director Surender Reddy
-
కాంబినేషన్ షురూ
హీరో అఖిల్–దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ షురూ అయింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, సరెండర్ 2 పతాకంపై సురేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తన చిత్రాల్లో హీరోలను ఫుల్ స్టైలిష్‌గా ప్రెజెంట్ చేస్తారు దర్శకుడు సురేందర్ రెడ్డి. అఖిల్ పాత్రను అలానే డిజైన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. వంశీ–సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ‘అశోక్’, ‘కిక్’, ‘రేసుగుర్రం’ తదితర హిట్ చిత్రాలు వచ్చాయి. తాజా చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్ సుంకర, పతి దీపారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికపాటి. -
రేసు మళ్లీ మొదలు
అల్లు అర్జున్ కెరీర్లో పెద్ద హిట్స్‌లో ‘రేసు గుర్రం’ ఒకటి. బాక్సాఫీస్ దగ్గర బన్నీని రేసుగుర్రంలా పరిగెత్తించారు దర్శకుడు సురేందర్ రెడ్డి. యాక్షన్ – ఎంటర్టైన్మెంట్ సమంగా పంచింది ఈ సినిమా. తాజాగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ సినిమా కమిట్ అయ్యారు బన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ తయారు చేస్తున్నారట సురేందర్ రెడ్డి. -
మిస్ మ్యాచ్ పెద్ద విజయం సాధించాలి
ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా ఎన్వి నిర్మల్ కుమార్ దర్శకత్వంలో శ్రీరామ్ రాజు, భరత్‌రామ్ నిర్మించిన చిత్రం ‘మిస్ మ్యాచ్’. డిసెంబరు 6న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ–‘‘మిస్ మ్యాచ్’ టైటిల్ అద్భుతంగా ఉంది. భూపతిరాజాగారు కథ అందిస్తే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తమిళంలో ‘డాక్టర్ సలీమ్’ వంటి హిట్ సినిమా తీసిన నిర్మల్ కుమార్‌కు ఇది తెలుగులో తొలి సినిమా. ఉదయ్ బాగా నటించాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలిని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సురేందర్‌రెడ్డిగారికి థ్యాంక్స్. భూపతిరాజాగారు ఇచ్చిన కథను నిర్మల్ కుమార్‌గారు చక్కగా తెరకెక్కించారు.‘తొలి ప్రేమ’ (1998) చిత్రంలోని ‘ఈ మనసే’ సాంగ్‌ను సింగిల్ షాట్లో పూర్తి చేశాం. ఐశ్యర్యా మంచి కోస్టార్’’ అని అన్నారు. ‘‘తెలుగులో ఇది నా తొలి సినిమా. ఉదయ్, ఐశ్వర్యల కెమిస్ట్రి బాగా కుదిరింది’’ అన్నారు నిర్మల్ కుమార్. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. నిర్మల్ కుమార్ మా బ్యానర్లో తొలి సినిమా చేయడం çహ్యాపీ. తన క్రమశిక్షణతో యూనిట్ గౌరవాన్ని సంపాదించుకున్నారు ఉదయ్’’ అన్నారు శ్రీరామ్‌రాజు. ‘‘రెండు కుటుంబాల కథ ఇది’’ అన్నారు రచయిత భూపతి రాజా. డైలాగ్ రైటర్స్ రాజేంద్రకుమార్, మధుసూదన్, సంగీత దర్శకుడు గిఫ్టన్ మాట్లాడారు. -
సీక్వెల్ యోచనలో అల్లు అర్జున్?
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో మరో సీక్వెల్ రాబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో రేసు గుర్రం చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుందన్నది ఆ కథనం సారాంశం. 2014లో వచ్చిన రేసు గుర్రానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ కు అవకాశం ఉందని సురేందర్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రకటించబోయే సీక్వెల్‌కు సురేందర్ రెడ్డినే దర్శకత్వం వహిస్తాడా? లేక వేరే ఎవరైనా చేస్తారా? అన్నది చూడాలి. తారాగణం, టెక్నీషియన్లు తదితర వివరాలపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. -
మెగా ఫ్యాన్స్.. గెట్ రెడీ!
సాక్షి, సినిమా : మెగా అభిమానులే కాదు.. మెగాస్టార్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చేశాయి. తన కలల ప్రాజెక్టుగా చిరంజీవి చెప్పుకునే ఉయ్యలవాడ నరసింహారెడ్డి బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ రేపు అంటే బుధవారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది. సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం హైదరాబాద్ కొండాపూర్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. చిరుతోపాటు పలువురు విదేశీ జూనియర్ ఆర్టిస్ట్‌ల మీద ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈమేరకు అంతా సిద్ధం చేసుకున్నాడు. ఏఆర్ రెహమాన్, రవి వర్మన్ నిష్క్రమణ తర్వాత రత్నవేలును కెమెరామ్యాన్‌గా ఎంపిక చేసేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌ను సెలక్ట్ చేయకుండానే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తుండటం విశేషం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నయనతార హీరోయిన్గా నటించబోతోంది. -
సన్నాఫ్ సైరా డైరెక్టర్ అండ్ సన్నాఫ్ సైరా!
‘సైరా’ ఎవరు? అదేనండీ... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో సినిమా (‘సైరా నరసింహారెడ్డి’) చేయబోతున్నది ఎవరు? చిరంజీవి. ఇప్పుడు చిరు తనయుడు రామ్‌చరణ్‌ని ఏమనొచ్చు? సన్నాఫ్ సైరా. లెక్క కుదిరింది కదా! ‘సైరా’ దర్శకుడు ఎవరు? సురేందర్‌రెడ్డి. గుర్రం మీద రామ్‌చరణ్‌తో సరదాగా షికారు చేసిన చిన్నోడు.. సురేందర్‌రెడ్డి తనయుడే. ఈ సన్నాఫ్ సైరా డైరెక్టర్ అండ్ సన్నాఫ్ సైరా కలిసి మొన్న హార్స్ రైడ్ చేసినప్పుడు తీసిన ఫొటో ఇది!! రామ్‌చరణ్‌కి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టమట. సురేందర్‌రెడ్డి కుమారుడు ముచ్చట పడినట్టున్నాడు... ‘చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం’ అంటూ రైడ్‌కి తీసుకువెళ్లారు. -
ఎన్టీఎస్ఈ దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్టీఎస్ఈ) ఒకటో లెవల్ పరీక్ష దరఖాస్తుల గడువు ఈ నెల 25 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలను జిల్లాల్లోని డీఈవో కార్యాలయాల్లో లేదా తమ వెబ్సైట్లో (http://bse.telangana.gov.in/) పొందవచ్చని పేర్కొన్నారు. -
టెన్త్ ఫిజిక్స్ పేపర్–1లో నాలుగు మార్కులు కలుపుతాం
♦ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ప్రకటన ♦ 17 (బి) ప్రశ్న అటెంప్ట్ చేసిన విద్యార్థులకు వర్తింపు ♦ ఆ ప్రశ్న అస్పష్టంగా ఉందన్న నిపుణుల కమిటీ సాక్షి, హైదరాబాద్: పదో తరగతి ఫిజికల్ సైన్స్ పేపర్–1లో 17 (బి) ప్రశ్న రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులందరికీ 4 మార్కు లు కలపనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ప్రకటించారు. పేపరు–1లో ఇచ్చిన ప్రశ్నలు, వాటి స్థాయిపై కమిటీ సోమవారం పరిశీలన జరిపింది. 17 (బి) ప్రశ్నకు సంబంధించిన పటంలో ఫలిత నిరోధం కనుగొనేలా స్పష్టంగా లేదని తేల్చింది. కాబట్టి దానికి సమాధానం రాయడానికి ప్రయత్నించిన విద్యార్థులకు కమిటీ సిఫార్సు మేరకు 4 మార్కులను యాడ్ స్కోర్‌గా ఇవ్వనున్నట్లు సురేందర్‌రెడ్డి వివరించారు. ఫిజికల్ సైన్స్ పేపర్–1లోని ప్రశ్నలు సిలబస్ పరిధిలోనివేనన్నారు. ‘‘52 శాతం సులభ స్థాయి ప్రశ్నలు, 27 శాతం మాధ్యమిక స్థాయి ప్రశ్నలు, 21 శాతం కఠిన స్థాయి ప్రశ్నలుండాలన్న నిబంధనల మేరకు, బ్లూ ప్రింట్కు అనుగుణంగానే ప్రశ్నపత్రాన్ని రూపొందించారు. ఒక్క మార్కు ప్రశ్నలు 7, 2 మార్కుల ప్రశ్నలు 6, 4 మార్కుల ప్రశ్నలు 4, అర మార్కుల ప్రశ్నలు 10 ఇచ్చాం. ప్రశ్నపత్రాన్ని పదో తరగతి బోధిస్తున్న, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులే రూపొందించారు. మోడరేటర్లుగా గతేడాది విధుల్లో పాల్గొన్న నిపుణులనే ఈసారీ నియమించాం. వారికి సబ్జెక్టుపై అనుభవముంది’’ అని చెప్పారు. అయితే వారు టీచర్లా, కాదా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. పది మార్కులివ్వాలి: టీపీఏ టెన్త్ ఫిజికల్ సైన్స్ పేపర్లో విద్యార్థులకు 10 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌కు తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) ప్రతినిధులు నాగటి నారాయణ, ప్రకాశ్ వినతిపత్రమిచ్చారు. ‘‘సిలబస్‌లో లేని ప్రశ్నలు 10 మార్కుల దాకా, అసంబద్ధమైన ప్రశ్నలు మరో 10 మార్కుల దాకా ఉన్నాయి. అందుకే విద్యార్థులందరికీ 10 మార్కులు కలపాలి’’ అని కోరారు. -
14 నుంచి టెన్త్ పరీక్షలు
-
14 నుంచి టెన్త్ పరీక్షలు
♦ హాజరు కానున్న 5.38 లక్షల మంది విద్యార్థులు ♦ 5 నిమిషాల వరకు ఆలస్యంగా వస్తే అనుమతి సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 14 నుంచి 30 వరకు జరిగే పరీక్షల ఏర్పాట్లపై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓరియం టల్ ఎస్సెస్సీ పరీక్షలు 14న, రెగ్యులర్ ఎస్సెస్సీ పరీక్షలు 17న ప్రారంభమవుతాయ న్నారు. ప్రతి పరీక్ష ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుందని, ద్వితీయ భాష, ఓరియంటల్ ఎస్సెస్సీ, కాంపొజిట్ కోర్సు పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు ఆల స్యం కాకుండా ముందుగానే పరీక్షా కేంద్రా నికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విద్యార్థులను 8:45 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని.. 5 నిమిషాల ఆలస్యం (9:35) వరకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తా మని, అయితే రోజూ ఆలస్యమైతే మాత్రం విచారణ జరుపుతామని హెచ్చరించారు. హాల్‌టికెట్లను ఇప్పటికే స్కూళ్లకు పంపామని, అందనివారు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసు కోవచ్చని తెలిపారు. వాటిపై ప్రిన్సిపాల్ సంతకం అక్కర్లేదన్నారు. సెల్‌ఫోన్ తెస్తే క్రిమినల్ కేసు.. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, చివరకు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు సెల్ఫోన్లు తీసుకురావద్దని, తెస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అత్యవసర మైతే సెక్యూరిటీ కానిస్టేబుల్ ఫోన్‌ను వినియోగించాలని, ఎవరికి, ఎందుకు కాల్ చేశారో రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరన్నారు. ప్రథమ భాష పార్ట్–బి పేపర్‌ను చివరి అరగంటలో ఇస్తారన్నారు. అంధ, మూగ, చెవిటి విద్యార్థులకు స్రైబ్ అవకాశం కల్పిస్తున్నామని, ఇప్పటికే అనుమ తులు ఇచ్చామని, ఇంకా ఎవరైనా ఉంటే సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్‌ను సంప్ర దించాలని సూచించారు. సందేహాలుంటే డీఈవో కార్యాలయాల్లోని వాటితో పాటు రాష్ట్రస్థాయిలోని కంట్రోల్ రూమ్ నంబరు (040–23230492)లో కూడా సంప్రదించవ చ్చన్నారు. హాల్‌టికెట్ పోగొట్టుకున్న విద్యా ర్థులు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ముం దుగా తెలియజేస్తే తగిన చర్యలు చేపడతారని చెప్పారు. పరీక్షలు పూర్తయిన 35 నుంచి 40 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. విద్యార్థులకు సూచనలు.. ⇒ స్కూల్ యూనిఫారంతో పరీక్షలకు రావద్దు. ⇒ ఇన్విజిలేటర్ ఓఎంఆర్ పత్రం ఇచ్చాక, ధ్రువీకరించుకున్నాకే సంతకం చేసి, పరీక్ష రాయడం మొదలు పెట్టాలి. ⇒ మెయిన్ ఆన్సర్ షీట్‌పై ఉన్న సీరియల్ నంబరును మాత్రమే అడిషనల్ షీట్స్, గ్రాఫ్స్, మ్యాప్ లు, బిట్ పేపర్లపై వేయాలి. ⇒ పరీక్ష సమయం పూర్తయ్యే వరకు విద్యార్థులను బయటకు పంపించరు. ⇒ 14–3–2017: ఓరియంటల్ ఎస్సెస్సీ పేపరు–1తో పరీక్షలు ప్రారంభ మవుతాయి. ⇒ 17–3–2017: రెగ్యులర్ ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమవుతాయి. (17న ప్రథమ భాష పేపర్–1). -
