ED Rejected MLA Rohit Reddy Request - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్‌!

Published Mon, Dec 19 2022 1:14 PM | Last Updated on Mon, Dec 19 2022 3:23 PM

ED Rejected MLA Rohit Reddy Request - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్‌ ఇచ్చింది. రోహిత్‌రెడ్డి అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఆయన లేఖను ఈడీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రోహిత్‌రెడ్డి హాజరుకానున్నారు.

కాగా, విచారణకు హాజరు కాలేనని లాయర్‌తో ఈడీకి రోహిత్‌రెడ్డి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని, వరుస సెలవులు కారణంగా బ్యాంక్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్స్‌, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్‌ రెడ్డి  లేఖలో పేర్కొన్నారు. అయితే రోహిత్‌రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు.

కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్‌ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement