సాక్షి,సిటీబ్యూరో: నవమి నాడు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు మంగళవారం మొత్తం 11నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ లోక్‌సభ కు పౌరహక్కుల సంఘం నేత జయవింధ్యాల సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనాకు అందజేశారు.
అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బింగి రాజశేఖర్, స్వతంత్ర అభ్యర్థులుగా సయ్యద్‌మహ బూబ్, మహ్మద్‌ఉస్మాన్ తమ నామినేషన్లు సమర్పించారు. ఇప్పటికీ మొత్తం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, వీరంతా ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించగా, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ మాత్రం రెండుసెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
సికింద్రాబాద్‌కు నామినేషన్ల జోరు: సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మంగళవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకుమొత్తం 10 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ అభ్యర్థిగా కుమార్‌చౌదరియాదవ్, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థిగా కరనుకోటి కృష్ణ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా శక్తి సత్యవతి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బి.దీపక్‌కుమార్, అఖిలభారత ముస్లింలీగ్ సెక్యులర్ పార్టీ అభ్యర్థిగా అబుదస్ సత్తార్ ముజాహిద్, స్వతంత్ర అభ్యర్థులుగా మొహ్మద్ అబుబాకర్ పర్వేజ్ సిద్ధిఖీ, మైఖేల్ డేనియల్ ఓవిజ్..తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీపక్‌కుమార్ నాలుగుసెట్లు, కె.నరేందర్, కుమార్‌చౌదరి రెండేసి సెట్లు నామినేషన్ పత్రాలను సమర్పించగా, మిగిలిన వారంతా ఒక్కో సెట్‌ను అందజేశారు.
అదనపు బందోబస్తుకు ఆదేశం : నామినేషన్ల దాఖలుకు బుధవారం చివరి రోజు కావడంతో, ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యలో జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని, కలెక్టరేట్ ప్రాంగ ణంలో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ఆదేశించారు.
నేడే ఆఖరు
Published Wed, Apr 9 2014 12:51 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement