regular shoot
-
మెగా ఫ్యాన్స్.. గెట్ రెడీ!
సాక్షి, సినిమా : మెగా అభిమానులే కాదు.. మెగాస్టార్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చేశాయి. తన కలల ప్రాజెక్టుగా చిరంజీవి చెప్పుకునే ఉయ్యలవాడ నరసింహారెడ్డి బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ రేపు అంటే బుధవారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది. సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం హైదరాబాద్ కొండాపూర్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. చిరుతోపాటు పలువురు విదేశీ జూనియర్ ఆర్టిస్ట్‌ల మీద ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈమేరకు అంతా సిద్ధం చేసుకున్నాడు. ఏఆర్ రెహమాన్, రవి వర్మన్ నిష్క్రమణ తర్వాత రత్నవేలును కెమెరామ్యాన్‌గా ఎంపిక చేసేశారు. మ్యూజిక్ డైరెక్టర్‌ను సెలక్ట్ చేయకుండానే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తుండటం విశేషం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నయనతార హీరోయిన్గా నటించబోతోంది. -
దమయంతి కోసం..
‘నల దమయంతి’... అనగానే పురాణగాథ గుర్తొస్తుంది. కానీ ఆ పేరుతో ఓ యువతరం కథ తెరకెక్కుతోంది. కొవెరా దర్శకత్వంలో రవి పనస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఈ సినిమాకు సమర్పకునిగా వ్యవహరిస్తుండటం విశేషం. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ కథానాయిక హీరోయిన్గా నటించనుంది. నిఖితా నారాయణ మరో హీరోయిన్. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఎవరూ ఊహించని, అంతు చిక్కని కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 2న మొదలైన తొలి షెడ్యూల్ ఈ నెల 12 వరకూ జరుగుతుంది. ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకూ రెండో షెడ్యూల్ ఉంటుంది. కేరళతో 15 రోజుల పాటు జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందులో నటించనున్న ప్రముఖ హీరోయిన్ తో పాటు ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: మహి ఇల్లీంద్ర, కెమెరా: పి.జి.విందా, సంగీతం: సత్య మహావీర్.