నాకిది ఫస్ట్ యాక్షన్ మూవీ : ఆది
‘ప్రేమ, వినోదం, యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే సినిమా ఇది. నాకిది ఫస్ట్ యాక్షన్ మూవీ. ముందు రామ్‌చరణ్, బన్నీ అనుకుని దర్శకుడు నాతో ఈ సినిమా చేశారు’’ అని ఆది చెప్పారు. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ మాధవరం నిర్మిస్తున్న ‘రఫ్’ చిత్రం టీజర్‌ను దర్శకుడు సురేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘సుబ్బారెడ్డి నాతో కలిసి చాలాకాలం పనిచేశారు. స్వతహాగా ఆయన చాలా రఫ్. ఈ సినిమాతో ఆదిని ఓ స్థాయికి తీసుకెళ్తాడనే నమ్మకముంది’’ అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ -‘‘సురేందర్‌రెడ్డి సినిమాతోనే ఆది పరిచయం కావాల్సింది. కానీ మిస్సయ్యింది. చిరంజీవికి ‘ఖైదీ’, నాకు ‘పోలీస్ స్టోరీ’ ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చిందో, ఆదికి ఈ సినిమా అంత పేరు తెస్తుందనే నమ్మకముంది’’ అని చెప్పారు. ఆది ఈ సినిమా కోసం చాలా శ్రమించాడని రకుల్ ప్రీత్‌సింగ్ అన్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, టీమ్‌వర్క్‌తో ఈ సినిమా చేశామని దర్శక నిర్మాతలు తెలిపారు. రాజ్‌కుమార్, బిఏ రాజు, అరుణ్‌కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'రేసుగుర్రం' విజయంలో నా భార్యకు భాగస్వామ్యం
చెన్నై: 'రేసుగుర్రం' విజయంలో తన భార్య దీపకు భాగస్వామం ఉందని ఆ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు. తాననెప్పుడు ఆమె ప్రోత్సహిస్తూ ఉంటుందని తెలిపారు. రేసుగుర్రం కోసం తాను రెండేళ్లు కష్టపడి పనిచేశానని వెల్లడించారు. ఆ సమయంలో చాలాసార్లు ఇంటికి ఆలస్యంగా వెళ్లినా తన భార్య ఎప్పుడూ కోప్పడలేదని చెప్పారు. తనను అర్థం చేసుకుని ప్రోత్సహించిందని వెల్లడించారు. రేసుగుర్రం విజయంలో ఆమెకు భాగస్వామం ఇవ్వాలని అన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ ఈ విజయం చెందుతుందన్నారు. ఇటీవల విడుదలయిన రేసుగుర్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలు చేసింది. అల్లు అర్జున్, శృతి హాసన్, కిక్ శ్యామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో నటించారు. -
చిరంజీవి అంటే ప్రాణం: అల్లు అర్జున్
రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): సినిమాల్లో తనకు తానే పోటీ తప్పా ఎవరూ తనకు పోటీకాదని సినీహీరో అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఎవరి రికార్డులు బ్రేక్ చేయాలన్నది తన ఆలోచన కాదన్నారు. తన రికార్డులను తానే అధిగమిస్తానన్నారు. స్థానిక గైట్ కళాశాల క్యాంపస్‌లో నిర్వహిస్తున్న మైత్రి యువజనోత్సవాల్లో 'రేసుగుర్రం' సినిమా యూనిట్‌తో కలిసి అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణం అని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్దాపించిన జనసేన పార్టీపై స్పందించేందుకు అల్లు అర్జున్ నిరాకరించాడు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సురేంద్రరెడ్డి, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ల సమక్షంలో హాస్యనటుడు అలీ 'రేసుగుర్రం' ట్రైలర్‌ను ఆవిష్కరించారు. సానియామీర్జాతో హైదరాబాద్‌కు, షారూక్ ఖాన్‌తో ఇండియాకు ఏవిధంగా గుర్తింపు వచ్చిందో అలీతో రాజమండ్రి ఒక గుర్తింపు వచ్చిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. గోదావరి బుల్లోడు ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించాలంటూ అలీ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.