- కాపుల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలి
- కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
- కాపు జేఏసీ నేతల వినతిపత్రం
కులాల మధ్య చిచ్చు
Published Fri, Dec 30 2016 10:41 PM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM
గోపాలపురం (రావులపాలెం) :
కాపులను బీసీల్లో కలుపుతామని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. శుక్రవారం ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు చేపట్టిన కాపు రిజర్వేష¯ŒS సాధన ఉద్యమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలోని కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని కాపు ఉద్యమానికి మద్ధతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికార పీఠం కోసం ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్లు తదితర 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు నేడు వాటిని గాలికి వదిలేశారన్నారు. బీసీలకు నష్టం లేకుండా తమకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాపులు చేస్తున్న డిమాండ్ న్యాయమైనదే అన్నారు. వారి ఉద్యమానికి పూర్తి సహకారాన్ని అందజేస్తానన్నారు. వారి ఆకాంక్షలను తమ పార్టీ అధినేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాపు కార్పొరేష¯ŒS రుణాలను కేవలం పచ్చ చొక్కాలకే ఇస్తున్న వైనంపై నియోజకవర్గంలో మొదటిసారి ప్రశ్నించింది తానే అన్నారు. అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. ఉద్యమనేతల పట్ల ప్రభుత్వం గౌరవం కలిగిఉండాలని, ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్ నాయకుడి పట్ల ప్రభుత్వం, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నానన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందన్నారు. ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు, ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే తమ డిమాండ్ అన్నారు. తొలుత ఆకుల రామకృష్ణ ఇంటి వద్ద నుండి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఇంటి వరకూ కాపు నేతలు పాదయాత్రగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు ఆర్‌వీ సుబ్బారావు, సాధనాల శ్రీనివాస్, చల్లా ప్రభాకరరావు, ముత్యాల వీరభద్రరావు. చీకట్ల ప్రసాద్, బండారు శ్రీనివాస్, ఆకుల భీమేశ్వరరావు, ఎంపీటీసీ జవ్వాది రవిబాబు, పాలూరి సత్యానందం తదితరులు పాల్గొన్నారు.
Advertisement