు, సమన్వయంపై దిశా నిర్దేశం కేసీఆర్ ఆదివారం నుంచి వచ్చే నెల 9 వరకు 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో ప్రసంగించేలా ఇప్పటికే షెడ్యూలు ఖరారు చేశారు. పోలింగ్ తేదీ నాటికి ఆయన సుమారు వంద సభల్లో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. మరోవైపు 54 నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జిలను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ అభ్యర్థులతో జరిగే సమావేశంలో బహిరంగ సభల నిర్వహణ, జన సమీకరణ, సమన్వయం, ప్రచార అంశాలు తదితరాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారని తెలిసింది. విపక్ష పార్టీల ఎన్నికల వ్యూహాలు, ప్రచారం తదితరాలపై కూడా పలు సూచనలు చేయనున్నట్టు సమాచారం. కాగా ఆదివారం సాయంత్రం హుస్నాబాద్‌లో జరిగే తొలి ఎన్నికల ప్రచార సభలో మేనిఫెస్టోలోని అంశాలను తొలిసారిగా ప్రజల ముందు పెట్టనున్నారు. లక్ష మందితో సభ సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో 20 ఎకరాల విస్తీర్ణంలో లక్ష మందితో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ తొలి సభను హుస్నాబాద్‌లో నిర్వహించనున్నారు. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌లు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు హుస్నాబాద్‌కు చేరుకుని సభలో ప్రసంగిస్తారు. -
‘పద్మ’ నామినేషన్లకు ఆఖరు తేదీ 15
న్యూఢిల్లీ: పద్మ అవార్డులు–2023కు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, సిఫారసుల స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులకు ఆన్లైన్ పోర్టల్ https:// awards.gov.in ద్వారా మాత్రమే సిఫారసులు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. విశిష్ట సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలను కేంద్రం ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తుంది. ప్రతిపాదనలను, నామినేషన్లను ఇతరుల గురించి, లేదా తమకు తాముగా 800 పదాల్లో వివరిస్తూ పంపుకోవచ్చునని హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్ ఇన్ ఫారెస్ట్రీ–2022కు, నేషనల్ గోపాలరత్న–2022కు, నేషనల్ వాటర్ అవార్డ్స్‌కు సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ అని తెలిపింది. నారీశక్తి పురస్కార్–2023కి అక్టోబర్ 31 చివరి తేదీ అని వివరించింది. -
జోరుగా కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. నేడు చివరి తేదీ కావటంతో నామినేషన్ల్ వేయటం కోసం క్యూ కట్టిన నేతలు. అనతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు జోరుగా నామినేషన్ల వేస్తున్నారు. రాప్తాడులో వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా తలారిరంగయ్య, హిందూపురం లోకసభ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గోరంట్ల మాధవ్ దంపతుల నామినేషన్ దాఖలు నామినేషన్ దాఖలు చేశారు. -
తొలిరోజు 31 నామినేషన్లు
ఇచ్చోడ(బోథ్): జిల్లాలో మూడోవిడత జరిగే పంచాయతీ ఎన్నికలకు బుధవారం నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు నామినేషన్ల ప్రకియ కొనసాగనుంది. తొలిరోజు జరిగిన నామినేషన్ల ప్రకియ మందకొడిగా సాగింది. జిల్లాలో మూడోవిడతలో ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్ మండలాల్లోని 163 సర్పంచ్ స్థానాలకు, 1358 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలిరోజు నామినేషన్లు నామమాత్రంగానే వచ్చాయి. 163 పంచాయతీలకు 31 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 1358 వార్డులకు 28 మాత్రమే వచ్చాయి. బుధవారం సంక్రాంతి కావడంతో ఎక్కువగా నామినేషన్లు దాఖలు కాలేకపోయాయి. గురువారం, శుక్రవారం రోజు అత్యధికంగా నామినేషన్లు దాఖలు కానున్నట్లు తెలుస్తోంది. చాలామంది అభ్యర్థులు ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మూడోవిడతలో జరిగే ఎన్నికల్లో అత్యధికంగా ఏజెన్సీ గ్రామాలు ఉండడంతో ఏకగ్రీవ ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముహూర్తం చూసుకున్నాకే.. ఐదేళ్లపాటు సర్పంచ్ పదవిలో కొనసాగాలంటే మంచి ముహూర్తం చూసుకోవాలంటున్నారు చాలామంది అభ్యర్థులు. ఈనేపథ్యంలో మూడో విడత తొలిరోజు నామినేషన్లు నామమాత్రంగానే వచ్చాయి. బుధవారం కనుమ పండుగ కావడం, ముహూర్తం కలిసిరాకపోవడంతో గురు, శుక్రవారాల్లో నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. 19న నామినేషన్ల పరిశీలన, 20న అప్పీల్, 21న విచారణ, 22న నామినేషన్ల ఉపసంహరణ, అదేరోజు అభ్యర్థులతోపాటు గుర్తులు ప్రకటిస్తారు. -
రెండో విడతా అదే జోరు
నారాయణఖేడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని మనూరు, నాగల్గిద్ద, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, నారాయణఖేడ్ మండలాల పరిధిలోని 190 గ్రామ పంచాయతీలకు సంబంధించి 190 సర్పంచ్, 1,598 వార్డు పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. నారాయణఖేడ్ మండలంలో 51 గ్రామ పంచాయతీలు, 440 వార్డులు, మనూరులో 22 పంచాయతీలు, 176 వార్డులు, నాగల్గిద్దలో 31 పంచాయతీలు, 248 వార్డులు, కంగ్టిలో 34 పంచాయతీలు, 290 వార్డులు, కల్హేర్‌లో 26 పంచాయతీలు, 224 వార్డులు, సిర్గాపూర్‌లో 26 పంచాయతీలు, 212 వార్డులకు సంబంధించి అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఒక్కో మండలంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు 8 నుంచి 13వరకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డింగ్ నిర్వహించారు. మొదటి రోజు ఉదయం 10.30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5గంటలవరకు కొనసాగింది. మధ్యాహ్నం 12గంటల వరకు మందకొడిగా నామినేషన్లు రాగా మధ్యాహ్నం తర్వాత గ్రామాలు, తండాల నుంచి అభ్యర్థులు, వారి అనుచరులు తరలివచ్చారు. నారాయణఖేడ్ మండలానికి సంబంధించి మండల పరిషత్ కార్యాలయం, దీని ఆవరణలోని సీఎల్ఆర్సీ భవనంలో నామినేషన్లు స్వీకరించారు. మనూరు, కల్హేర్, కంగ్టి ఉమ్మడి మండలాల వారీగా ఆయా మండలాల్లో నామినేషన్లు స్వీకరించారు. ఆయా పదవులకు పోటీచేసే అభ్యర్థులు తమ మద్దతుదారులు, గ్రామస్తులతో కలిసి డప్పుచప్పుళ్లు, బాజాభజంత్రీలు వాయిస్తూ తరలివచ్చారు. టీఆర్ఎస్ మద్దతుదారులు నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని, కాంగ్రెస్ మద్దతుదారులు ఆపార్టీ నాయకుడు నగేష్ షెట్కార్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియను ఎంపీడీఓలు, తహసీల్దారులు పర్యవేక్షించారు. గిరిజన మహిళలు నామినేష్ల దాఖలుకు తరలివచ్చి సంప్రదాయ నృత్యాలు చేశారు. యువకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా డివిజన్లోని మండల పరిషత్ కార్యాలయాల నుంచి అన్ని మార్గాల్లో 100మీటర్ల పరిధిలో పోలీసులు 144 సెక్షన్‌ను అమలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులతోపాటు వారిని ప్రతిపాదించే వారి ని మాత్రమే కార్యాలయ ఆవరణలోకి అనుమతించారు. మిగిలిన వారిని కార్యాలయం బయటే ఉంచారు. గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో పట్టణంలో ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది. హోటళ్లు, టీకొట్లు కిక్కిరిసిపోయాయి. -
ఆర్థిక కమిటీల చైర్మన్లు ఎవరు?
* పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికివ్వడం ఆనవాయితీ * పీయూసీ, అంచనాల కమిటీల కోసం తెరపైకి సీనియర్ల పేర్లు * నేడు నామినేషన్ల దాఖలు... రేపు ఉపసంహరణ గడువు * ఏకగ్రీవం కాకపోతే 25న ఎన్నిక సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఆర్థిక సంఘాల (ఫైనాన్స్ కమిటీలు) ఎన్నికకు సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రజా పద్దులు(పీఏసీ), అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)లకు శాసన సభ నుంచి 9 మంది, మండలి నుంచి నలుగురు చొప్పున సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇందులో నుంచే ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కమిటీల చైర్మన్లు, సభ్యుల ఎన్నికకు సోమవారం (23వ తేదీ) మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మూడు నుంచి ఐదు గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వ తేదీన మూడు గంటల వరకు ఉపసంహరణల గడువుగా నిర్ణయించారు. అయితే, ఏకగ్రీవం కాని పక్షంలో 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరుగుతుంది. ఇదిలాఉండగా, ఈ కమిటీలలో పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్షం నుంచి ఒకరిని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక మిగిలిన అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలకు చైర్మన్లు ఎవరు అవుతారనే దానిపై అధికార టీఆర్ఎస్లో చర్చ మొదలైంది. సాధారణంగా సీనియర్ సభ్యులను చైర్మన్లుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. అయితే, అధినేత మదిలో ఏముందో తెలియక, ఎవరికి అవకాశం దక్కుతుందో చెప్పలేకపోతున్నారు. కార్పొరేషన్ పదవులకు కత్తెరేనా! టీఆర్ఎస్ నుంచి పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. సంఖ్యా పరిమితి కారణంగా కొందరికి అవకాశం రాలేదు. దీంతో వీరి దృష్టంతా ముఖ్యమైన ఆర్టీసీ, టీఎస్ఐఐసీ వంటి కార్పొరేషన్ పదవులపై ఉంది. ఇదే జాబితాలో వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు, ఇతర కొన్ని కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. ఈ పదవులు ఎపుడు భర్తీ అవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇపుడు పీయూసీ, అంచనాల కమిటీల చైర్మన్ల పదవులు అంగీకరిస్తే, వీటిని చూపించి కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు ఎక్కడ కత్తెర పెడతారో అన్న ఆందోళన వీరిలో వ్యక్తం అవుతోంది. ఈ పదవులను చూపించి తమ పేరును పరిగణనలోకి తీసుకోకుండా పోతారేమోనన్న అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ సభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, దివాకర్‌రావు, రామలింగారెడ్డి వంటివారు పదవుల రేసులో ఉన్నవారే. బాజిరెడ్డి గోవర్ధ్దన్ సీనియర్ అయినా, ఆయన ఇప్పటికే వక్ఫ్‌బోర్డు సభా సంఘానికి చైర్మన్‌గా ఉన్నారు. మహిళల్లో కొండా సురేఖ మాత్రమే సీనియర్‌గా ఉన్నారు. దీంతో వీరిలో ఎవరినైనా ఎంచుకుంటారా..? లేదా జూనియర్ల నుంచే ఒకరిని ఎంపిక చేస్తారా? అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పీఏసీ చైర్మన్‌గా కిష్టారెడ్డి..! ప్రతిపక్షానికి దక్కనున్న శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే పి. కిష్టారెడ్డి నియామకం ఖరారైనట్లే. ఇందుకు సంబంధించి సోమవారం ఆ పార్టీ అధికారికంగా త న నిర్ణయాన్ని ప్రకటించనుంది. నాలుగుసార్లు గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నా ఇంతవరకు మంత్రిపదవి లభించని ఆయనకే ఈ పదవిని కట్టబెట్టాలని గతంలో పార్టీ నాయకులు నిర్ణయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్లు గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణ మంత్రి పదవులను నిర్వహించిన విషయం తెలిసిందే. అందువల్ల కిష్టారెడ్డివైపే పార్టీ నాయకత్వం కూడా మొగ్గుచూపింది. అయితే ఈ పదవి కోసం మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఒకరిద్దరు నాయకులు పోటీపడుతున్నట్లు సమాచారం. దీంతో తొలిరెండేళ్లు కిష్టారెడ్డికి అవకాశమిచ్చి, చివరి రెండేళ్లు రాంరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని పార్టీనాయకులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రెండురోజుల క్రితం అసెంబ్లీలో జానారెడ్డి చాంబర్లో ఒక నిర్ణయానికి వచ్చినట్లు, సోమవారం దీనినే ప్రకటించనున్నట్లు తెలిసింది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
