'రేసుగుర్రం' విజయంలో నా భార్యకు భాగస్వామ్యం | My wife also deserves 'Race Gurram' success: Surendar Reddy | Sakshi
Sakshi News home page

'రేసుగుర్రం' విజయంలో నా భార్యకు భాగస్వామ్యం

Published Mon, Apr 21 2014 12:27 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

'రేసుగుర్రం' విజయంలో నా భార్యకు భాగస్వామ్యం

'రేసుగుర్రం' విజయంలో నా భార్యకు భాగస్వామ్యం

చెన్నై:  'రేసుగుర్రం' విజయంలో తన భార్య దీపకు భాగస్వామం ఉందని ఆ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు.  తాననెప్పుడు ఆమె ప్రోత్సహిస్తూ ఉంటుందని తెలిపారు. రేసుగుర్రం కోసం తాను రెండేళ్లు కష్టపడి పనిచేశానని వెల్లడించారు. ఆ సమయంలో చాలాసార్లు ఇంటికి ఆలస్యంగా వెళ్లినా తన భార్య ఎప్పుడూ కోప్పడలేదని చెప్పారు. తనను అర్థం చేసుకుని ప్రోత్సహించిందని వెల్లడించారు.

రేసుగుర్రం విజయంలో ఆమెకు భాగస్వామం ఇవ్వాలని అన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ ఈ విజయం చెందుతుందన్నారు. ఇటీవల విడుదలయిన రేసుగుర్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలు చేసింది. అల్లు అర్జున్, శృతి హాసన్, కిక్ శ్యామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement