riaz ahmed
-
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు మళ్లీ రెచ్చిపోయారు. మున్సిపల్ కౌన్సిలర్‌ను, ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిని కాల్చి చంపారు. బారాముల్లా జిల్లాలోని సోపోరు పట్టణంలో సోమవారం ఈ దారుణం జరిగింది. మధ్యాహ్నం సోపోరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా గుర్తుతెలియని సాయుధులు లోపలికి ప్రవేశించారు. మున్సిపల్ కౌన్సిలర్ రియాజ్ అహ్మద్, సెక్యూరిటీ గార్డు షఫ్‌ఖాత్ అహ్మద్‌పై తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శంషుద్దీన్ పీర్ అనే మరో కౌన్సిలర్ గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్ డీజీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. దుండగుల దుశ్చర్యపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ దాడిలో లష్కరే తోయిబాకు చెందిన ముదాసిర్ పండిట్ అనే ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముష్కరులను పట్టుకొనేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కౌన్సిల్ సమావేశ మందిరంలోకి చొరబడి ఉగ్రవాదులు కాల్పులు జరపడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని విమర్శించింది. వారిని పట్టుకొని, కఠినంగా శిక్షించాలని బీజేపీ జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా డిమాండ్ చేశారు. మృతులకు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు. ముష్కరుల అకృత్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన రియాజ్ అహ్మద్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గెలిచారు. -
ఫ్యాన్స్‌కు సూపర్‌స్టార్ రజనీకాంత్ విన్నపం!
ప్రతేడాది డిసెంబర్ 12 అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు పెద్ద పండుగ రోజు. ఎందుకంటే ఆ రోజు ఆయన పుట్టినరోజు. రజనీ బర్త్‌డే వేడుకలను పెద్ద ఎత్తున్న సెలబ్రేట్ చేయాలని అభిమానులు తెగ ప్లాన్స్ చేస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరగడం లేదట. 66 వయసులోకి అడుగుపెడుతున్న రజనీకాంత్ తన అభిమానులకు ఓ విన్నపం చేశారు. ఈ ఏడాది తన బర్త్‌డే వేడుకలు నిర్వహించవద్దని కోరారు. ఈ విషయాన్ని ఆయన మేజర్ రియాజ్ అహ్మద్ శుక్రవారం ట్వీట్ చేశారు. తన ఫ్యాన్స్ తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని రజనీకాంత్ కోరినట్టు ఆ ట్వీట్ సందేశం. అంతేకాక ప్రతేడాది రజనీ పుట్టినరోజున ఏర్పాటుచేసే పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లను నెలకొల్పవద్దని ఆయన కోరినట్టు ట్వీట్లో పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత మృతిచెందడంతో ఈ విషాద సమయంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నారని తెలిసింది. ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. -
ఫేస్బుక్ మోసగాడి అరెస్టు
ఫేస్బుక్ ద్వారా స్నేహం చేసుకుని పలువుర్ని మోసం చేసిన నిందితున్ని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 3 లక్షల విలువైన 10 తులాల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుని వివరాలు సోమవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వర రావు, ఎసీపీ వెంకటేశ్వర్లు వివరించారు. మెహిదీపట్నం హుడా కాలనీకి చెందిన రియాజ్ అహ్మద్ అలియాస్ మహ్మద్ యాహ ఉల్ హసన్ అలియాస్ అకిత్ (32) ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాడు. ఫేస్బుక్లో కొద్దిగా అమాయకంగా కనిపించే ఫోటోలను ఎంపికచేసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించేవాడు.. వారు యాక్సెప్ట్ చేయగానే వారి ఫోటోలకు మంచి కామెంట్లు, లైక్‌లు కొట్టి వారు ఆన్లైన్లో ఉన్న సమయంలో చాటింగ్ చేయడం మొదలు పెట్టేవాడు. ఫోన్ నెంబర్లు తీసుకుని పోన్‌చేసి పరిచయం పెంచుకుని ఒక్కసారి కలవాలి అని వారిని పర్సనల్‌గా కలిసి మాటల్లో పెట్టి వారు తాగే మంచి నీళ్లల్లో, కూల్డ్రింక్లల్లో మత్తు పదార్ధం కలిపి.. వాళ్లు స్పృహ తప్పగానే.. వారివద్ద ఉన్న బంగారు ఆభరణాలు, పర్సులు, ఫోన్, ల్యాప్‌ట్యాప్ దోచుకుంటాడు. ఇదే తరహాలో ఇతను నగరంలో పంజగుట్ట, గచ్చిబౌలి, జవహర్‌నగర్, నేరేడిమెట్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో ఒక్కొక్కరిని చొప్పున మోసం చేశాడు. దొంగిలించిన సొమ్ము అమ్ముతుండగా సోమవారం నిందితున్ని పంజగుట్ట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఫేస్బుక్లో అపరిచితులు ఎవరైనా ఫ్రెండ్ రిక్వస్ట్ పంపితే దాన్ని యాక్సెప్ట్ చేయరాదని డిసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. అపరిచితుల పట్ట జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
మైలార్‌దేవ్‌పల్లిలో దొంగ అరెస్ట్
మైలార్‌దేవ్‌పల్లి పరధి పల్లెచెరువులో ఉన్న ఓ కంపెనీలో దొంగతనానికి పాల్పడిన షేక్ రియాజ్ అహ్మద్(20) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 27 న సదరు కంపెనీలో రూ.95 వేలు విలువచేసే 16 బ్యాగుల వస్తువులను దొంగిలించాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి శుక్రవారం అరెస్ట్ చూయించారు. అతని వద్ద నుంచి దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
‘సేవ్ సింగరేణి’ పేరుతో పోరాటం
కోల్‌బెల్ట్, న్యూస్‌లైన్ : సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులలో కోట్ల కుంభకోణం జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు.. కంపెనీని కాపాడుకోవడానికి ‘సేవ్ సింగరేణి’ పేరుతో పోరాటం చేస్తామని హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ చెప్పారు. భూపాలపల్లిలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో *200 కోట్ల అవినీతి జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇందులో అధికారుల పాత్ర అధికంగా ఉన్నట్లు బహిర్గతమైనా యాజమాన్యం వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సకల జనుల సమ్మె కాలంలో సత్తుప ల్లి ఓసీ జీఎం బి-గ్రేడ్ బొగ్గును ఎఫ్-గ్రేడ్‌గా విక్రయించి కాంట్రాక్టర్ వద్ద సుమారు 9 కోట్లు దండుకున్నాడని, ఈ విషయమై యాజమాన్యం విచారణ చేపట్టి ధృవీకరించినా బాధ్యుల పై చర్యలు తీసుకోలేదన్నారు. అదే ఓసీలో ఓబీ పనులు చేయకున్నా అధికారి కాంట్రాక్టర్‌కు 12కోట్లు చెల్లించి పర్సంటేజీలు తీసుకున్నాడని చెప్పారు. ఐదేళ్లక్రితం మేడిపల్లి ఓసీలో 24కోట్ల అవినీతి జరిగిందని, ఏడాది క్రితం అప్పటి ఆర్జీ-1 జీఎం కిషన్రావ్ ఎన్సీసీ కంపెనీకి 24 కోట్లు అదనంగా చెల్లించి 40 లక్షల కమీషన్ తీసుకున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తమ యూనియన్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో 8లక్షలు రికవరీ చేసి కిషన్రావ్ను బదిలీ చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సంస్థలో కోట్లలో అవినీతి జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే వరకు ఏ కార్మికుడికీ చార్జ్‌షీట్ ఇచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. కంపెనీలో డిపెండెంట్ హక్కు పునరుద్ధరించాలని, హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న 3,600 డిపెండెంట్లను ఒకేసారి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిపై గత నెల 31న సీఎండీ సుతీర్థ భట్టాచార్యకు సమ్మె నోటీస్ ఇచ్చామని, యాజ మాన్యం స్పందించని కారణంగా ఈనెల 25న కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు ధన్‌రాజ్, ప్రతాప్‌రావ్, రమేష్, బత్తిని సుదర్శన్‌గౌడ్, రాజేశ్వర్‌రా వ్, దాసు, బ్రహ్మచారి, రాంచందర్ పాల్గొన్నారు.