
అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి
అల్లు అర్జున్ కెరీర్‌లో పెద్ద హిట్స్‌లో ‘రేసు గుర్రం’ ఒకటి. బాక్సాఫీస్ దగ్గర బన్నీని రేసుగుర్రంలా పరిగెత్తించారు దర్శకుడు సురేందర్ రెడ్డి. యాక్షన్ – ఎంటర్‌టైన్‌మెంట్ సమంగా పంచింది ఈ సినిమా. తాజాగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ సినిమా కమిట్ అయ్యారు బన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ తయారు చేస్తున్నారట సురేందర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment