
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. దీంతో బన్నీ తదుపరి చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బన్నీ కొత్త సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడనే దానిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. కాగా, ఈ వార్తలపై బన్నీ ట్విటర్‌లో స్పందించారు.
‘మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. మీ అందరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను.. నా తదుపరి చిత్రం గురించి ప్రకటించే వరకు దయచేసి ఓపికగా ఉండండి. ఎందుకంటే ఇది ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. నేను మంచి సినిమా చేయాలని చూస్తున్నాను. దీనికి టైం పడుతోంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ బన్నీ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment