'తప్పుగా అనుకోవద్దు ప్లీజ్'.. వారందరికీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రిక్వెస్ట్! | Bigg Boss Contestant Adi Reddy Request To All His Fans | Sakshi
Sakshi News home page

Bigg Boss Adi Reddy: 'దయచేసి అర్థం చేసుకోండి'.. బిగ్‌బాస్‌ ఆదిరెడ్డి రిక్వెస్ట్!

Published Tue, Jan 30 2024 7:11 PM | Last Updated on Tue, Jan 30 2024 9:41 PM

Bigg Boss Contestant Adi Reddy Request To All His Fans - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్‌ మ్యాన్‌ కోటాలో బిగ్‌ బాస్‌-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్‌-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్‌బాస్‌ సీజన్‌-7పై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్‌ షోపై రివ్యూలతో మరింత ఫేమస్ అయ్యారు.

అయితే తాజాగా ఆదిరెడ్డికి ఓ సమస్య వచ్చిపడింది. సాయం కావాలంటూ ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అభిమానులుకు ఆదిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కూడా ఇలా రావొద్దంటూ రిక్వెస్ట్‌ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: అయోధ్య రామ మందిరానికి బిగ్‌ బాస్‌ 'ఆదిరెడ్డి' విరాళం)

ఆది రెడ్డి వీడియోలో మాట్లాడుతూ మాట్లాడుతూ.. 'దయచేసి అర్థం చేసుకోండి .. నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. నాకు వీలైనంత సాయం చేస్తుంటే ఉంటా. కానీ డైరెక్ట్‌గా ఇంటికి చాలా మంది వస్తున్నారు. వాళ్ల అందరికి నేనేం చేయగలను చెప్పండి . ఎవరు వచ్చినా ఆహారం అంటే ఒకరోజు పెట్టించగలను.  కానీ వాళ్ల బాధలన్నీ చెప్పినా నేను ఏం చేయలేని పరిస్థితి. దయచేసి ఎవరు కూడా ఇంటికి కానీ.. సెలూన్‌కు కానీ రావొద్దు. సమాజానికి నా వంతు కృషి చేస్తాను. అంతే కానీ అందరికి చేయలేను కదా. ఎలాగోలా వచ్చిన వాళ్లకి ఛార్జీలకి ఇచ్చి పంపుతున్నా . దయచేసి అర్థం చేస్కోండి. తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. నాతో మాట్లాడాలంటే కామెంట్స్‌, మెసేజేస్‌ ద్వారా పంపండి.' అంటూ విజ్ఞప్తి చేశారు ఆదిరెడ్డి. కాగా.. ఆదిరెడ్డి ఇటీవలే 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement