
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌లో మరో సీక్వెల్ రాబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో రేసు గుర్రం చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుందన్నది ఆ కథనం సారాంశం. 2014లో వచ్చిన రేసు గుర్రానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ కు అవకాశం ఉందని సురేందర్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రకటించబోయే సీక్వెల్‌కు సురేందర్ రెడ్డినే దర్శకత్వం వహిస్తాడా? లేక వేరే ఎవరైనా చేస్తారా? అన్నది చూడాలి. తారాగణం, టెక్నీషియన్లు తదితర వివరాలపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.
Comments
Please login to add a commentAdd a comment