Ravi Teja Next Movie: Pooja Ceremony of Malineni Gopi Chand, Ravi Teja Upcoming Movie - Sakshi
Sakshi News home page

‘క్రాక్‌’ గా వస్తున్న మాస్‌ మహారాజా

Published Thu, Nov 14 2019 4:46 PM | Last Updated on Thu, Nov 14 2019 5:17 PM

Ravi Teja Next Film Titled Krack Pooja Ceremony - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ కొత్త చిత్రానికి ‘క్రాక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డాన్‌ శీను, బలుపు లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలు ఇచ్చిన గోపిచంద్‌ మలినేని కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమా రాబోతుంది. బాలల దినోత్సవం సందర్భంగా గురువారం ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా టైటిల్‌ పోస్టర్‌తో పాటు రవితేజ లుక్‌ను విడుదల చేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుతన్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

 క్రాక్‌లో రవితేజ సరసన అందాల తార శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు నటించనున్నారు. తమిళ నటుడు సముద్రఖని మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా అదరగొట్టనున్నాడు. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు  ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

. ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement