Resugurram movie
-
'రేసుగుర్రం' విజయంలో నా భార్యకు భాగస్వామ్యం
చెన్నై: 'రేసుగుర్రం' విజయంలో తన భార్య దీపకు భాగస్వామం ఉందని ఆ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి అన్నారు. తాననెప్పుడు ఆమె ప్రోత్సహిస్తూ ఉంటుందని తెలిపారు. రేసుగుర్రం కోసం తాను రెండేళ్లు కష్టపడి పనిచేశానని వెల్లడించారు. ఆ సమయంలో చాలాసార్లు ఇంటికి ఆలస్యంగా వెళ్లినా తన భార్య ఎప్పుడూ కోప్పడలేదని చెప్పారు. తనను అర్థం చేసుకుని ప్రోత్సహించిందని వెల్లడించారు. రేసుగుర్రం విజయంలో ఆమెకు భాగస్వామం ఇవ్వాలని అన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ ఈ విజయం చెందుతుందన్నారు. ఇటీవల విడుదలయిన రేసుగుర్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలు చేసింది. అల్లు అర్జున్, శృతి హాసన్, కిక్ శ్యామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో నటించారు. -
చిరంజీవి అంటే ప్రాణం: అల్లు అర్జున్
రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): సినిమాల్లో తనకు తానే పోటీ తప్పా ఎవరూ తనకు పోటీకాదని సినీహీరో అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఎవరి రికార్డులు బ్రేక్ చేయాలన్నది తన ఆలోచన కాదన్నారు. తన రికార్డులను తానే అధిగమిస్తానన్నారు. స్థానిక గైట్ కళాశాల క్యాంపస్‌లో నిర్వహిస్తున్న మైత్రి యువజనోత్సవాల్లో 'రేసుగుర్రం' సినిమా యూనిట్‌తో కలిసి అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణం అని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్దాపించిన జనసేన పార్టీపై స్పందించేందుకు అల్లు అర్జున్ నిరాకరించాడు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సురేంద్రరెడ్డి, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ల సమక్షంలో హాస్యనటుడు అలీ 'రేసుగుర్రం' ట్రైలర్‌ను ఆవిష్కరించారు. సానియామీర్జాతో హైదరాబాద్‌కు, షారూక్ ఖాన్‌తో ఇండియాకు ఏవిధంగా గుర్తింపు వచ్చిందో అలీతో రాజమండ్రి ఒక గుర్తింపు వచ్చిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. గోదావరి బుల్లోడు ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించాలంటూ అలీ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.