- భారీగా తిరుగుబాటు అభ్యర్థులు - వారసులకూ టికెట్లు సాక్షి ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నామినేషన్లు ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేలు నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారి వల్వి ‘సాక్షి’కి తెలిపారు. ఆయన అందించిన వివరాల మేరకు రాష్ట్రంలో శుక్రవారం వరకు 3,040 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు శనివారం ఒక్కరోజే సుమారు మూడు వేలు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పత్రాలు సమర్పించేందుకు వచ్చిన రాజకీయ నాయకులు తమ మందీ మార్బలంతో ఎన్నికల కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున బలప్రదర్శనలు నిర్వహించారు. చివరి రోజు రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు పెద్ద సంఖ్యలో తిరుగుబాటుదారులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను తిరిగి వెనక్కి తీసుకునేందుకు అక్టోబరు ఒకటవ తేదీ వరకు గడువు ఉంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు విడివిడిగా పోటీ చేస్తుండడంతో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్లు వేసే నాయకులు ముందుగానే తాము వచ్చే సమయాన్ని తెలియచేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అభ్యర్థులు బ్యాండుమేళాలతో ఊరేగింపులతో వచ్చి నామినేషన్లు వేశారు. పార్టీ నుంచి టిక్కెట్ లభిస్తే సరే లేదంటేతిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలవాలని అనేక మంది నిర్ణయించుకున్నారు. చివరి క్షణంలో అనేక మంది తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఠాణేలో శివసేన నాయకుడు అనంత్ తరే చివరి రోజు పార్టీ అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా కోప్రి-పాచ్‌పాఖడీ అసెంబ్లీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో శివసేనకు కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఏర్పడ్డాయి. మరోవపు ఇలాంటి సంఘటనలే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కన్పించాయి. వారసత్వ రాజకీయాలు... వారసత్వ రాజకీయాలు లేవని ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు సీనియర్ నాయకులు తమ బంధువులు, వారసులకు టికెట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్‌లో... కాంగ్రెస్‌లో అనేకమంది నాయకుల వారసులకు, బంధువులకు టిక్కెట్లు లభించాయి. ముఖ్యంగా సీనియర్ నాయకుడైన నారాయణ రాణే కుడాల్-మాలవణ్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయగా ఆయన కుమారుడు నితేష్ రాణే కనకవ్లీ-దేవగడ్-వైభవ్వాడీ సీటు నుంచి బరిలోఇక దిగారు. మరోవైపు ఎంపీసీసీ అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే కుమారుని కోసం యావత్మాల్ అసెంబ్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నందినీ పార్వేకర్ను తప్పించారు. అక్కడి నుంచి మాణిక్ రావ్ ఠాక్రే కుమారుడు రాహుల్ బరిలోకి దిగారు. భోకర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సతీమణి అమితా చవాన్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. దివంగత మాజీ మంత్రి సుభాష్ జనక్ కుమారుడు అమిత్‌ను రిసోడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇలా అనేక మంది కాంగ్రెస్ నాయకుల బంధువులు బరిలో ఉన్నారు. ఎన్సీపీలో... ఎన్సీపీలో కూడా పెద్ద ఎత్తున వారసత్వ రాజకీయాలు కన్పించాయి. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షులు సునీల్ తట్కరే సోదరుని కుమారుడైన అవదూత్ తట్కరేకు శ్రీవర్ధన్ నుంచి టిక్కెట్ లభించింది. మరోవైపు శాసనమండలి ఉపసభాపతి వసంత్ డావ్కరే కుమారుడు నిరంజన్ డావ్కరేను ఠాణే నుంచి బరిలోకి దింపారు. ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మలిక్ సోదరుడు కప్తాన్ మలిక్‌కు కలీనా అసెంబ్లీ నియోజకవర్గంలో టిక్కెట్ కెటాయించారు. ఇలా ఎన్సీపీలో కూడా పెద్ద ఎత్తున ప్రముఖ నాయకుల బంధువులకు టిక్కెట్లు లభించాయి. శివసేన, బీజేపీలలో... శివసేన, బీజేపీలలో పలువురు నాయకుల బంధువులకు టిక్కెట్లు లభించాయి. శివసేన నాయకుడైన మాజీ మంత్రి బబన్‌రావ్ ఘోలప్ కుమారుడు యోగేష్‌కు దేవలాలి నియోజకవర్గంలో టిక్కెట్ లభించింది. ఎమ్మెల్యే అశోక్ కాలే కుమారున్ని కోపర్గావ్ నియోజకవర్గం నుంచి శివసేన బరిలోకి దింపింది. ఇక బీజేపీని పరిశీలిస్తే మాజీ సహాయక మంత్రి ప్రశాంత్ హిరే కుమారుడు అద్వయ్కు నందగావ్ నుంచి టిక్కెట్ కేటాయించారు. -
ఇక ప్రచార సవ్వడి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శనివారం నామినేషన్లకు ఉపసంహరణకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా తయారు చేసేందుకు జిల్లా యంత్రాంగం అర్ధరాత్రి వరకు జాబితా తయారీలో నిమగ్నమైంది.నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినందున ఆదివారం నుంచి సార్వత్రిక ఎన్నికలతో ప్రచార పర్వానికి తెర లేవనుంది. అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు పాల్గొననున్నారు. అయితే ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కలెక్టర్, ఎన్నికల పరిశీలకులకు సూచిస్తున్నారు. మొన్నటి వరకు ‘స్థానిక’ శబ్దంతో హోరెత్తిన గ్రామాల్లో ఇక సార్వత్రిక ప్రచార సవ్వడి కన్పించనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీలు ప్రచార షెడ్యూల్లు రూపొందిస్తున్నాయి. బహిరంగ సభలు, ప్రచారాలు, పార్టీల అగ్రనేతల సభలు, సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంటున్నాయి. ముగిసిన ఉపసంహరణ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో రాథోడ్ శ్యాంరావు ఉపసంహరించుకున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి గోడం నగేష్, నరేష్ జాదవ్, రాథోడ్ రమేష్,రాథోడ్ సదాశివ్, నేతావత్ రాందాస్, పవార్ కృష్ణ, బంక సహదేవ్, మొసలి చిన్నయ్యతో కలిపి ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఇద్దరు అభ్యర్థులు గోమాస శ్రీనివాస్, మతాంగి సురేష్‌లు ఉపసంహరించుకున్నారు. మిగతా 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎనిమిది మంది, పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి 17 మంది మొత్తం రెండు లోక్‌సభ స్థానాలకు 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ స్థానాల్లో ఉపసంహరణ జిల్లాలో పది నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు 238 నామినేషన్లు దాఖలు కాగా, ఈ నెల 10న పరిశీలించారు. పరిశీలనలో 101 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం 137 నామినేషన్లు ఆమోదించారు. కాగా, శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో 30 మంది అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గానికి 17 నామినేషన్లు ఆమోదం పొందగా, ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇలాగే చెన్నూర్‌లో 17కు ఇద్దరు ఉపసంహరించుకోగా 15 మంది, బెల్లంపల్లిలో 24కు ముగ్గురు ఉపసంహరించుకోగా 21 మంది, మంచిర్యాలలో 18కి ఐదుగురు ఉపసంహరించుకోగా 15 మంది, ఆసిఫాబాద్‌లో 10కి ఇద్దరు ఉపసంహరించుకోగా 8 మంది, ఖానాపూర్‌లో 8 మందికి ఇద్దరు ఉపసంహరించుకోగా ఆరుగురు, ఆదిలాబాద్‌లో 23 మందికి ఎనిమిది మంది ఉపసంహరించుకోగా 15 మంది, బోథోలో ఆరుగురికిగాను ఒకరు ఉపసంహరించుకోగా, ఐదుగురు.. నిర్మల్‌లో 8 మందికి ఒకరు ఉపసంహరించుకోగా ఏడుగురు, ముథోల్‌లో ఆరుగురు అభ్యర్థులకు ఆరుగురు బరిలో నిలిచారు. ముథోల్ నియోజకవర్గంలో నామినేషన్లు ఉపసంహారించుకోలేదు. పది నియోజకవర్గాల్లో 137 నామినేషన్లు పరిశీలన అనంతరం ఆమోదించగా, 30 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా 107 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
అస్త్రాలు సిద్ధం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్,నామినేషన్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార వ్యూహానికి పదును పెట్టే పనిలో ఉన్నారు. స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల పోలింగ్ తంతు శుక్రవారం సాయంత్రం ముగిసింది. మరోవైపు శనివారం మధ్యాహ్నానికి సాధారణ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రి యకు తెరపడనుంది. అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఉండటంతో బరి నుంచి తప్పించడం తలకు మించి భారంగా పరిణమిస్తోంది. బుజ్జగింపుల ద్వారా కూడా తిరుగుబాటు అభ్యర్థులు తప్పుకోని పక్షంలో ప్రచారంపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని అభ్యర్థులు భావిస్తున్నారు. పార్టీ ప్రచార సామగ్రిని ఇప్పటికే కొనుగోలు చేసిన అభ్యర్థులు కరపత్రాలు, నమూనా బ్యాలెట్లు వంటి సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ప్రచార రథాలు, వాహనాలు, మైక్సెట్ల వినియోగం కోసం అనుమతి కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, వ్యయంపై ఎన్నికల సంఘం నిఘా వేయడంతో అభ్యర్థులు పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ ఎజెండాలు, అభ్యర్థుల గుణగణాలు, తెలంగాణ సెంటిమెంటు తదితరాలను ప్రచార అస్త్రాలుగా సంధించేందుకు అభ్యర్థులు సన్నద్దమవుతున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా సీడీలు తయారు చేయించి ప్రచార రథాల ద్వారా హోరెత్తించనున్నారు. పార్టీ ముఖ్య నేతలు, క్రియాశీల కార్యకర్తలు, ముఖ్యులను అంతర్గతంగా కలుస్తూ ఎన్నికల్లో మద్దతు కోరేలా ప్రచారానికి సిద్దమవుతున్నారు. భారీ బహిరంగ సభలకు సన్నాహాలు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్య నేతలను రప్పించడం ద్వారా ప్రచారాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 16 తర్వాత మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ నెల 15న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాలమూరు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ సాధించిన కేసీఆర్ ఈ సభను కృతజ్ఞతా సభగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వె ల్లడించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల జిల్లాలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షోలు నిర్వహించనున్నారు. 25వ తేదీ తర్వాత పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారని ఎంపీ అభ్యర్థి రహమాన్ వెల్లడించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మార్చి 25న మహబూబ్‌నగర్‌లో ప్రజా గర్జన నిర్వహించారు. మూడో వారంలో జిల్లాలో రోడ్‌షో నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులను రప్పించేలా బీజేపీ అభ్యర్థులు ప్రచార వ్యూహం సిద్దం చేస్తున్నారు. ప్రచారానికి తక్కువ వ్యవధి ఉండటంతో ఇంటింటి ప్రచారానికి బదులుగా రోడ్‌షోలు, బహిరంగ సభలు మేలని ఎంపీ అభ్యర్థులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం ప్రతీ గ్రామాన్ని చుట్టివచ్చేలా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. ముందస్తుగా ప్రచారం ప్రారంభిస్తే చేతి చమురు వదులుతుందనే భయం కూడా అభ్యర్థులను వెన్నాడుతోంది. దీంతో వీలైనంత ఆలస్యంగా బరిలోకి దిగి సుడిగాలి ప్రచారం చేసేలా వ్యూహం ఖరారు చేస్తున్నారు. -
నేడే ఆఖరు
