1. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరోచరిత్ర’ సినిమాలో కమల్‌హాసన్ సరసన నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా?
ఎ) సరిత బి) జయప్రద సి) సుమలత డి) రేవతి
2. ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హీరో సిద్ధార్థ్‌కు తల్లిగా నటించిన ప్రముఖ నటి ఎవరు?
ఎ) జయసుధ బి) శారద సి) గీత డి) కవిత
3. ఈ ఏడాది ఆగస్ట్ 27వ తేదీతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరంజీవి సినిమా ఏంటో తెలుసా?
ఎ) కొదమ సింహం బి) కొండవీటి దొంగ సి) మాస్టర్‌డి) చూడాలని వుంది
4. ‘అల్లరి మొగుడు’ చిత్రంలో హీరో మోహన్‌బాబు సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. ఒకరు మీనా. రెండో హీరోయిన్ ఎవరు?
ఎ) వాణీ విశ్వనాథ్ బి) శోభన సి) దివ్యభారతి డి) రమ్యకృష్ణ
5. నటుడు చంద్రమోహన్ హీరోగా చేసిన మొదటి చిత్రం ‘రంగుల రాట్నం’. ఆ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శక–నిర్మాత?
ఎ) బి.ఎన్. రెడ్డి బి) కె.వి. రెడ్డి సి) హెచ్.యం. రెడ్డి డి) ఆదుర్తి సుబ్బారావు
6. ‘జిల్’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు రాధాకృష్ణ. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరో తెలుసా?
ఎ) ప్రభాస్ బి) నాగార్జున సి) నాని డి) వెంకటేశ్
7. ‘ఏ మాయ చేశావే’ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన నటుడు ఎవరు?
ఎ) సుధీర్ బాబు బి) సందీప్ కిషన్ సి) వరుణ్ సందేశ్ డి) నిఖిల్
8. ఇప్పటివరకు తెలుగులో 5 పాటలు పాడారు ఈ హీరో. ఆయన పాడిన అన్ని పాటలూ ప్రజాదరణ పొందాయి. ఆ టాప్ హీరో ఎవరో కనుక్కోండి?
ఎ) రామ్‌చరణ్ బి) రానా సి) నాగచైతన్య డి) యన్టీఆర్
9. ‘శుభలగ్నం’ చిత్రంలో భర్తను కోటి రూపాయలకు అమ్మేసే క్యారెక్టర్‌లో నటించన నటి ఎవరు?
ఎ) రోజా బి) ఆమని సి) భూమిక డి) సౌందర్య
10. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నర్తించిన నటి ఎవరో తెలుసా?
ఎ) తమన్నా బి) జెనీలియాసి) సమీరా రెడ్డి డి) హన్సిక
11. ‘యమహా నగరి కలకత్తా పురీ.. నమహో హుబ్లీ హౌరా వారధీ...’ పాట రచయిత ఎవరో తెలుసా?
ఎ) భువనచంద్ర బి) వేటూరి సి) సుద్దాల అశోక్ తేజ డి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి
1.2 శ్రీదేవి సోదరి మహేశ్వరి నటించిన హిట్ చిత్రం ‘పెళ్లి’. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) కోడి రామకృష్ణ బి) పి. వాసు సి) బి. గోపాల్ డి) ముత్యాల సుబ్బయ్య
13. వెంకటేశ్, వరుణ్‌తేజ్ ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) అనిల్ రావిపూడి బి) బాబీ సి) సంకల్ప్ రెడ్డి డి) సందీప్ రెడ్డి
14. ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘సినిమా సూపిత్త మామా... నీకు సినిమా సూపిత్త మామా.. సీను సీనుకి నీతో సీటీ కొట్టిస్త మామా...’ పాటను పాడిందెవరు?
ఎ) అనుదీప్ బి) రేవంత్ సి) సింహా డి) హేమచంద్ర
15. ‘నర్తనశాల’ చిత్రంలో ద్రౌపదిగా నటించిన నటి ఎవరో తెలుసా?
ఎ) సావిత్రి బి) వాణిశ్రీ సి) జయలలిత డి) అంజలీదేవి
16. రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ చిత్రానికి సంగీత దర్శకుడు?
ఎ) యస్.యస్. తమన్ బి) హిప్ హాప్ తమిళ సి) యువన్ శంకర్‌రాజా డి) దేవిశ్రీ ప్రసాద్
17. దర్శకుడు సురేందర్ రెడ్డి తన కెరీర్‌లో ఇద్దరు హీరోలతో రెండు చిత్రాలకు పని చేశారు. కానీ ఓ హీరోయిన్‌కు మాత్రం రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఎవరా హీరోయిన్?
ఎ) అమృతా రావు బి) ఇలియానా సి) శ్రుతీహాసన్ డి) రకుల్ ప్రీత్ సింగ్
18. ‘బిగ్ బాస్2’ తెలుగు రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా నాని చేస్తున్నారు. మరి తమిళ ‘బిగ్ బాస్’ కి హోస్ట్‌గా ఏ హీరో చేస్తున్నారు?
ఎ) విజయ్ బి) ధనుష్ సి) కమల్‌హాసన్ డి) శింబు
19. కృష్ణంరాజు, శ్రీదేవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమా లోనిది?
ఎ) త్రిశూలం బి) బాబులు గాడి దెబ్బ సి) బొబ్బిలి బ్రహ్మన్న డి) కటకటాల రుద్రయ్య
20. ఈ క్రింది ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా?
ఎ) కమల్‌హాసన్ బి) హరీశ్ సి) రమేశ్‌బాబు డి) హరికృష్ణ
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) ఎ 2) ఎ 3) డి 4) డి 5) ఎ 6) ఎ 7) ఎ 8) డి 9) బి 10) సి 11) బి
12) ఎ 13) ఎ 14) సి 15) ఎ 16) బి 17) డి 18) సి 19) బి 20) ఎ
నిర్వహణ: శివ మల్లాల
Comments
Please login to add a commentAdd a comment