కాంబినేషన్‌ కుదిరేనా? | Shruti Haasan hangs out with Rana Daggubati and Prakash Kovelamudi | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ కుదిరేనా?

Published Wed, Jun 26 2019 12:09 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Shruti Haasan hangs out with Rana Daggubati and Prakash Kovelamudi - Sakshi

రానా, శ్రుతీహాసన్‌, ప్రకాశ్‌ కోవెలమూడి

‘‘హైదరాబాద్‌ బాయ్స్‌ ఇక్కడ ఉన్నారు...’ అంటూ శ్రుతీహాసన్‌ నటుడు రానా, దర్శకుడు ప్రకాశ్‌ కోవెలమూడితో కలసి దిగిన ఓ ఫొటోను బయటపెట్టారు. అంతే.. ఈ ఫొటో ఆధారంగా కథలు మొదలయ్యాయి. ఇంతకీ ఇక్కడ అని శ్రుతీహాసన్‌ అన్నది ముంబై గురించే. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉన్నారు. అక్కడే ఈ ముగ్గురూ మీట్‌ అయి, సెల్ఫీలు దిగి సందడి చేశారు. దాంతో రానా, శ్రుతి కాంబినేషన్‌లో ప్రకాశ్‌ ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడని వార్తలు మొదలయ్యాయి. ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో శ్రుతీహాసన్‌ తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

అప్పటినుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది. అయితే రానా, శ్రుతీ కలసి యాక్ట్‌ చేయలేదు. మరి.. ఈ కాంబినేషన్‌ ప్రకాశ్‌ సినిమాతో కుదురుతుందా? అంటే వేచి చూడాలి. ‘కాటమరాయుడు’(2017) సినిమా తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్‌ చేయలేదు శ్రుతీహాసన్‌. ప్రస్తుతం ‘లాభం’ అనే తమిళ సినిమా, విద్యుత్‌జమాల్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ హిందీ సినిమా చేస్తున్నారు. అలాగే అమెరికన్‌ వెబ్‌ సిరీస్‌ ఒప్పుకున్నారు. ఎప్పటిలాగే మరోవైపు తన మ్యూజిక్‌ జర్నీని కూడా కొనసాగిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement