మెగా ఫ్యాన్స్‌.. గెట్‌ రెడీ! | Sye Raa Narasimha Reddy Regular Shoot Update | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 5 2017 8:06 PM | Last Updated on Tue, Dec 5 2017 8:06 PM

Sye Raa Narasimha Reddy Regular Shoot Update - Sakshi

సాక్షి, సినిమా : మెగా అభిమానులే కాదు.. మెగాస్టార్‌ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చేశాయి. తన కలల ప్రాజెక్టుగా చిరంజీవి చెప్పుకునే ఉయ్యలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ రెగ్యులర్‌ షూటింగ్‌ రేపు అంటే బుధవారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది. 

సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం హైదరాబాద్‌ కొండాపూర్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. చిరుతోపాటు పలువురు విదేశీ జూనియర్‌ ఆర్టిస్ట్‌ల మీద ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈమేరకు అంతా సిద్ధం చేసుకున్నాడు.

ఏఆర్‌ రెహమాన్‌, రవి వర్మన్‌ నిష్క్రమణ తర్వాత రత్నవేలును కెమెరామ్యాన్‌గా ఎంపిక చేసేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ను సెలక్ట్‌ చేయకుండానే రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్తుండటం విశేషం. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నయనతార హీరోయిన్‌గా నటించబోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement