
‘సైరా’ ఎవరు? అదేనండీ... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో సినిమా (‘సైరా నరసింహారెడ్డి’) చేయబోతున్నది ఎవరు? చిరంజీవి. ఇప్పుడు చిరు తనయుడు రామ్‌చరణ్‌ని ఏమనొచ్చు? సన్నాఫ్ సైరా. లెక్క కుదిరింది కదా! ‘సైరా’ దర్శకుడు ఎవరు? సురేందర్‌రెడ్డి.
గుర్రం మీద రామ్‌చరణ్‌తో సరదాగా షికారు చేసిన చిన్నోడు.. సురేందర్‌రెడ్డి తనయుడే. ఈ సన్నాఫ్ సైరా డైరెక్టర్ అండ్ సన్నాఫ్ సైరా కలిసి మొన్న హార్స్ రైడ్ చేసినప్పుడు తీసిన ఫొటో ఇది!! రామ్‌చరణ్‌కి చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టమట. సురేందర్‌రెడ్డి కుమారుడు ముచ్చట పడినట్టున్నాడు... ‘చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం’ అంటూ రైడ్‌కి తీసుకువెళ్లారు.