మళ్లీ జోడీగా... | Shruti Haasan is Ravi Teja is heroine in new film | Sakshi
Sakshi News home page

మళ్లీ జోడీగా...

Published Thu, Oct 31 2019 12:07 AM | Last Updated on Thu, Oct 31 2019 12:07 AM

Shruti Haasan is Ravi Teja is heroine in new film - Sakshi

శ్రుతీహాసన్‌, రవితేజ

‘డాన్‌ శీను’ (2010), ‘బలుపు’ (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని మరోసారి చేతులు కలిపారు. ఇదే సినిమాతో మళ్లీ రవితేజ–శ్రుతీహాసన్‌ జోడీ కుదిరింది. ఈ ఇద్దరూ ‘బలుపు’ చిత్రంలో జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే రెండేళ్ల తర్వాత శ్రుతీ అంగీకరించిన తెలుగు చిత్రం ఇదే. ‘కా టమరాయుడు’ (2017) సినిమా తర్వాత ఆమె తెలుగులో కనిపించలేదు. ఇక తాజా చిత్రం విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని బి. మధు నిర్మిస్తారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement