దమయంతి కోసం..
‘నల దమయంతి’... అనగానే పురాణగాథ గుర్తొస్తుంది. కానీ ఆ పేరుతో ఓ యువతరం కథ తెరకెక్కుతోంది. కొవెరా దర్శకత్వంలో రవి పనస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఈ సినిమాకు సమర్పకునిగా వ్యవహరిస్తుండటం విశేషం. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ కథానాయిక హీరోయిన్‌గా నటించనుంది. నిఖితా నారాయణ మరో హీరోయిన్. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఎవరూ ఊహించని, అంతు చిక్కని కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 2న మొదలైన తొలి షెడ్యూల్ ఈ నెల 12 వరకూ జరుగుతుంది. ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకూ రెండో షెడ్యూల్ ఉంటుంది. కేరళతో 15 రోజుల పాటు జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందులో నటించనున్న ప్రముఖ హీరోయిన్ తో పాటు ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: మహి ఇల్లీంద్ర, కెమెరా: పి.జి.విందా, సంగీతం: సత్య మహావీర్.