సాక్షి,సిటీబ్యూరో: నవమి నాడు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు మంగళవారం మొత్తం 11నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ లోక్‌సభ కు పౌరహక్కుల సంఘం నేత జయవింధ్యాల సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనాకు అందజేశారు. అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బింగి రాజశేఖర్, స్వతంత్ర అభ్యర్థులుగా సయ్యద్మహ బూబ్, మహ్మద్ఉస్మాన్ తమ నామినేషన్లు సమర్పించారు. ఇప్పటికీ మొత్తం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, వీరంతా ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించగా, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ మాత్రం రెండుసెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సికింద్రాబాద్‌కు నామినేషన్ల జోరు: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మంగళవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకుమొత్తం 10 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ అభ్యర్థిగా కుమార్‌చౌదరియాదవ్, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థిగా కరనుకోటి కృష్ణ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా శక్తి సత్యవతి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బి.దీపక్‌కుమార్, అఖిలభారత ముస్లింలీగ్ సెక్యులర్ పార్టీ అభ్యర్థిగా అబుదస్ సత్తార్ ముజాహిద్, స్వతంత్ర అభ్యర్థులుగా మొహ్మద్ అబుబాకర్ పర్వేజ్ సిద్ధిఖీ, మైఖేల్ డేనియల్ ఓవిజ్..తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీపక్‌కుమార్ నాలుగుసెట్లు, కె.నరేందర్, కుమార్‌చౌదరి రెండేసి సెట్లు నామినేషన్ పత్రాలను సమర్పించగా, మిగిలిన వారంతా ఒక్కో సెట్‌ను అందజేశారు. అదనపు బందోబస్తుకు ఆదేశం : నామినేషన్ల దాఖలుకు బుధవారం చివరి రోజు కావడంతో, ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యలో జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని, కలెక్టరేట్ ప్రాంగ ణంలో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ఆదేశించారు. -
నామినేషన్ల స్వీకరణకు రెడీ అవ్వండి
ఏలూరు, న్యూస్‌లైన్ : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఈనెల 12వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు రిటర్నింగ్, నోడల్ అధికారులు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియపై నియోజకవర్గాల రిటర్నింగ్, నోడల్ అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యూరు. నామినేష న్ల స్వీకరణకు అవసరమైన ముందస్తు చర్యలను 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని కోరారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయ పరిధిలో 100 మీటర్ల వరకు ప్రత్యేక బారికేడింగ్ చేరుుంచాలన్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచాలన్నారు. పనిదినాల్లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. కొత్త ఓటర్ల దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశం ఓటు హక్కు నమోదు కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులన్నిటినీ ఈనెల 9వ తేదీలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఎపిక్ ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను ఉచి తంగా అందించేందుకు అన్నిచర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం జిల్లాకు 2 లక్షల కార్డులు వచ్చాయని, వీటిని త్వరితగతిన సంబంధిత ఓటర్లకు అందించేందుకు ఏర్పాట్లు చేయూలని ఆదేశించారు. నూతన ఓటర్లలో ఎవరికైనా ఫొటో ఓటరు గుర్తింపు కార్డు అందకపోతే కలెక్టరేట్లోని టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-1365కు ఫోన్ చేయూలని సూచించారు. పోలింగ్ శాతం బాగుంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికలను సజావుగా నిర్వహించామని, ఇందుకు అధికారులు, సిబ్బంది బాగా సహకరించారని కలెక్టర్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 74 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ విడత ఎన్నికల్లో 84.58 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషమని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని కోరారు. తొలుత జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన విధివిధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రిటర్నింగ్ అధికారులకు వివరించారు. అదనపు జాయింట్ కలెక్టర్ నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.