
ఆహ్వానం ఉన్నవారే ప్లీనరీకి రండి
టీఆర్‌ఎస్ శ్రేణులకు మంత్రి జగదీశ్‌రెడ్డి సూచన
ఖమ్మం: ఖమ్మంలో ఈ నెల 27న జరిగే టీఆర్‌ఎస్ ప్లీనరీకి ఆహ్వానం ఉన్నవారే హాజరుకావాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. ఆదివారం సాయంత్రం ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పాలేరు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైందనే విషయాన్ని విపక్షాలు చెప్పకనే చెబుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. సిట్టింగ్ స్థానం కావడంతో పరువు కోసం కాంగ్రెస్ అభ్యర్థిని నిలుపుతోందని, టీడీపీ పోటీలో నిలవలేక పారిపోయే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.