సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది నయనతార. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ.. సూపర్‌హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటోంది. నయన్ డేట్స్ దొరికాలంటే ఎవరైనా ఎదురుచూడాల్సిందే. అలాంటి నయన్.. సినిమా ఫంక్షన్లకు, ప్రమోషన్లకు అసలు హాజరు కాదు. కానీ మొదటి సారి తన నియమాలను పక్కన పెట్టేసినట్టు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సైరా’లో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యేలా చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఒప్పించినట్టు తెలుస్తోంది. చరణ్ విజ్ఞప్తి మేరకు నయన్ కూడా ఓకే చెప్పేసినట్టు సమాచారం. మరి సినిమా ప్రమోషన్లలో నయన్ పాల్గొంటే మరింత బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment