కాంబినేషన్‌ షురూ | Akhil Akkineni to team up with director Surender Reddy | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ షురూ

Published Thu, Sep 10 2020 2:20 AM | Last Updated on Thu, Sep 10 2020 3:31 AM

Akhil Akkineni to team up with director Surender Reddy - Sakshi

అఖిల్‌, సురేందర్‌ రెడ్డి

హీరో అఖిల్‌–దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌ షురూ అయింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, సరెండర్‌ 2 పతాకంపై సురేందర్‌ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తన చిత్రాల్లో హీరోలను ఫుల్‌ స్టైలిష్‌గా ప్రెజెంట్‌ చేస్తారు దర్శకుడు సురేందర్‌ రెడ్డి. అఖిల్‌ పాత్రను అలానే డిజైన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. వంశీ–సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో ‘అశోక్‌’, ‘కిక్‌’, ‘రేసుగుర్రం’ తదితర హిట్‌ చిత్రాలు వచ్చాయి. తాజా చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్‌ సుంకర, పతి దీపారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికపాటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement