సాక్షి, హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) ఒకటో లెవల్ పరీక్ష దరఖాస్తుల గడువు ఈ నెల 25 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలను జిల్లాల్లోని డీఈవో కార్యాలయాల్లో లేదా తమ వెబ్‌సైట్లో (http://bse.telangana.gov.in/) పొందవచ్చని పేర్కొన్నారు.