నామినేషన్ల స్వీకరణకు రెడీ అవ్వండి
ఏలూరు, న్యూస్‌లైన్ : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఈనెల 12వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు రిటర్నింగ్, నోడల్ అధికారులు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియపై నియోజకవర్గాల రిటర్నింగ్, నోడల్ అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యూరు. నామినేష న్ల స్వీకరణకు అవసరమైన ముందస్తు చర్యలను 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని కోరారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయ పరిధిలో 100 మీటర్ల వరకు ప్రత్యేక బారికేడింగ్ చేరుుంచాలన్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచాలన్నారు. పనిదినాల్లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించారు.
కొత్త ఓటర్ల దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశం
ఓటు హక్కు నమోదు కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులన్నిటినీ ఈనెల 9వ తేదీలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఎపిక్ ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను ఉచి తంగా అందించేందుకు అన్నిచర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇందుకోసం జిల్లాకు 2 లక్షల కార్డులు వచ్చాయని, వీటిని త్వరితగతిన సంబంధిత ఓటర్లకు అందించేందుకు ఏర్పాట్లు చేయూలని ఆదేశించారు. నూతన ఓటర్లలో ఎవరికైనా ఫొటో ఓటరు గుర్తింపు కార్డు అందకపోతే కలెక్టరేట్‌లోని టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-1365కు ఫోన్ చేయూలని సూచించారు.
పోలింగ్ శాతం బాగుంది
జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికలను సజావుగా నిర్వహించామని, ఇందుకు అధికారులు, సిబ్బంది బాగా సహకరించారని కలెక్టర్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 74 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ విడత ఎన్నికల్లో 84.58 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషమని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని కోరారు.
తొలుత జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన విధివిధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రిటర్నింగ్ అధికారులకు వివరించారు. అదనపు జాయింట్ కలెక్టర్ నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.