ఫ్యాన్స్కు సూపర్స్టార్ రజనీకాంత్ విన్నపం! | Rajinikanth requests fans not to celebrate his birthday | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్కు సూపర్స్టార్ రజనీకాంత్ విన్నపం!

Published Sat, Dec 10 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

ఫ్యాన్స్కు సూపర్స్టార్ రజనీకాంత్ విన్నపం!

ఫ్యాన్స్కు సూపర్స్టార్ రజనీకాంత్ విన్నపం!

ప్రతేడాది డిసెంబర్ 12 అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు పెద్ద పండుగ రోజు. ఎందుకంటే ఆ రోజు ఆయన పుట్టినరోజు. రజనీ బర్త్డే వేడుకలను పెద్ద ఎత్తున్న సెలబ్రేట్ చేయాలని అభిమానులు తెగ ప్లాన్స్ చేస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరగడం లేదట. 66 వయసులోకి అడుగుపెడుతున్న రజనీకాంత్ తన అభిమానులకు ఓ విన్నపం చేశారు. ఈ ఏడాది తన బర్త్డే వేడుకలు నిర్వహించవద్దని కోరారు. ఈ విషయాన్ని ఆయన మేజర్ రియాజ్ అహ్మద్ శుక్రవారం ట్వీట్ చేశారు.
 
తన ఫ్యాన్స్ తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని రజనీకాంత్ కోరినట్టు ఆ ట్వీట్ సందేశం. అంతేకాక ప్రతేడాది రజనీ పుట్టినరోజున ఏర్పాటుచేసే పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లను నెలకొల్పవద్దని ఆయన కోరినట్టు ట్వీట్లో పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత మృతిచెందడంతో ఈ విషాద సమయంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నారని తెలిసింది. ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement