చిరంజీవి అంటే ప్రాణం: అల్లు అర్జున్ | Iam die hard fan of chiranjeevi, says allu arjun | Sakshi
Sakshi News home page

చిరంజీవి అంటే ప్రాణం: అల్లు అర్జున్

Published Sun, Mar 23 2014 2:20 PM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

చిరంజీవి అంటే ప్రాణం: అల్లు అర్జున్

చిరంజీవి అంటే ప్రాణం: అల్లు అర్జున్

రాజమండ్రి(తూర్పుగోదావరి జిల్లా): సినిమాల్లో తనకు తానే పోటీ తప్పా ఎవరూ తనకు పోటీకాదని సినీహీరో అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఎవరి రికార్డులు బ్రేక్ చేయాలన్నది తన ఆలోచన కాదన్నారు. తన రికార్డులను తానే అధిగమిస్తానన్నారు. స్థానిక గైట్ కళాశాల క్యాంపస్‌లో నిర్వహిస్తున్న మైత్రి యువజనోత్సవాల్లో 'రేసుగుర్రం' సినిమా యూనిట్తో కలిసి అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణం అని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్దాపించిన జనసేన పార్టీపై స్పందించేందుకు అల్లు అర్జున్‌ నిరాకరించాడు.

హీరో అల్లు అర్జున్, దర్శకుడు సురేంద్రరెడ్డి, సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్‌ల సమక్షంలో హాస్యనటుడు అలీ  'రేసుగుర్రం' ట్రైలర్‌ను ఆవిష్కరించారు. సానియామీర్జాతో హైదరాబాద్‌కు, షారూక్ ఖాన్‌తో ఇండియాకు ఏవిధంగా గుర్తింపు వచ్చిందో అలీతో రాజమండ్రి ఒక గుర్తింపు వచ్చిందని అల్లు అర్జున్ పేర్కొన్నారు. గోదావరి బుల్లోడు ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించాలంటూ అలీ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement