
ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ( ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంకు సంబంధించి సీబీఐ కీలక సమాచారాన్ని సేకరించింది. దాదాపు రూ.14000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లోనే ఉన్నట్టు సీబీఐ సోమవారం వెల్లడించింది. ఈ మేరకు బ్రిటన్ అధికారులు సమాచారం ఇచ్చినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. వేలకోట్ల రుణాలను ఎగొట్టి లండన్‌కు చెక్కేసిన బిలియనీర్ వజ్రాల వ్యాపారి నీరవ్‌ను తమకు అప్పగించాలని కోరినట్టు తెలిపింది. నీరవ్ మోదీ అప్పగించాల్సిందిగా సీబీఐ హోమ్ మంత్రిత్వ శాఖ ద్వారా దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తును విదేశాంగ శాఖ బ్రిటన్‌కు పంపిస్తుంది. అలాగే నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోవాల్సిందిగా సీబీఐ యుకె అధికార యంత్రాంగాన్ని కోరింది.
దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్కామ్ పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ, భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్ మోదీ మామ మెహుల్ చోక్సీ విదేశాలకు చెక్కేశారు. ఈ కేసు విచారణలో భాగంగా మోదీ, చోక్సీల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసింది. అలాగే ఇంటర్ పోల్ కూడా మాల్యాకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అటు ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.9,వేల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కూడా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment