‘సీపీఎస్’ను రద్దు చేయాలని వినతి
‘సీపీఎస్’ను రద్దు చేయాలని వినతి
Published Thu, Aug 25 2016 9:46 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
మచిలీపట్నం (చిలకలపూడి) :
రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీర్జా జైగం అబ్బాస్ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు వినతిపత్రాలు అందజేశారు. 2004, సెప్టెంబర్ ఒకటో తేదీన తర్వాత ఉద్యోగం పొందిన వారికి నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. దీనివల్ల రివైజ్డ్ పెన్షన్ రూల్స్–1980 ద్వారా పొందుతున్న పెన్షన్, కుటుంబ పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పీఎఫ్ సౌకర్యాలు రద్దయ్యాయని వివరించారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు బీవీ మల్లికార్జునరావు, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్ పాల్గొన్నారు.
Advertisement